For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  24 కిస్సెస్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

  |

  Recommended Video

  24 Kisses Movie Review 24 కిస్సెస్‌ రివ్యూ | Filmibeat Telugu

  Rating:
  1.0/5
  Star Cast: అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్, శ్రీనివాస కప్పవరపు
  Director: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి

  టాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు ఇటీవల కాలంలో ఆదరణ పెరిగింది. కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్ల ముఖాలు తెలియకున్నా సినిమాను ప్రేక్షకులు గుండెలకు హత్తుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిణుగురు లాంటి ఉత్తమ చిత్రాన్ని అందించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తాజాగా 24 కిస్సెస్‌తో శృంగారభరిత చిత్రాన్ని రూపొందించారు. హెబ్బా పటేల్, అదిత్ అరుణ్ జంటగా నవంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ముద్దు సీన్లతో హడావిడి సృష్టించిన ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకున్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  24 కిస్సెస్ కథ

  24 కిస్సెస్ కథ

  ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్‌‌ను కెరీర్‌గా ఎంచుకొన్న మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ శ్రీలక్ష్మితో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకొంటాడు. సహజీవనంతోనే జీవితాన్ని చాలించాలనుకొనే మనస్తత్వం కలిగి ఉంటాడు. దాంతో ఆనంద్, శ్రీలక్ష్మీ మధ్య అపోహలు పెరిగి లవ్ బ్రేకప్ అవుతుంది.

  24 కిస్సెస్‌లో ట్విస్టులు

  24 కిస్సెస్‌లో ట్విస్టులు

  ఆనంద్, శ్రీలక్ష్మి బ్రేకప్ తర్వాత వారిద్దరూ మళ్లీ కలిశారా? శ్రీలక్ష్మి ప్రేమను పొందడానికి ఆనంద్ తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఆనంద్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి బలమైన కారణమేమిటి? కథలో సైక్రియాటిస్ట్ రాంమూర్తి (రావు రమేష్) పాత్ర ఏంటి? సీనియర్ నటుడు నరేష్ ఎలాంటి పాత్రను పోషించాడు? అసలు 24 ముద్దుల వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే 24 కిసెస్.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  బ్రేకప్‌తో మానసిక సంఘర్షణకు గురైన ఆనంద్ తన స్నేహితుడైన సైక్రియాటిస్ట్ రాంమూర్తి వద్ద ట్రీట్‌మెంట్ రావడంతో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఆనంద్, శ్రీలక్ష్మీ కెరీర్‌తో మొదలుపెట్టి లవ్ మ్యాటర్‌లోకి కథ చేరుకొంటుంది. తొలిభాగంలో పేలవ సన్నివేశాలు, ముద్దుల జడివాన మధ్య ప్రేక్షకుడు చిక్కిపోతాడు. అర్ధంపర్థం లేని రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో బాగానే సాగదీత కనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ కార్డు వేయాలి కాబట్టి బ్రేకప్ సీన్ పెట్టేసి తొలిభాగాన్ని ముగించేశాడు.

  సెకండాఫ్‌ అనాలిసిస్

  సెకండాఫ్‌ అనాలిసిస్

  తొలిభాగంలోనే విషయం లేదనే పరిస్థితి గ్రహించిన ప్రేక్షకులకు సెంకడాఫ్‌‌ను భరించడం భారంగానే కనిపిస్తుంది. సెకండాఫ్‌లోనైనా కథలో వేగం పెంచుతాడా అనే భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. కథ ముందుకు, వెనుకకు వెళ్లే స్క్రిన్ ప్లే గందరగోళానికి గురిచేస్తుంది. ప్రేక్షకుడి సహనం నశించిన తర్వాత చక్కటి భావోద్వేగ అంశాన్ని చూపించి కథకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడి తడబాటుతో సినిమా పరిస్థితి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొనే విధంగా మారింది.

  దర్శకుడిగా అయోధ్య కుమార్

  దర్శకుడిగా అయోధ్య కుమార్

  మిణుగురు లాంటి సినిమాతో ఆకట్టుకొన్న ఆయోధ్య కుమార్ దర్శకుడిగా 24 కిస్సెస్ సినిమా అంటే అంచనాలే పెరిగాయి. అయితే అంచనాలకు దారిదాపుల్లో కూడా సినిమా లేకపోవడం అతిపెద్ద ప్రతికూల అంశం. కనీసం కథ చెప్పడమైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పినా బాగుండేదేమో. హైబ్రిడ్ పాత్రలు, సినీ ప్రేక్షకుల అభిరుచికి దూరంగా దర్శకుడు రాసుకొన్న కథనం విసుగుపుట్టిస్తాయి. కాకపోతే రకరకాల ముద్దులను తెర మీద చూపించడంలో ఫర్‌ఫెక్షన్ కనిపించింది. ఓవరాల్‌గా దర్శకుడిగా అయోధ్య కుమార్ పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

  హెబ్బా గ్లామర్ స్పెషల్..

  హెబ్బా గ్లామర్ స్పెషల్..

