Don't Miss!
- News
పోలవరం నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ ! నో డీబీటీ.. ఓన్లీ రీయింబర్స్ మెంట్ !
- Finance
Indian Economy: 5 ఏళ్లలో భారత్ అద్భుతాలు.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా.. ఎందుకంటే
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2 లో టాలీవుడ్ టాప్ లెజెండ్స్.. తొలిసారి అత్యధిక గెస్టులతో బాలయ్య సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది సినిమా సెలబ్రెటీలు రాజకీయ నాయకులు షోలో సందడి చేసిన విధానం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు మరి కొంతమంది సీనియర్ నిర్మాతలు ఫిలిం మేకర్స్ బాలయ్య షోలో సందడి చేయబోతున్నారు. ఈ వారమే ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

అదే ఎనర్జీతో సీజన్ 2
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సక్సెస్ అయిన తర్వాత మళ్లీ వెంటనే సెకండ్ సీజన్ కూడా అదే ఎనర్జీతో మొదలుపెట్టారు. ఇక చంద్రబాబు నారా లోకేష్ తో కొనసాగిన మొదటి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి అన్ స్టాపబుల్ షోకు మరింత క్రైజ్ ఏర్పడింది. ఇక ఇటీవల యువ హీరోలు ప్రముఖ దర్శకులు నిర్మాతలు అలాగే సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ షోలో వచ్చి ఆడియన్స్ ను ఎంతగానో కట్టుకున్నారు.

మరోసారి అల్లు అరవింద్
ఇక అన్ స్టాపబుల్ షోలోకి ఈసారి మరి కొంతమంది సీనియర్ లెజెండ్స్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రముఖ నిర్మాతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా అల్లు అరవింద్ మరోసారి సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఆయన మొదటి సీజన్ లోనే తన కొడుకు అల్లు అర్జున్ తో కలిసి ఒక ఎపిసోడ్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆహా ఓటీటీ సంస్థకు మరో అధినేతగా ఉన్న ఆయన ఎలాంటి విషయాలపై స్పందిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

సురేష్ బాబు కూడా..
అలాగే ఈసారి మరో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఆహా షోలకి రాబోతున్నారు. ఆయన గతంలోనే ఒకసారి రావడానికి రెడీ అయినప్పటికీ కుదరలేదు. ఇక ఈసారి అల్లు అరవింద్ సురేష్ బాబు ఒకేసారి అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు. బాలయ్యకు అలాగే సురేష్ బాబుకు ఎప్పటినుంచో మంచి సాన్నిహిత్యమైతే ఉంది.

లెజెండరీ దర్శకులు
అలాగే టాలీవుడ్ చరిత్రలో ఎన్నో కమర్షియల్ సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న లెజెండరీ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, కే.రాఘవేంద్రరావు ఇద్దరు కూడా ఈ షోలోకి రాబోతున్నారు వీరితో ప్రత్యేకంగా బాలకృష్ణ వివిధ రకాల ప్రశ్నలను అడగబోతున్నారు. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా పూర్తయింది. అందుకు సంబంధించిన ఫోటో స్టిల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో.. ఈ ఐదవ ఎపిసోడ్ డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ప్రముఖ దర్శక నిర్మాతలతో పాటు నందమూరి బాలకృష్ణ మరొక లెజెండరీ డైరెక్టర్ కాళతపస్వి కె.విశ్వనాథ్ ను కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఆయనను ప్రత్యేకంగా డిజిటల్ ఇంటర్వ్యూ చేయడానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ అగ్ర దర్శక నిర్మాతలతో బాలయ్య బాబు ఏ విధమైన ప్రశ్నలు అడిగి ఉంటారో చూడాలి.