ఓటీటీలో దుమ్మురేపుతున్న కింగ్డమ్.. విజయ్ సేతుపతి, పవన్ కల్యాణ్ సినిమాలను మించి..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్డమ్ సినిమా జూలై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు.ఈ చిత్రంలో సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మంచి రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..సూర్య అలియాస్ సూరి కానిస్టేబుల్. ఓ స్పెషల్ ఆపరేషన్‌పై అధికారులు ఆయనను శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో మాఫియా డాన్ శివ (సత్య దేవ్)ను పట్టుకొనేందుకు వెళ్లిన సూరి.. ఏకంగా అక్కడి మాఫియాకు కింగ్‌గా మారుతాడు. తనకంటూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొంటారు. పోలీస్ కానిస్టేబుల్ తన నిర్ణయాన్ని, విధులను మార్చుకొన్నాడు? తన సోదరుడు శివ మాఫియా డాన్ ఎందుకయ్యాడు? తాను కూడా మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకొన్నాడు అనేది ఈ సినిమా కథ.
థియేట్రికల్ జర్నీని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇటీవల ప్రముఖ ఓటీటీ ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రానికి ఓటీటీలో అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఇటీవల రిలీజై అగ్ర హీరోల చిత్రాల కంటే బెటర్‌గా ఆడియెన్స్ ఆదరించడంతో రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయని ఓర్మాక్స్ మీడియా తన రిపోర్టును వెల్లడించింది. ఆగస్టు 25 నుంచి 31 తేదీ వరకు స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా వ్యూవర్ షిప్‌ను ప్రకటించింది. సుమారుగా ఓ ఆడియెన్ 30 నిమిషాలపాటు చూసిన నిడివిని పరిగణనలోకి తీసుకొన్నామని తెలిపారు.
గతవారం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 5 చిత్రాలుగా నిలిచిన ఇండియన్ సినిమాల్లో కింగ్డమ్ టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఈ చిత్రం గత వారం 2.8 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి సినిమా అమెజాన్‌లో భారీగా ఆదరణను సొంతం చేసుకొన్నది. ఈ రెండు సినిమాలతోపాటు విజయ్ ఆంథోని నటించిన మార్గన్ చిత్రం కూడా జియో హాట్ స్టార్‌లో 2.4 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఇక నాలుగో స్థానంలో కాజోల్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో 2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత తెలుగులో సంచలన సాధించిన హరిహర వీరమల్లు చిత్రం 2 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో 5వ స్థానంలో నిలిచింది అని ఓర్మాక్స్ సంస్థ తన రిపోర్టును వెల్లడించింది.


Click it and Unblock the Notifications











