Madharaasi OTT Release Date: మదరాసి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. శివ కార్తీకేయన్ మూవీ ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాలు ప్రస్తుతం భారీ స్కేల్ లోనే విడుదల అవుతుండటంతో మంచి మార్కెట్ కూడా ఏర్పడుతోంది. ఇక శివ కార్తీకేయన్ రీసెంట్ ఫిల్మ్ మదరాసి 5 సెప్టెంబర్ 2025న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించడం విశేషం. యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో విద్యుత్ జమవాల్, బిజు మీనన్ విలన్ పాత్రలు పోషించారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అంచారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొసాగిస్తోంది.2వ వారంలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.95 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది.

థియేట్రికల్ రన్ జోరుగానే కొనసాగుతోంది. ఇంకా 2వ వారం పూర్తి అయ్యే సరికి రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఓటీటీ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మదరాసి ఓటీటీ వివరాలు తాజాగా అందాయి. మదరాసి చిత్రం ఓటీటీ హక్కులు డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. భారీ డీల్ కు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ఇక తమిళ వెర్షన్ ను మాత్రం జీ తమిళ్ సొంతం చేసుకుంది.
ఇక మదరాసి చిత్రం ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. నేటితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 13వ రోజును కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికైతే ఓ మాదిరిగా వసూళ్లను అందుకుంటోంది. దీంతో సినిమా ఓటీటీలోకి అక్టోబర్ 3న అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇంకా దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా రావాల్సి ఉంది. మొత్తానికి థియేట్రికల్ రన్ అలా ముగియగానే వెంటనే మదరాసి చిత్రం ఓటీటీలో ప్రత్యేక్షం కానుంది. థియేటర్లలో ఈ చిత్రానికి కాస్తా మిశ్రమ స్పందనే లభించింది. దీంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మదరాసి చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. భారీ తారాగణం, టాప్ టెక్నిషియన్లు ఈ చిత్రానికి పనిచేయడంతో సినిమా బడ్జెట్ కూడా భారీ ఎత్తునే ఖర్చైంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు ప్రచార వ్యయం అంతా కలుపుకొని సినిమాకు రూ.200 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ చిత్రం రూ.400 కోట్ల గ్రాస్ ను వసూల్ చేస్తేనే లాభాల్లోకి రానుంది. ప్రస్తుతం రూ.100 కోట్ల గ్రాస్ మాత్రమే తిరిగి వచ్చింది.


Click it and Unblock the Notifications











