For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable 2: 'పఠాన్' దర్శకుడితో ప్రభాస్ మూవీ.. సీక్రెట్ బయట పెట్టిన అగ్ర నిర్మాతలు!

  |

  దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ మూవీతో తెరంగేట్రం చేసిన డార్లింగ్.. బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటినుంచి చేసే ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు ఈ మిస్టర్ పర్ ఫెక్ట్. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. దీంతో ప్రభాస్ తర్వాత సినిమా అయినా సూపర్ హిట్ కావాలని అభిమానులు తెగ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటేకే ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడు. అది కూడా బాలీవుడ్ డైరెక్టర్ తో. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

  పాన్ ఇండియా స్టార్ గా..

  పాన్ ఇండియా స్టార్ గా..


  పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగాడు ప్రభాస్. అలా చాలాకాలంగా తెలుగులో సత్తా చాటుతున్న ప్రభాస్.. దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తూ సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే సాహో, రాధేశ్యామ్ వచ్చిన అవి అంతగా సక్సెస్ కాలేదు.

  వేషధారణపై కాంట్రవర్సీ..

  వేషధారణపై కాంట్రవర్సీ..


  సాహో, రాధేశ్యామ్ కు ఊహించినంత విజయం దక్కపోవడంతో ప్రభాస్ తర్వాత సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ పై యావత్ సినీ ప్రేక్షకులు పెదవి విరిచారు. డైరెక్టర్ చెప్పిన దానికి చూపించిన ఔట్ పుట్ కు ఎలాంటి సంబంధం లేదని అసహనం వ్యక్తం కాగా.. నటీనటుల వేషధారణపై కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది.

   హారర్ కామెడీ నేపథ్యంలో..

  హారర్ కామెడీ నేపథ్యంలో..


  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కామెడీ చిత్రాల డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ (పరిశీలనలో ఉన్న పేరు) చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. హర్రర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17న జరిగాయి.

   ప్రభాస్ పిక్ వైరల్..

  ప్రభాస్ పిక్ వైరల్..

  ఇటీవల ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన రాజా డీలక్స్ చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. స్టార్ క్యాస్టింగ్ తో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా సెట్ లోని లీక్ అయిన ప్రభాస్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో డార్లింగ్ ను చూసిన ఫ్యాన్స్ వింటేజ్ ప్రభాస్ అంటూ కొనియాడారు.

   వీర సింహా రెడ్డి టీమ్ తో..

  వీర సింహా రెడ్డి టీమ్ తో..

  ఇదిలా ఉంటే ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాలో నటించనున్నాడు. తాజాగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. నందమూరి నటసింహం హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ సూపర్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇటీవల ప్రభాస్, గోపిచంద్ వచ్చి సందడి చేయగా తాజాగా ఈ షోకి వీర సింహా రెడ్డి మూవీ టీమ్ వచ్చి అలరించింది. ఇందులో భాగంగానే ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి హాజరయ్యారు.

  సల్మాన్ ఖాన్ తో కూడా..

  సల్మాన్ ఖాన్ తో కూడా..


  అన్ స్టాపబుల్ రెండో సీజన్ తాజా ఎపిసోడ్ లో చరణ్ తో అయిపోయింది.. చిరంజీవి, బన్నీతో అయింది.. బాలకృష్ణతో ఎప్పుడూ ఉంటుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సరే.. ఇప్పుడు ప్రభాస్ తో ఏదో ప్లానింగ్ లో ఉన్నారట కదా అని బాలకృష్ణ అడిగాడు. దానికి "అవును సార్.. హిందీ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ తో కూడా ప్లాన్ చేస్తున్నాం" అని నవీన్ యెర్నేని తెలిపారు. దీంతో అక్కడ కూడా జెండా పాతేంగే అని బాలకృష్ణ నవ్వించారు.

  ఐదేళ్ల విరామం తర్వాత..

  ఐదేళ్ల విరామం తర్వాత..


  సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో పఠాన్ తెరకెక్కించారు. ఈ సినిమా కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ అండ్ న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్స్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ బ్యాంగ్ బ్యాంగ్ సినిమా తర్వాత ఐదేళ్లు బ్రేక్ తీసుకున్న ఆయన వార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు పఠాన్ సినిమాతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  English summary
  Mythri Movie Makers Naveen Yerneni Reveals Prabhas Movie With Bollywood Director Siddharth Anandi In Balakrishna Unstoppable NBK Season 2 Latest Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X