For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable 2: షాకింగ్.. బాలయ్య షోకి వైఎస్ షర్మిల?.. థింకింగ్ మారనుందా?

  |

  నందమూరి నటసింహం బాలయ్య బాబు ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై అదరగొడుతున్నారు. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో హోస్ట్ గా మారారు బాలకృష్ణ. ముందుగా ఆయన హోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తికి మించి ఆయన చేసిన హోస్టింగ్ తెలుగు ప్రేక్షకులును అబ్బురపరిచింది. ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు హోస్ట్ గా చేసి క్లిక్ అయినా బాలకృష్ణ తనదైన కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. మొత్తం సినీ సెలబ్రిటీలతో సీజన్ 1ను సక్సెస్ ఫుల్ గా సాగిన ఈ షో రెండో సీజన్ తో రాజకీయాలను కూడా టచ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించి రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ తోనే పొలిటికల్ కు సంబంధించిన విషయాలు చర్చిస్తామని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో భాగంగానే మరొక పొలిటికల్ నేత వైఎస్ షర్మిల ఈ షోకి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

  60 ఏళ్ల వయసులోనూ..

  60 ఏళ్ల వయసులోనూ..

  నందమారి నటసింహం బాలయ్య బాబు 6 పదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తనదైన జోష్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా మారిన 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే.

   ముఖ్య అతిథిగా సీబీఎన్..

  ముఖ్య అతిథిగా సీబీఎన్..

  సూపర్ సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్న టాక్ షో 'Unstoppable with NBK'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ 'Unstoppable with NBK 2' షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14న ప్రసారం చేశారు. ఈ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయనతో పాటు నారా లోకేష్ కూడా సందడి చేశారు.

  రాజకీయ అంశాలు, ఫ్యామిలీ మ్యాటర్లు..

  రాజకీయ అంశాలు, ఫ్యామిలీ మ్యాటర్లు..


  Unstoppable 2 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రావడంతో సూపర్బ్ రెస్పాన్స్ తో రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. ఈ ఎపిసోడ్ లో రాజకీయాలు, 1990లో టీడీపీలో ఏర్పడిన అనిశ్చితి, అవమానాలు, మోసం వంటి తదితర విషయాలపై చర్చించారు. అంతేకాకుండా నారా లోకేష్ కు పర్సనల్ ఫొటో, దానిపై వచ్చిన ట్రోలింగ్ వంటి తదితర ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలపై మాట్లాడారు.

  పొలిటికల్ సెలబ్రీటీల మనోగతాలు..

  పొలిటికల్ సెలబ్రీటీల మనోగతాలు..

  రాజకీయాలు, కుటుంబవ్యవహారాలు చర్చించడంతో ఆ ఎపిసోడ్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు సినీ సెలబ్రిటీలను రోస్ట్ చేసిన బాలయ్య బాబు పొలిటికల్ సెలబ్రీటీల మనోగతాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. అది హిట్ కావడంతో మరోసారి మరొక పొలిటికల్ లీడర్ ను ఆహ్వానించనున్నారు. ఆ లీడర్ ఎవరో కాదు.. వైఎస్ఆర్ టీపీ అధినేత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైస్ షర్మిల.

  సీఎం జగన్ పై విమర్శలు..

  సీఎం జగన్ పై విమర్శలు..

  ప్రముఖ రాజకీయనాయకురాలు బాలయ్య బాబు టాక్ షోకి వస్తున్నారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఇటీవల షర్మిల తెలంగాణలో సొంతగా పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఆర్ఎస్, తెలంగాణ, ఏపీ సీఎం జగన్ పై విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా టీడీపీకి అనుకూలంగా ఉండే ఏబీఎన్ ఛానెల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో పాల్గొని షాక్ కి గురి చేశారు.

   ఎలాంటి అంశాలు చర్చించనున్నారు..

  ఎలాంటి అంశాలు చర్చించనున్నారు..


  ఇప్పుడు మరోసారి Unstoppable 2 వంటి టాక్ షోలో షర్మిల పాల్గొంటుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే Unstoppable 2 షోని హోస్ట్ చేస్తున్న హీరో బాలకృష్ణ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే (హిందూపురం) కూడా. అందుకే ఈ టాక్ షోకి షర్మిల హాజరవుతుందనే విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఆమె Unstoppable 2 షోకి వస్తే ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించనున్నారనేది యమ హాట్ టాపిక్ అయింది. అందులోనూ బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  English summary
  YSRTP YS Sharmila Will Attend As Chief Guest To Nandamuri Balakrishna Unstoppable 2 Talk Show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X