For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్ సెట్ లో శృంగారం.. కెమెరా ముందు అతని ఇష్టం.. అంటూ బిగ్ బాస్ బ్యూటి షాకింగ్ కామెంట్స్!

  |

  చిత్రవిచిత్రమైన, విభిన్నమైన దుస్తులు ధరించడమే కాకుండా తన అందాలను చూపించి చూపించినట్లుగా ప్రదర్శించి సూపర్ పాపులర్ అయింది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ట్రోలింగ్, వివాదాలతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లోకి అడుగు పెట్టి పరిచయం అయిన భామ తర్వాత సోషల్ మీడియా వేదికగా చేసిన రచ్చతో నెటిజన్లలో నాటుకుపోయింది. ఇప్పుడు తాజాగా సెట్ లో శృంగారం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. మరి ఉర్పీ ఆ కామెంట్స్ ఎందుకు చేసిందనే వివరాల్లోకి వెళితే..

  సినిమా ప్రపంచంలో..

  సినిమా ప్రపంచంలో..

  ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని సోషల్ మీడియా యూజర్స్ ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచడం ఎవరికైనా సాధ్యమా అంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ కు మాత్రమే పాజిబుల్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది.

  సీరియల్స్, రియాలిటీ షోలు..

  సీరియల్స్, రియాలిటీ షోలు..

  సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపలర్ అయిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టింది. అక్కడే పెరిగింది. ఇక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తాను అనుకున్న దారిలో మాత్రం ఊహించినంతగా అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకుని అమ్మడు టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది.

  బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో..

  బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో..

  పలు షోల కోసం ప్రయత్నిస్తున్న ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది. మొదట్లోనే ఆమె గ్లామర్ తో అక్కడ కూడా హడావుడి చేసి.. ఎక్కువ రోజులు ఉండాలని ట్రై చేసింది. కానీ అలా జరగకుండా ఆమె అతి దూకుడు కారణంగా 13వ స్థానంతో సరిపెట్టుకొని మధ్యలోనే ఎలిమినెట్ అయ్యింది.

  రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా..

  రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా..

  బిగ్ బాస్ తరువాత అయినా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది. కానీ ఆమెకు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక మళ్లీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే MTV స్ప్లిట్స్ విల్లా లో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా క్రేజ్ ఏమి రాలేదు. కానీ సోషల్ మీడియాలో చేసిన రచ్చ కారణంగా కీలకమైన జాబితాలో స్థానం సంపాదించుకుంది.

  ఉర్ఫీ షాకింగ్ ఆన్సర్స్..

  ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసింది. ఇదిలా ఉంటే ఉర్ఫీ జావేద్ తాజాగా అమెజాన్ మినీ టీవీలో ప్రసారమయ్యే 'డేట్ బాజీ' అనే డేటింగ్ రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోకి టెలివిజన్ నటుడు, నాచ్ బాలియే 6 సీజన్ టైటిల్ విన్నర్ రిత్విక్ ధంజని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు హాజరైన ఉర్ఫీ జావేద్ ను పలు ప్రశ్నలు వేయగా షాకింగ్ గా ఆన్సర్స్ ఇచ్చింది ఉర్ఫీ.

  నేనేప్పుడు అది ఆలోచించలేదు..

  ఈ షోలో ఒక నటి ఉర్ఫీ జావేద్ గా ఎలా మారింది అని అడిగాడు రిత్విక్. దానికి ఉర్ఫీ జావేద్.. ఉర్ఫీ జావేద్ (సోషల్ మీడియా సెన్సేషన్) లా యాక్సిడెంటల్ గా మారింది అని ముద్దుగుమ్మ రిప్లై ఇచ్చింది. తర్వాత వియర్డ్ ఫ్యాంటసీ ఏంటీ (విచిత్రమైన కోరిక) అని ఉర్ఫీని అడిగాడు హోస్ట్. అందుకు "నేనేప్పుడు అది ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా సెట్ లో" (శృంగారం సెట్ లో చేయాలని చెప్పే అర్థంలో) అని బదులిచ్చింది ఉర్ఫీ. దీంతో హోస్ట్ రిత్విక్ షాక్ అయ్యాడు. తర్వాత మరి కెమెరాలు ఉంటే అని అడగ్గా.. అది ఆ అబ్బాయి ఇష్టం అని కొంటెగా సమాధానం ఇచ్చింది ఉర్ఫీ జావేద్.

  English summary
  Social Media Sensation Urfi Javed Says Her Weird Fantasy Is Doing On Sets In Amazon Mini TV Show Date Baazi With Rithvik Dhanjani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X