Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Babli Bouncer గా తమన్నా భాటియా.. ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
దక్షిణాదిలో అగ్రతారగా రాణిస్తున్న తమన్నా భాటియా మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. చాంద్ సా రోషన్ చెహ్రా చిత్రంతో 15 వయసులోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత హిమ్మత్‌వాలా, ఎంటర్‌టైన్‌మెంట్, హమ్‌షకల్స్ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన బబ్లీ బౌనర్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరించారు.
బబ్లీ బౌనర్స్ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొన్నట్టు తెలియజేస్తూ.. తమన్నా ఎమోషనల్‌గా సుధీర్ఘమైన లేఖను సోషల్ మీడియాలో షేర్ చుేసింది. ఈ సినిమాలోని పాత్ర తన సినీ జీవితంలోనే మరిచిపోలేనటు వంటి రోల్. బబ్లీ బౌనర్స్ నా దృష్టిలో కేవలం సినిమా కాదు.. జీవితకాలం సరిపడే విధంగా మరిచిపోలేని గొప్ప అనుభూతి. బబ్లీ బౌనర్స్ చిత్రం మంచి స్క్రిప్టు కుదిరింది. నా ప్రతిభను మరోసారి రుజువు చేసుకొనే చిత్రం. నా క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను దోచుకొంటుందనే నమ్మకం నాకు ఉంది. బబ్లీ క్యారెక్టర్ అందరికీ చేరువ అవుతుంది అని సోషల్ మీడియాలో తమన్నా భాటియా పోస్టు పెట్టారు.

ఉత్తర భారతదేశంలో అసోలా ఫతేపూర్ అనే ప్రాంతంలోని బబ్లీ అనే బౌన్సర్ పాత్రను తమన్నా భాటియా పోషిస్తున్నారు. కామెడీ, ఫీల్‌గుడ్ అంశాలతో ఈ సినిమాను మధుర్ బండార్కర్ రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మించింది.ఈ చిత్రంలో తమన్నాతోపాటు సౌరబ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వేద్ తదితరులు నటించారు.

బబ్లీ బౌనర్స్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో సెప్టెంబర్ 23వ తేదీ, 2022న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది.
ఇక తమన్నా భాటియా కెరీర్ విషయానికి వస్తే.. భోలే చుడియా, ప్లాన్ ఏ ప్లాన్ బీ, జీ కరదా.. తెలుగులో భోళాశంకర్ చిత్రాల్లో నటిస్తున్నది.