Hridayapoorvam OTT Release : ఓటీటీలోకి మోహన్ లాల్, మాళవికా మోహనన్ ఫ్యామిలీ డ్రామా.. ఎప్పుడు? ఎక్కడ?

మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హృదయపూర్వం. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఆగస్టు 28 నుంచి మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పటికే మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హృదయపూర్వం చిత్రం కూడా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓటీటీలో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది? ఎక్కడ చూడాలనే వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి.

దిగ్గజ నటుడు మోహన్ లాల్ చిత్రం హృదయపూర్వం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ ఎల్2 : ఎంపురాన్, తుడురమ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో హృదయపూర్వం చివరకు ఆగస్టు 28, 2025న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించడం విశేషం. ఆయనతో దాదాపు పదేళ్ల తర్వాత సూపర్ స్టార్‌ మోహన్ లాల్ కలిసి పనిచేయడం విశేషం. దీంతో మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

Mohanlal Malavika Mohanan Hridayapoorvam Movie OTT Release Details

ఇక తెలుగు ప్రేక్షకుల్లోనూ మోహన్ లాల్ కు గట్టి ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. గతంలో ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజీ చిత్రంలో ఆయన నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కన్నప్పలోనూ కీలక పాత్రలో మెరిశారు. ఇక ఇప్పుడు ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా హృదయపూర్వం తెలుగు స్టేట్స్ లోనూ విడుదలై థియేటర్లలో రన్ అవుతోంది. ఇటు ప్రేక్షకుల నుంచి అటు బాక్సాఫీస్ నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో హృదయపూర్వం ఓటీటీకి కూడా ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

థియేటర్లలో రన్ అయిన తర్వాత ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలనే దానిపై ప్రేక్షకులకు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో హృదయపూర్వం చిత్రంతో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు ఈ చిత్రం OTTplay ప్రీమియం ద్వారా కూడా ప్రేక్షకులు వీక్షించే అవకాశం ఉండటం విశేషం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రసారం కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత 4 వారాలకు ఓటీటీలోకి వస్తుంది. సెప్టెంబర్ చివరి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక హృదయపూర్వం చిత్రంలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్, సంగీత ప్రతాప్, సంగీత, సిద్ధిక్, నిషాన్, బాబురాజ్, లాలు అలెక్స్, జనార్ధనన్ వంటి అద్భుతమైన సహాయక తారాగణం ఉంది. ప్రముఖ చిత్రనిర్మాత సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించగా, స్క్రీన్‌ప్లేను సోను టీపీ అందించారు. అను మూతెదత్ సినిమాటోగ్రఫీని అందించారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X