twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 Weds 21 Web Series review: అద్బుతంగా ఆకట్టుకొంటున్న పక్కా లోకల్ వెబ్ సిరీస్!

    |

    Rating:
    3.0/5

    Recommended Video

    Web Series లకి విశేష ఆదరణ.. మొన్న Surya.. ఇప్పుడు 30 Weds 21 || Filmibeat Telugu

    ఓటీటీ, యూట్యూబ్ లాంటి ప్రసార సాధనాలు కథకులు, రచయితలు, దర్శకుల ఆలోచనలకు పదునుపెడుతున్నాయి. కనీస ఆర్థిక వనరులతో అద్భుతమైన కంటెంట్ ద్వారా చిత్రాలను అందించి.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఇటీవల కాలంలో ట్రెండ్‌గా మారింది. ఇసుమంతైన పాపులారిటీ లేని కొత్త నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఊహించని క్రేజ్‌ను సంపాదించుకొంటున్నారు.

    అలాంటి కోవలో అంతా కొత్తవారు కలిసి చేసిన ప్రయత్నం 30 Weds 21 వెబ్ సిరీస్. య్యూట్యూబ్‌లో కొద్ది వారాలుగా రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన ఫలితాన్ని అందుకొన్నది. ఈ వెబ్ సిరీస్ మంచి రెస్సాన్స్ అందుకోవడం వెనుక అసలు విషయం ఏమిటంటే..

    30 Weds 21 కథ..

    30 Weds 21 కథ..

    30 సంవత్సరాల వయసు ఉన్న పృథ్వీ (చైతన్య రావు) తన నాన్నమ్మ కోరికను తీర్చడానికి తండ్రి బలవంతం చేయడంతో అనుకోకుండా 21 ఏళ్ల మేఘన (అనన్య) వివాహం చేసుకొంటాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంతో మేఘనను చిన్నపిల్లదానిగానే చూస్తుంటాడు. కార్తీక్ మానసికంగా సిద్ధం లేకపోవడంతో శోభనం కూడా జరగదు. దాంతో వారిద్దరి మధ్య విభేదాలు, మానసికమైన ఎడబాటు కనిపిస్తుంది. తన కంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాననే ఫీలింగ్‌తో పృథ్వీ.. తండ్రి కోరిక మేరకు ఏజ్ గ్యాప్ ఉన్న పృథ్వీని పెళ్లి చేసుకొన్నాననే భావనలో మేఘన తమ కాపురాన్ని ముందుకు తీసుకోలేక.. ఏటు తేల్చుకొని ఓ సందిగ్ధంలో ఉండిపోతారు.

    30 Weds 21 ట్విస్టులు

    30 Weds 21 ట్విస్టులు

    మేఘనను భార్యగా అంగీకరించలేని పృథ్వీ పరిస్థితి ఏంటి? భార్యగా అంగీకరించలేకపోతున్న పరిస్థితుల్లో మేఘన ఏం చేసింది? వారిద్దరి మధ్య పెరిగిన అభిప్రాయ బేధాలు వారి వైవాహిక బంధంపై ఎలాంటి ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి? వయసు అనేది కేవలం ఓ నంబర్ అనే విషయాన్ని చివరకు పృథ్వీ గ్రహించాడా? పృథ్వీతో విడిపోదామని ఫిక్స్ అయిన మేఘనకు ప్రశ్నకు ఎలాంటి పరిష్కారం లభించింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే 30 Weds 21 వెబ్ సిరీస్.

    దర్శకుడు ఎలా డీల్ చేశారంటే...

    దర్శకుడు ఎలా డీల్ చేశారంటే...

    కొత్తగా పెళ్లైన దంపతులు జీవితంలో చోటు చేసుకొన్న చిన్న క్లాన్‌ఫ్లిక్ట్‌ను బేస్ చేసుకొని కథను నడిపించిన తీరుకు దర్శకుడు పృథ్వీ వనంను అభినందించాల్సిందే. పాత్రలను డిజైన్ చేసిన విధానం, అలాగే ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు చోటు ఇవ్వకుండా డీల్ చేసిన తీరు ఈ వెబ్ సిరీస్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. కేవలం ఒక ఇంటిలో బోర్ లేకుండా ఆద్యంత వినోదం, ఎమోషన్స్‌తో కథ మొత్తం నడిపించిన తీరు చాలా బాగుంది. కొత్త నటీనటులతో టాలెంట్ రాబట్టుకొని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలిచిన తీరు అభినందనీయం.

