Paradha OTT Release: పరదా ఓటీటీ రిలీజ్.. అనుపమ పరమేశ్వరన్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుని దూసుకెళ్తున్నారు అనుపమ పరమేశ్వరన్. కథల సెలక్షన్స్, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపుతున్నారు. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తున్నారు అనుపమ. నయనతార, అనుష్క శెట్టి, సమంత వంటి స్టార్ హీరోయిన్లే కాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తాను చేయగలనని నిరూపిస్తున్నారు. గత నెలలో అనుపమ నటించిన జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా టైటిల్‌లో హిందువుల ఆరాధ్య దైవం జానకి పేరు ఉపయోగించడంతో ఏకంగా సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేయడం, విషయం కోర్టుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.
పరదాతో ప్రేక్షకుల ముందుకు
జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు అనుపమ. ఏకంగా మలయాళ సూపర్‌స్టార్ సురేష్ గోపీతో పోటీపడి మరి అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. సరైన పాత్ర దక్కాలే కానీ తనకు ఎదురులేదని అనుపమ నిరూపించుకున్నారు. దీంతో ఈ కేరళ కుట్టికి వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా నటించిన చిత్రం పరదా. ఆగస్ట్ 22న తెలుగు, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్, ఓటీటీ రిలీజ్ డేట్, ఈ వివరాల్లోకి వెళితే..

పరదా తారాగణం
సినిమా బండి, శుభం చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరదా. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించగా.. దర్శనా రాజేంద్రన్, సంగీత, రాజ్ మయూర్, రాజేంద్రప్రసాద్, హర్షవర్ధన్, గౌతమ్ మీనన్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించగా.. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ధరేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై పీవీ శ్రీనివాసులు, విజయ్ దొంకాడ, శ్రీధర్ మక్కువలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పరదా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి పరదా చిత్రానికి 20 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్ని సినిమాయే అయినా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా పరదాను నిర్మించారు. హైదరాబాద్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని అందమైన లోకేషన్‌లలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. టీజర్ , ట్రైలర్, అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమా విడుదలకు ముందే పరదాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పరదా ఓటీటీ రిలీజ్ డేట్
వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ తెచ్చుకున్నారు అనుపమ పరమేశ్వరన్. ఈమె సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ప్రేక్షకుల్లో ఒక ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో పరదా చిత్రం రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రేక్షకులు డిస్కస్ చేస్తున్నారు. పరదా మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత పరదా ఓటీటీలోకి రానుంది. అయితే థియేట్రికల్ రన్ ఆధారంగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ముందుకు రావొచ్చు, ఆలస్యం కావొచ్చు.


Click it and Unblock the Notifications