  ఇక 24 కిసెస్‌కు బలం, స్పెషల్ అట్రాక్షన్ హెబ్బా పటేల్ గ్లామర్. ఎలాంటి అరమరికలు లేకుండా ముద్దు సీన్లలో మునిగిపోయారు. యూత్‌ మదిలో గిలిగింతలు పెట్టే సీన్లలో బోల్డ్‌గా నటించింది. యూత్‌కు ఇదొక్కటే సినిమాలో నచ్చే అంశం. కీలక సన్నివేశాల్లో కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించింది.

  అదిత్ అరుణ్ ఎనర్జీకి తగినట్టుగా..

  అదిత్ అరుణ్ ఎనర్జీకి తగినట్టుగా..

  హీరో అదిత్ అరుణ్ మంచి ఈజ్ ఉన్న యాక్టర్. అదిత్‌లో ఉండే ఎనర్జీకి తగిన పాత్ర లభించకపోవడంతో అతడి పాత్ర పెద్దగా పండలేకపోయింది. రకరకాల భావోద్వేగాలున్న పాత్రను తెర మీద ఎఫెక్టివ్‌గా, ఎలివేట్ కాలేకపోవడం ప్రధాన మైనస్. ఈ విషయంలో అదిత్‌ను తప్పుపట్టడం సరికాదు. దర్శకుడి అంచనాల మేరకు అదిత్ తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు.

  ఇతర పాత్రల్లో

  ఇతర పాత్రల్లో

  24 కిస్సెస్ చిత్రంలో ఎక్కువగా కనిపించేవి రావు రమేష్, నరేష్ పాత్రలు. సైక్రియాటిస్ట్‌గా రావు రమేష్‌ పాత్ర నిడివి ఎక్కువే, కానీ అంత ప్రభావవంతమైన పాత్ర కాదు. కథకు ఏమాత్రం ఉపయోగపడని రోల్‌లో రావు రమేష్ కనిపించారు. ఇక హెబ్బా తండ్రిగా నరేష్ నటించాడు. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో ఆయన నటన బాగుంటుంది. మిగితావన్నీ పెద్దగా ప్రాధాన్యం లేని, చెప్పుకోవడానికి వీలు లేని పాత్రలే.

  సినిమాటోగ్రఫి గురించి

  సినిమాటోగ్రఫి గురించి

  24 కిస్సెస్ ఏదైనా నచ్చేలా ఉన్నాయంటే అవి సాంకేతిక నిపుణుల పనితీరు మాత్రమే. సినిమాటోగ్రాఫర్ ఉదయ్ గుర్రాల పనితీరు బాగుంది. గోవా, ముంబై, హైదరాబాద్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు కెమెరా పనితనం అదనపు ఆకర్షణ. ఎడిటింగ్‌కు ఇంకా బోలెడ్ స్కోప్ ఉంది. కథలో పస లేకపోవడం వల్ల సినిమా నడివి కూడా మైనస్‌గా మారింది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  24 కిస్సెస్ సినిమాకు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకుడిగా కంటే నిర్మాతగా సినిమా విలువలను కాపాడటంలో సక్సెస్ అయ్యాడు. సాంకేతిక నిపుణుల ఎంపిక బాగుంది. కానీ కథ, కథనాలే పట్టించుకోలేనట్టు అణువణువున కనిపించింది.

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  మ్యూజిక్ డైరెక్టర్ గురించి

  24 కిస్సెస్ సినిమాకు జో బారువా సంగీతం అందించారు. పాటలు పెద్దగా ఆకట్టుకొనేలా లేకపోయినా రీరికార్డింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకర్షణగా మారింది. బలమైన సీన్లు లేకపోవడం వల్ల మ్యూజిక్‌కు కూడా స్కోప్ లేకుండా పోయింది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  అధునిక జీవితంలో యువతీ, యువకుల రిలేషన్‌షిప్, రొమాంటిక్, కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం 24 కిస్సెస్. పసలేని కథ, కథనంతో పేలవంగా తెరకెక్కింది. మంచి సామాజిక సందేశం ఉన్నప్పటికీ అర్థం లేని లాజిక్కులతో ప్రేక్షకుల సహనానికి ఈ సినిమా పరీక్షగా మారింది. మిణుగురు లాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఈ చిత్రాన్ని రూపొందించడం పెద్ద షాకే. మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల స్పందన బట్టే ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

  బలం, బలహీనత

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  సినిమాటోగ్రఫి
  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  దర్శకత్వం
  స్లో నేరేషన్.. ఇంకా చాలా..

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేష్, నరేష్, శ్రీనివాస కప్పవరపు
  కథ, నిర్మాత, దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
  సినిమాటోగ్రఫి: ఉదయ్ గుర్రాల
  ఎడిటింగ్: అనిల్ ఆలయం
  మ్యూజిక్: జో బారువా
  రిలీజ్: 2018-11-23

  English summary
  24 Kisses is a heartfelt romantic comedy movie about modern age relationships and the transformation of the lead characters. This movie is also a celebration of 24 unique kisses varying from romantic to heart-warming.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X