The Gray Man ప్రేక్షకులు సీట్లకు అత్తుకుపోయే థ్రిల్లర్‌గా.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

సీట్లకు అత్తుకుపోయి చేసేంతగా ఉత్కంఠకు గురిచేసే విధంగా గ్రే మ్యాన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్దమవుతున్నది. రుసో బ్రదర్స్ తెరకెక్కించిన యాక్షన్ బ్లాక్‌బస్టర్‌‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ది గ్రే మ్యాన్ జర్నీని పుస్తకం ఆధారంగా వెండితెర రూపాన్ని కల్పించారు. ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేస్తుందనే విషయాన్ని రుసో బ్రదర్స్ స్పష్టం చేశారు.

గ్రే మ్యాన్ చిత్రాన్ని ఎలాంటి వ్యయప్రయాసాలకు ఓర్చి తెరకెక్కించామనే విషయాన్ని రుసో బ్రదర్స్ మీడియాకు వివరించారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మా బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి సుమారు 9 సంవత్సరాలు పట్టింది. మార్క్ గ్రీనీ రచన, ఆయన చేసిన పరిశోధన మాకు కొత్త అనుభూతిని కలిగించింది. ఈ తరానికి కొత్ అనుభూతిని కలిగించడానికి విభిన్నమైన, విలక్షణమైన కంటెంట్‌ను సిద్ధం చేశాం అని అన్నారు.

Russo Brotherss The Gray Man movie to stream on 22nd July in Netflix

70వ దశకంలో మేము చూసిన థ్రిల్లర్స్ చూసి స్పూర్తి పొందిన చిత్రాలను బేస్‌గా తీసుకొన్ని గ్రే మ్యాన్ సినిమాను రూపొందించాం. రాజకీయాలపై, ఇతర వ్యవస్థలపై రెబెల్స్ చేసే తిరుగుబాటును, పోరాటాలను అద్బుతంగా చిత్రీకరించాం. ప్రపంచంపై మాకు ఉన్న భయాలతో డిఫరెంట్ జానర్‌గా ది గ్రే మ్యాన్ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు కొత్త ప్రపంచంలోకి వెళ్లి.. కొత్త అనుభూతిని పంచే విధంగా సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. ఈ సినిమాలోని నటీనటుల ప్రతిభ ది గ్రే మ్యాన్ సినిమాను మరో లెవెల్ తీసుకెళ్తుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు గొప్ప ఉత్కంఠను కలిగిస్తుంది అని రుసో బ్రదర్ చెప్పారు.

అత్యంత సాంకేతికతతో కూడిని సినిమాటోగ్రఫితో ది గ్రేమ్ మ్యాన్ సినిమాను రూపొందించాం. లాస్ ఎంజెలెస్, ఫ్రాన్స్, ది చెక్ రిపబ్లిక్, థాయ్‌లాండ్, క్రోషియా, ఆస్ట్రియా, అజర్‌బైజాన్ దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశాం. 70వ దశకంలో రూపొందిన క్లాసిక్ సినిమాలను స్పూర్తిగా తీసుకొన్ని ఈ సినిమాను రూపొందించాం. అదే ఎనర్జీ, సాంకేతిక విలువలు తప్పకుండా ప్రేక్షకులను సీట్లను హత్తుకుపోయేలా చేయడమే కాకుండా కొత్త అనుభూతికి గురిచేస్తాయి అని రుసో బ్రదర్ హామీ ఇచ్చారు.

Russo Brotherss The Gray Man movie to stream on 22nd July in Netflix

ది గ్రే మ్యాన్ సినిమాతో కొత్త అనుభూతిని పొందడానికి మీ క్యాలెండర్‌లో జూలై 22వ తేదీని గుర్తుంచుకొండి. నెట్‌ఫ్లిక్స్ ఫ్లాట్‌ఫాంపై ఎక్ల్సూజివ్‌గా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది అని రుసో బ్రదర్స్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X