twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nijam With Smitha సరికొత్త టాక్ షో.. అన్ స్టాపబుల్ 2 ముగింపు రోజే? వెన్నుపోటు, నెపోటిజం, కులం అంశాలతో

    |

    తెలుగులో ఇప్పటికీ అనేకమైన టాక్ షోలు వచ్చాయి. సుమారు 15 ఏళ్ల క్రితం నుంచే తెలుగులో వివిధ టాక్ షోలు సందడి చేశాయి. మంచు లక్ష్మీ లక్ష్మీ టాక్ షో, అలీతో సరదాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సౌందర్య లహరి, నంబర్ వన్ యారి, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, జయప్రదం, సామ్ విత్ జామ్ వంటి అనేకమైన టాక్ షోలు అలరించాయి. ఇక ఈ మధ్య అయితే నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ కు ఊహించని క్రేజ్ వచ్చింది. త్వరలో ఈ టాక్ షో రెండో సీజన్ ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటీటీలోకి మరొ సరికొత్త టాక్ షో రానుంది. అదే "నిజం విత్ స్మిత". ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో వివరాల్లోకి వెళితే..

     అన్ని ఎపిసోడ్స్ పూర్తి..

    అన్ని ఎపిసోడ్స్ పూర్తి..

    ఇటీవల తెలుగులో టాక్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే చాలా టాక్ షోలు వచ్చి సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కొత్త టాక్ షో రానుంది. ఇండియన్ పాప్ సింగర్, నటి స్మిత హోస్ట్ గా మారిన ఆ టాక్ షో పేరు "నిజం విత్ స్మిత". ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల "నిజం విత్ స్మిత" షోకి సంబంధించిన ప్రోమోలో అతిథులను, వారిని అడిగిన బోల్డ్ ప్రశ్నలు, అంతేవిధంగా వారు చెప్పిన సమాధానాలు అన్నింటిని చూపించారు. ఈ టాక్ షోలో అనేకమైన అంశాలను లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది.

     సినీ ప్రముఖలతో పాటు రాజకీయవేత్తలు..

    సినీ ప్రముఖలతో పాటు రాజకీయవేత్తలు..

    సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న "నిజం విత్ స్మిత" టాక్ షోకి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు రాధికా శరత్ కుమార్, సినిమా హీరోలు నాని, రానా దగ్గుబాటి, అడవి శేష్, అల్లరి నరేష్, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత స్వప్న ద్, డైరెక్టర్స్ దేవకట్ట, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్స్ అన్నింటికి సంబంధించిన ప్రోమోను ఆసక్తికరంగా మలిచి బయటకు వదిలారు నిర్వాహకులు. వాటిలో నెపోటిజం, సినిమాల్లో ఎంట్రీకి కులం, చంద్రబాబు వెన్నుపోటు వంటి డెలికేట్ అంశాలను చర్చించారు.

    వాళ్లంతా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు..

    వాళ్లంతా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు..

    ఈ ప్రోమోలో మాటకు ముందు తర్వాత వెన్నుపోటు వెన్నుపోటు అంటారు అని స్మిత అంటే.. తెలంగాణ సీఎం కూడా భాగస్వామే. అందరం ఉన్నాం అని చంద్రబాబు ఆన్సర్ ఇచ్చారు. అయితే అది వేరే ప్రశ్నకు సమాధానంగా తెలుస్తోంది. సినిమాల్లో ట్రై చేద్దామనా.. ఏంటీ కులం ఏంటీ అంటూ నవ్వుకుంటూ చిరంజీవి అన్నారు. తర్వాత నాని మాట్లాడుతూ.. చరణ్ మొదటి సినిమా కోటి మంది చూశారు. చూసినవాళ్లు కదా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అని అన్నాడు. దీంతో రానా దగ్గుబాటి నవ్వేశాడు. స్వయంగా కెరీర్ లో నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని నెపోటిజం గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

    మహిళలకు పవర్స్ ఉండేవి..

    మహిళలకు పవర్స్ ఉండేవి..

    ఒక సీరియస్ ఎమోషన్ ను లైఫ్ అంతా పెట్టుకుని మనం బతకలేం అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే.. సినిమా వల్ల సమాజం చెడిపోతుంది అనేది చాలా ఓవర్ రేటెడ్ డిస్కషన్ అని దేవ కట్టా చెప్పారు. అనంతరం వ్యక్తిగత ధూషణ, పదజాలం గురించి సాయి పల్లవి మాట్లాడింది. అప్పుడంతా.. మహిళలు పవర్ ఉండేది. కానీ ఎవరో వచ్చి అది స్పాయిల్ చేశారు అని సీనియర్ హీరోయిన్ రాధికా ఆవేదనగా చెప్పారు. సాహసవంతులైన సైనికులు ఒక మూడేళ్లలో చనిపోతారు అనే డైలాగ్ తో ప్రోమోను ఎండ్ చేశారు.

    అన్ స్టాపబుల్ 2 పూర్తి కావడంతో..

    ప్రోమో చాలా ఆసక్తికరంగా, క్యూరియాసిటీగా ఉండటంతో ఈ టాక్ షోపై అంచనాలు పెరిగాయి. ఇక ఇది ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను అయితే ఫిబ్రవరి 10న లేదా ఫిబ్రవరి 17న ముగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే అన్ స్టాపబుల్ రెండో సీజన్ పూర్తికావడంతో "నిజం విత్ స్మిత" టాక్ షో మొదలు పెట్టనున్నట్లు సమాచారం. మహా శివరాత్రి సందర్భంగా ఈ టాక్ షోను ప్రారంభించనున్నారు. ఈ టాక్ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    English summary
    Indian Pop Singer Going To Host Sony Liv Presents Nijam With Smitha Talk Show And It Streaming From February 10 On Sony Liv.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X