Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RRR నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్: ముచ్చటగా మూడో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
తన చిత్రాలతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో వచ్చిన మరో ప్రతిష్టాత్మక సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్‌లో బడా స్టార్లుగా వెలుగొందుతోన్న ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే విడుదలకు ముందే ఇది భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందడంతో ఆరంభంలోనే ఈ సినిమా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి.
టాప్ బటన్స్ విప్పేసిన అషు రెడ్డి: అబ్బో ఇలా చూపిస్తుందేంటి!
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. దీంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కాయి. తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఇది భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం వంద కోట్లకు పైగానే లాభాలను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్లలో దాదాపు యాభై రోజుల పాటు సందడి చేసిన RRR.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించింది. ఇక, ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ జీ5లో, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభం అయింది.

థియేటర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ఎన్నో అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ మూవీకి ఇండియాతో సమానంగా విదేశాల్లోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అలాగే, జీ5లోనూ టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
ఆ భాగాలను చూపిస్తూ పాయల్ వీడియో: అమె వేసుకున్న డ్రెస్ చూశారంటే!
ఇప్పటికే రెండు ఓటీటీ సంస్థల్లో హవాను చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ.. తాజాగా మరో దానిలోనూ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లను అందుబాటులో ఉంచారు. ఇక, ఈ ఓటీటీలో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది విడుదలై చాలా కాలమే అవుతోన్నా.. ఇప్పటికీ అదే రీతిలో ఆదరణ దక్కడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. మళ్లీ ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావడంతో RRR మరోసారి దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇక, ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవేన్‌సన్, అలీసన్ డూడీ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.