For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Meet Cute Web Series దర్శకురాలిగా నాని సోదరి.. ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?

  |

  సినీ హీరోలు, నటుల కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి రావడం సాధారణమే. ఇప్పటి వరకు కుటుంబ నేపథ్యంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్న విషయం తెలిసిందే. తాజాగా స్వయంకృషితో నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని ఫ్యామిలీ నుంచి ఆయన సోదరి ఇండస్ట్రీలోకి పెట్టబోతున్నారు. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్ త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్నది. మీట్ క్యూట్ వెబ్ సిరీస్ గురించి వివర్లోకి వెళితే..

  మీట్ క్యూట్ కథ ఏమిటంటే?

  మీట్ క్యూట్ కథ ఏమిటంటే?


  మీట్ క్యూట్ (Meet Cute) వెబ్ సిరీస్ గురించి దీప్తి గంటా మాట్లాడుతూ.. గతంలో ఒక షార్ట్ ఫిలిం రూపొందించాను. ఇటీవల ఓ కథ రాసి నానికి వినిపిస్తే.. మరో మూడు, నాలుగు స్టోరీలు రాయి. ఒక అంథాలజీగా చేయవచ్చని అన్నారు. నాని సలహా, సూచనలతో మంచి కథలు రాశాను. అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందనే ఊహాతో మీట్ క్యూట్ కథలు రాశాను. జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో కథలు ఉంటాయి అని అన్నారు.

  నాని హీరోగా మూవీని డైరెక్ట్ చేస్తా

  నాని హీరోగా మూవీని డైరెక్ట్ చేస్తా


  మీట్ క్యూట్ వెబ్ సిరీస్‌లో సత్యరాజ్, అశ్విన్, ఆదా శర్మ ఇలాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషాన్నిచ్చింది. అర్బన్ బేస్డ్‌గా మీట్ క్యూట్ కథ సాగుతుంది. అయినా ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఓ మంచి లవ్ స్టోరి రాస్తే ఆ కథను నాని హీరోగా తెరకెక్కిస్తా. ఇకపైనా మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేస్తాను అని దీప్తి గంటా చెప్పింది.

  దీప్తి స్క్రిప్ట్ ఇస్తే.. చదువలేదు

  దీప్తి స్క్రిప్ట్ ఇస్తే.. చదువలేదు


  సోదరి దీప్తి గంటా వెబ్ సిరీస్ గురించి నాని మాట్లాడుతూ... దీప్తి నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చదవకుండా పక్కన పెట్టాను. చదివిన వాళ్లు చాలా బాగుందని చెప్పడంతో అలాగే చెప్తారని అనుకొన్నాను. కానీ దీప్తి ఒత్తిడి చేస్తే మీట్ క్యూట్ కథను చదవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కథలో లీనమయ్యాను. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నా సోదరి కాకుండా ఎవరు రాసినా నేను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసే వాడిని. స్క్రిప్టు రాసి నాకు ఇచ్చే వాళ్లు ఫోన్ నంబర్ ఇస్తారు. ఈ కథను వేరే వాళ్లు రాసి.. ఫోన్ నెంబర్ ఇవ్వకున్నానేను వాళ్లను వెతికి ఈ సినిమా చేసే వాడిని అని అన్నారు.

   నేను గెస్ట్ రోల్ ఎందుకు చేయలేదంటే?

  నేను గెస్ట్ రోల్ ఎందుకు చేయలేదంటే?


  దీప్తి డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఊహించి ఉంటారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. ఆంథాలజీ అంటే ఒక్కో కథను ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తారు. కానీ ఈ కథను తను ఒక్కరే తెరకెక్కించారు. ఈ సిరీస్ అంతా ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. రోహిణి, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తాం అని నాని అన్నా

  మీట్ క్యూట్ రిలీజ్ ఎప్పుడంటే?

  మీట్ క్యూట్ రిలీజ్ ఎప్పుడంటే?


  నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ సిరీస్‌కు నాని నిర్మాతగా మారారు. ఐదు కథల సంపుటితో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆంథాలజీగా తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో వర్ష బొల్లమ్మ, శ్రీ దివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ శర్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 25 తేదీన సోని లివ్ (Sony LIv) ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో మీట్ క్యూట్ స్ట్రీమింగ్ అవుతున్నది.

  English summary
  Tollywood's Natural Star Nani's Sister Deepti Ganta directed Meet Cute Web Series. Nani has produced This Web Series. Meet cute is to be streaming on Sony Liv on November 25th
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X