Don't Miss!
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Unstoppable 2: ప్రభాస్ ది ఆ దేవుడి పాదమని చెప్పిన బాలయ్య.. లీకైన వీడియో వైరల్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అంతేకాకుండా ప్రభాస్ స్టేజ్ పై కొంతసేపు కనిపించిన చాలు అనుకునే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ప్రభాస్ తో ఒక ఎపిసోడ్ మొత్తం టాక్ షో అంటే దాని క్రేజ్ బీభత్సంగా ఉంటుంది. అలాంటిది నట సింహం బాలకృష్ణతో కలిసి ప్రభాస్ సందడి చేస్తే.. అది అభిమానులు, ప్రేక్షకులు ఊహకే వదిలేసింది తెలుగు ఓటీటీ ఆహా.

60 ఏళ్ల వయసులో..
సినిమాల్లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చింది తెలిసిన సంగతే. ఈ షోలో బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు.

సీనియర్ పొలిటీషియన్స్ వరకు..
'Unstoppable with NBK 2' షో మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసి సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఈ ప్రముఖ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరైన ఈ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో వరుసగా ఎపిసోడ్స్ ను వదిలారు. అందులో యంగ్ హీరోల నుంచి సీనియర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పొలిటిషియన్స్ ఇలా ఎంతోమంది వచ్చి అలరించారు.

రికార్డ్ క్రియేట్ చేసిన ఎపిసోడ్..
అన్‌స్టాపబుల్ 2వ సీజన్ లో ఇప్పటివరకు 5 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఐదో ఎపిసోడ్ లో ప్రముఖ దర్శక నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ కూడా పలు రికార్డులు సృష్టించింది. రెండు రోజుల్లో 30 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించి రికార్డు కొట్టింది. ఇక దీని తర్వాత వచ్చే ఆరో ఎపిసోడ్ పై ఫుల్ బజ్ క్రియేట్ అయింది.

లీకైన వీడియో..
అన్‌స్టాపబుల్ గా సాగుతున్న ఈ షోకి తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతని అత్యంత సన్నిహితుడు గోపీచంద్ కూడా హాజరుకానున్నట్లు ఇటీవల వార్తలు తెగ చక్కర్లు కొట్టిని విషయం తెలిసిందే. అయితే ఇది నిజం అని నిరూపించేలా తాజాగా ఓ వీడియో లీక్ అయింది. ఇందులో ప్రభాస్ ను బాలకృష్ణ సరదాగా నవ్వించే మాటలు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లీకైన వీడియో తెగ వైరల్ అవుతోంది.

వెంకటేశ్వర స్వామి పాదం..
ఈ వీడియోలో ప్రభాస్ డ్రెస్సింగ్, సైజ్ లపై మాట్లాడారు. "నీ షర్టులు అన్నీ 3XL, 4XL యేనా" అని బాలకృష్ణ అడిగితే.. "నాకు షూలు దొరకడం కష్టం. నా షూ సైజ్ 13" అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి బాలకృష్ణ "వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని" అని చెప్పారు. దీంతో ప్రభాస్ తో పాటు అక్కడున్న ప్రేక్షకులందరూ నవ్వేశారు. ఈ వీడియోతోపాటు అన్‌స్టాపబుల్ 2 షోలోని ప్రభాస్ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
|
న్యూ ఇయర్ సందర్భంగా..
ప్రభాస్ హాజరైన అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఆహాలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక నందమూరి బాలకృష్ణ టాకింగ్ స్టైల్ కి ప్రభాస్ క్రేజ్ తోడైతే అది నిజంగా కొత్త సంవత్సరం లానే ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.