This Week Movie Releases: మూవీ లవర్స్‌కు ఇక పండుగే.. ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే..

This Week Movie Releases: దీపావళి ధమాకా.. ఈ పండుగ వేళ తెలుగు ప్రేక్షకులు సినిమా సందడిని రెట్టింపు చేయబోతున్నారు. థియేటర్లలో కామెడీ, లవ్, ఫ్రెండ్ షిప్ కంటెంట్ కలిగిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే, ఓటీటీ వేదికలపై ఫ్రెష్ కంటెంట్ కూడా అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ఈ పండుగ వేళ అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆస్వాదించవచ్చు. థియేటర్స్‌లో మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు విడుదల కాబోతుంటే.. ఓటీటీలో యూత్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ ఏడాది దీపావళి వారంలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం!

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు:

1. మిత్రమండలి (Mithra Mandali) - అక్టోబర్ 16
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫ్రెండ్‌షిప్ కామెడీ డ్రామా 'మిత్రమండలి' ఈ నెల అక్టోబర్‌ 16న విడుదల కానుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, భావోద్వేగ క్షణాలను దర్శకుడు విజయేందర్‌ ఎస్. హాస్యభరితంగా చూపించారు. సప్త అశ్వ మీడియా వర్క్స్‌, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై కల్యాణ్‌ మంథెన, భాను ప్రతాప్, డా. విజయేందర్‌రెడ్డి తీగల నిర్మించారు. బన్నీవాస్‌ సమర్పకుడు. సంగీతం ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌, సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్‌ ఎస్జె అందించారు. వెన్నెల కిశోర్‌, సత్య, వీటీవీ గణేశ్‌ లాంటి కామెడీ స్టార్‌లు నవ్వులు పంచబోతున్నారు. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందిన ఈ సినిమా ఫ్రెండ్స్‌ మధ్య బంధాన్ని, అహంకారాన్ని, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ను హృద్యంగా చూపించబోతోంది. ఈ దీపావళికి నవ్వులు పంచే మిత్రమండలి థియేటర్లలో స్నేహం పండుగగా మారనుంది.

This Week Movie Releases Diwali Treat with Comedy Romance amp amp OTT Premieres

2. తెలుసు కదా (Telusu Kada) - అక్టోబర్ 17
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, నీర్‌జ్ కోన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'తెలుసు కదా' తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శ్రీనిధి శెట్టి మరియు రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే, సిద్ధు ఇద్దరు హీరోయిన్స్‌తో ప్రేమలో చిక్కుకున్నట్టు, ఈ ముగ్గురి మధ్య ఎమోషన్లే కథను ముందుకు నడిపిస్తున్నాయని తెలుస్తుంది. కాబట్టి 'తెలుసు కదా' ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో రానున్నది. ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాట్రిక్ పాజిటివ్ టాక్ పొందుతూ ఫ్యాన్స్ కాంటెంట్ క్రియేట్ చేయడానికి కారణమవుతోంది.

3. డ్యూడ్ (Dude) - అక్టోబర్ 17

లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ న‌టుడు ప్రదీప్ రంగనాథన్. మరోసారి యూత్ ఫుల్, లవ్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. అదే 'డ్యూడ్ (Dude)' మూవీ. ఈ సినిమాను కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ యూత్ ఫుల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా మమితా బైజు నటించింది. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయనుంది. ప్రోమోషన్స్ భాగంగా విడుదలైన డ్యూడ్ (Dude)ట్రైలర్, యూత్ ఫుల్, ఎమోషనల్, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో కథ, కేరెక్టర్ డైనమిక్స్, మ్యూజిక్, హ్యుమర్ హైలైట్స్ గా నిలిచాయి.

4. కె-ర్యాంప్ (K-Ramp) - అక్టోబర్ 18
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా జంటగా నటించిన మూవీ 'కె-ర్యాంప్‌. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌లో అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు ప్రేమలో పడిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు, హాస్యసన్నివేశాలు చూపించబడ్డాయి. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ దండ, శివ బొమ్మ నిర్మాతలు గా వ్యవహరించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్‌ వర్స్ చేశారు.

ఓటీటీలో రానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ఈ దీపావళి, తెలుగు ప్రేక్షకులకు రెండు ప్రపంచాల్లో వినోదం అందుతోంది. థియేటర్లలో ఫ్రెండ్‌షిప్, ప్రేమ, కామెడీ కలిసిన సినిమాలు ముస్తాబవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీ వేదికలపై కొత్త సిరీస్‌లు, స్పెషల్ సినిమాలు ప్రేక్షకులను ఎదురుచూస్తున్నాయి.

ZEE5:
కిష్కిందపురి - అక్టోబర్ 17
భగవత్ (సిరీస్) - అక్టోబర్ 17

Aha:
ఆనందలహరి (సిరీస్) - అక్టోబర్ 17

Amazon Prime Video:
పరమ్ సుందరి - ఇప్పటికే స్ట్రీమింగ్‌లో, రెంట్ పై లభ్యం

Netflix:
ది డిప్లొమ్యాట్ సీజన్ 3 - అక్టోబర్ 16
గుడ్‌న్యూస్ - అక్టోబర్ 17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X