వైఎస్ జగన్ సైకోగాడు.. బాలకృష్ణ మెంటల్ గాడు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారడంతో రాజకీయ, సినీ వర్గాల్లో దుమారంగా మారింది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శాడిస్టుగా వ్యవహరించారు. సినిమా పరిశ్రమలోని పెద్దలను పిలిచి వారిని అవమానించారు అని అన్నారు. అయితే కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ అభ్యంతరం తెలిపి.. మాజీ ముఖ్యమంత్రి సైకోగాడు అని అన్నారు. దాంతో ఈ వివాదం మరింత ఘాటుగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలుత చిరంజీవి, సురేఖ దంపతులను ఆహ్వానించి వారికి భోజనం పెట్టి సన్మానించారు. ఆ సమయంలో పోర్టికోలోకి వెళ్లి ఆహ్వానించారు. అయితే సినీ ప్రముఖులను చర్చలకు పిలిచిన సమయంలో లిస్టు పంపించారు. అందులో బాలకృష్ణ పేరు లేదు. ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవిని ఆహ్వానించారు. అయితే వారి వాహనాలను గేటు బయటే ఆపివేశారు. లోపలికి వెళ్లిన తర్వాత పోసాని కృష్ణ మురళి లాంటి వారి ముందు కూర్చోబెట్టారు. ఆ తర్వాత సీఎం మీతో చర్చలకు రావడం లేదు. సినిమాటోగ్రఫి మంత్రి వచ్చి మాట్లాడుతారని చెప్పి వారిని అవమానించారు అని కామినేని చెప్పారు.

YSRCP leaders Attacks Nandamuri Balakrishna

అయితే సినీ ప్రముఖులతో మాట్లాడేందుకు సీఎం రావడం లేదని తెలిసిన తర్వాత చిరంజీవి గట్టిగా మాట్లాడి.. తప్పకుండా ఆయన రావాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో సీఎం వచ్చి సినీ ప్రముఖులతో మాట్లాడారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీకి తండ్రిలాంటి వారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని సీఎం జగన్‌ను చిరంజీవి కోరారు. అయితే ఆయనను బతిమాలుతున్న వీడియోను లీక్ చేసి సినీ ప్రముఖులును అవమానించారు అని కామినేని చెప్పారు.

అయితే కామినేని శ్రీనివాస్ మాటలకు బాలకృష్ణ అభ్యంతరం తెలియజేస్తూ.. ఇండస్ట్రీ పెద్దలు ఆ సైకో గాడిని కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో సీఎం రానని చెబితే.. చిరంజీవి గట్టిగా అడిగితే వచ్చాడని కామినేని చెప్పడం అబద్దం. ఆ సమయంలో ఎవడూ గట్టిగా అడగలేదు. తాజాగా ఫిలిం డెవలప్‌మెంట్ వాళ్లు ఆహ్వానిస్తే.. నా పేరు 9 స్థానంలో ఉంది. నా పేరు 9వ నెంబర్‌లో ఎవడు పెట్టాడని నేను మంత్రి కందుల దుర్గేష్‌ను అడిగాను. దాంతో ఎవరో తన పేరు అలా వేశారు అని చెప్పారు. ఇది నా విషయంలో చాలా దారుణం అని బాలకృష్ణ ఘాటుగా స్పందించారు.

అయితే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అంటూ నందమూరి బాలకృష్ణ కామెంట్ చేయడంపై వైసీపీ వర్గాలు ఘాటుగా స్పందించాయి. నెత్తిన విగ్గు.. చేతిలో పెగ్గు ఉంటే సరిపోదు. ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలి అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. అయితే పలువురు వైసీపీ నేతలు.. బాలకృష్ణకు మెంటల్.. ఆయనకు అధికారికంగా వైద్యులు సర్టిఫికెట్ జారీ చేశారు అంటూ ఆ పత్రాన్ని బయటకు రిలీజ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు బాలయ్యపై బూతులు అందుకొన్నారు. బాలకృష్ణ మెంటల్ గాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.దాంతో ఈ వివాదం రాజకీయ వర్గాలు హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X