ఓటీటీలో War 2 సంచలనం... నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్‌ల డిజాస్టర్ మూవీ సరికొత్త చరిత్ర!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్- హృతిక్ రోషన్ నటించిన చిత్రం వార్ 2. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా విడుదలైన వార్ 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచి డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ దెబ్బతో తన స్పై యూనివర్స్ సినిమాలను పున: సమీక్షించాలని యశ్ రాజ్ ఫిలింస్ నిర్ణయించింది. ఇక ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇక్కడ మాత్రం దుమ్మురేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
వార్ 2 బడ్జెట్ ఎంత?
వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా... అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

వార్ 2 బిజినెస్ ఎంత?
వార్ 2 హిందీ వెర్షన్‌ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేసింది. దీంతో అక్కడ ఈ సినిమాకు సుమారుగా 175 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా విలువ కట్టారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 105 కోట్లు) వెచ్చించి తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వార్ 2 మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.
వార్ 2 కలెక్షన్స్
వార్ 2 చిత్రం పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఇండియా వైడ్‌గా ఫస్ట్ డే 52 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే తొలి వారం 204.25 కోట్ల రూపాయలు, రెండో వారం 27 కోట్ల రూపాయలు, మూడో వారంలో 5 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 29 లక్షల రూపాయలు, ఐదో వారంలో 10 లక్షల రూపాయల చొప్పున థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 236.55 కోట్ల రూపాయలు నికర వసూళ్లు... 282.6 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 82 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 364.35 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో వార్ 2 కలెక్షన్స్ పరిశీలిస్తే.. హిందీలో 177.59 కోట్ల రూపాయలు, తెలుగులో 56.74 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. డిస్ట్రిబ్యూషన్ మీద దాదాపుగా 150 కోట్ల రూపాయలు నష్టం రాగా.. ఓవరాల్ కలెక్షన్స్ మీద 300 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది వార్ 2.
నెట్‌ఫ్లిక్స్‌లో వార్ సంచలనం
వార్ 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. 8 వారాల నిబంధన మేరకు అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అదే సమయంలో రజనీకాంత్ నటించిన కూలీ కూడా థియేటర్‌లో మాదిరిగానే, ఓటీటీలోనూ పోటీపడ్డాయి. అయితే ఓటీటీలో మాత్రం వార్ 2 చిత్రం పైచేయి సాధించినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ మీడియా ప్రకటించింది. అక్టోబర్ 6 నుంచి 12 వరకు వచ్చిన వీక్షణల ఆధారంగా వార్ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ల వీక్షణలు వచ్చినట్లు ప్రకటించింది. తద్వారా ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా ఎన్టీఆర్ మూవీ నిలిచింది.
మరోవైపు.. 2.6 మిలియన్ల వ్యూస్‌తో కూలీ రెండో స్థానంలో... 2 మిలియన్ల వ్యూస్‌తో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం మూడో స్థానంలో... 1.5 మిలియన్ల వ్యూస్‌తో మహావతార్ నర్సింహా చిత్రం నాలుగో స్థానంలో... 1.4 మిలియన్ల వ్యూస్‌తో మదరాసి చిత్రం ఐదో స్థానంలో నిలిచినట్లు ఐదో స్థానంలో నిలిచినట్లు ఆర్మాక్స్ మీడియా తెలిపింది.


Click it and Unblock the Notifications











