Breaking: దళపతి విజయ్ ర్యాలీలో దుర్ఘటన.. తొక్కిసలాటలో 31 మంది మృతి
తమిళ దళపతి విజయ్ నిర్వహిస్తున్న ర్యాలీలో దారుణమైన సంఘటన చోటుచేసుకొన్నది. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మందికిపైగా మరణించారని తెలిసింది. తమిళనాడులోని కోరూర్‌లో జరిగిన సభలో ఈ దుర్ఘటన చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో తాజా సమాచారం ప్రకారం.. 25 మంది పెద్దలు, 6 గురు పిల్లలు మరణించారు అని అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి కథనంలోకి వెళితే..
తమిళగ వెట్రీ కజగం అధినేత విజయ్ ప్రతీ శనివారం నిర్వహించే ర్యాలీలో భాగంగా కరూర్‌లో సభను ప్లాన్ చేశారు. అయితే ఈ ర్యాలీకి ఆయన ఆరు గంటలు లేటుగా వచ్చారు. ఆయన రాగానే ఉత్సాహంతో కార్యకర్తలు,అభిమానులు తోసుకొంటూ వచ్చారు. దాంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించారు అని తెలిసింది.

అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. అనధికార సమాచారం ప్రకారం.. 31 మంది మరణించారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది అని కథనాలు వెలువడుతున్నాయి. తమిళ మీడియాలో 31 మందికిపైగా దుర్మరణం చెందారని అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. సన్ టీవీ కథనంలో 29 మంది మరణించారని తెలిపారు. అయితే తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
అయితే తొక్కిసలాటలో చాలా మంది స్పృహ కోల్పోయారు. 16 మంది మహిళలు, 6 గురు పిల్లలు, 9 మంది పురుషులు మరణించారని ప్రాథమిక సమాచారం. మరికొంత మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయపడిన వారికి సరైన సహాయం అందించాలని పోలీసులను విజయ్ అభ్యర్థించడం కనిపించింది.
ఈ దుర్ఘటన జరిగిన సమాచారం తెలియగానే.. తమిళనాడు ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ హుటాహుటిన కరూర్‌కు వెళ్లారు. ఈ ఘటనపై కరూర్ జిల్లా కలెక్టర్ వీ సెంథిల్ బాలాజీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











