Don't Miss!
- News
'వెల్లంపల్లి'కి వెచ్చగా.. 'సామినేని' సెగ?
- Sports
INDvsNZ : టీ20ల్లో గిల్ కథేం బాగలేదు.. పెదవి విరిచిన మాజీ దిగ్గజం
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Connect OTT: ఓటీటీలోకి నయనతార 'కనెక్ట్'.. వాళ్లకే డిజిటల్ రైట్స్, రిలీజ్ ఎప్పుడంటే?
కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ ప్రారంభించిన మలయాళ కుట్టి నయనతార మనస్సినక్కరే సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. విభిన్నమైన సినిమాల్లో అలరించిన నయనతార సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. దాదాపుగా 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వెలుగొందుతోన్న నయనతార మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది. త్వరలో జవాన్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంటర్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా నయనతార కనెక్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ విడుదల హాట్ టాపిక్ గా మారింది.

భర్తతో కలిసి..
నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్ ఇండియా లేడి సూపర్ స్టార్‌గా స్టార్డమ్ సంపాందించుకుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోన్న హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. నచ్చిన కథ దొరికితే వాటిని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఈ భార్యాభర్తలు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న నయన తార పెళ్లి తర్వాత పూర్తిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపైనే ఫోకస్ పెడుతోంది.

నయన్ సినిమాకు లేని హిట్ టాక్..
తాజాగా కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది నయనతార. మాయ, గేమ్ ఓవర్ సినిమాల దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రంలో నయనతారతోపాటు వాన సినిమా హీరో వినయ్ రాయ్, సత్యరాజ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. అనుపమ్ ఖేర్ సుమారు 15 ఏళ్ల తర్వాత తమిళ చిత్రంలో నటించారు. 99 నిమిషాల నిడివి ఉన్న ఈ హారర్ మూవీని ఇంటర్వెల్ లేకుండా ఉండనుందని తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా అనుకున్నంతగా హిట్ టాక్ ను సొంతం చేసుకోవట్లేదు. ఎంతో ఊహించిన ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పవచ్చు.

అప్పటి నుంచే..
ప్రస్తుతం నయనతార తాజా సినిమా కనెక్ట్ డిజిటల్ తెరపైకి ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కనెక్ట్ విడుదలైన రోజే ఓటీటీ పార్టనర్ తో డీల్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తో ఈ సినిమా దర్శకనిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక థియేట్రికల్ షోస్ ముగిసిన తర్వాత కనెక్ట్ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురానున్నారు. అంటే ఒక సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా చూసుకుంటే జనవరి నెల ఆఖరులో కనెక్ట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న హిందీలో కూడా విడుదల చేయనున్నారు.