    లీడ్ యాకర్లు ఎలా చేశారంటే..

    లీడ్ యాకర్లు ఎలా చేశారంటే..

    మేఘన, పృథ్వీ పాత్రల్లోకి అనన్య, చైతన్య పరకాయ ప్రవేశం చేసినట్టే అనిపిస్తుంది. తెర మీద కాకుండా మన పక్క ఇంటిలో దంపతులను చూసినంతగా సహజంగా తమ పాత్రలను పండించారు. పృథ్వీ నేచురల్‌గా బిహేవ్ చేస్తే.. అంతకంటే ఎక్కువగా మేఘన అత్యంత సహజంగా నటించారు. వీరిరద్దరి తమ పాత్రలతో 30 Weds 21 మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. గ్లామర్‌కు అంతగా పాత్రలకు ప్రాముఖ్యత లేనప్పటికీ.. తమ నటనతో ఈ వెబ్ సిరీస్‌కు గ్లామర్‌ను, క్రేజ్‌ను తెచ్చిపెట్టారని చెప్పవచ్చు.

    స్పెషల్ ఎట్రాక్షన్‌గా కార్తీక్ రోల్

    స్పెషల్ ఎట్రాక్షన్‌గా కార్తీక్ రోల్

    మిగితా పాత్రల్లో కనిపించిన కార్తీక్ (మహేందర్) ఈ సినిమాకు వెన్నముకగా నిలిచారు. అత్యంత సహజమైన పద్దతిలో, తనదైన బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాసతో అద్భుతంగా కామెడీని పండించారు. డైలాగ్స్ అలవోకగా చెప్పడమే కాకుండా తన మాటలను తూటాలుగా పేల్చాడు. ఈ కథను మరింత ఫీల్‌గుడ్‌గా మలచడంలో కార్తీక్ పాత్ర అద్భుతంగా తోడ్పడింది. ఇక కార్తీక్ భార్యగా జెస్సీ పాత్రను కూడా ప్రస్తావించాల్సిందే. తనకు ఉన్న కొన్ని సీన్లలో కూడా బాగా రాణించారు. ఆఫీస్‌లో పృథ్వీ కొలీగ్ బంగారం కూడా తన వంతుగా హ్యూమర్‌ను పండించడంలో సహకారం అందించింది. తండ్రి మూర్తీ, మేనేజర్ పాత్రల్లో నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు ఎలా అంటే.

    సాంకేతిక విభాగాల పనితీరు ఎలా అంటే.

    ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. జోస్ జిమ్మీ అందించిన సంగీతం 30 Weds 21‌కు స్పెషల్ ఎట్రాక్షన్. కథను మరింత ఆహ్లాదంగా మలచడంలో, ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడానికి ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడింది. ఇక అతి సున్నితమైన కాన్సెప్ట్‌కు అసమర్ధుడు, మనోజ్ పోడూరి అందించిన డైలాగ్స్, సాహిత్యం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. చాలా కంట్రోల్‌గా, భావోద్వేగంగా డైలాగ్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకొనేలా ఉన్నాయి. తారక్ సాయి ప్రతీక్ అందించిన ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

    ఫైనల్‌గా...

    ఫైనల్‌గా...

    వెబ్ సిరీస్‌లు అనవరపు క్రైమ్, అశ్లీలత, అసభ్యతో కలుషితం అవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో వచ్చిన క్లీన్ అండ్ ఫీల్‌గుడ్ చిత్రం 30 Weds 21‌. ఆర్బాటాలు, హంగులకు దూరంగా ఓ ఆనంద్, గోదావరిలా కథ, కథనాలు సాగిపోయాయని అనిపిస్తుంది. ఫీల్ గుడ్ కామెడీ, హ్యూమర్‌‌తో చాలా చక్కగా ఈ వెబ్ సిరీస్‌ను అందించారు. ఇంటిల్లిపాది చాలా క్షేమంగా, హ్యపీగా చూసే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉందని చెప్పవచ్చు. లాక్‌డౌన్, కరోనావైరస్ భయాలు నెలకొన్న నేపథ్యంలో ఓ ఫీల్‌గుడ్ అందించే వెబ్ సిరీస్ 30 Weds 21‌ అని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఉచితంగా ఈ వినోదాన్ని ఆస్వాదించేలా అందుబాటులో ఉంది. డోంట్ మిస్ 30 Weds 21‌.

    ట్యాగ్ లైన్: క్లీన్ అండ్ హెల్దీ ఎంటర్‌టైనర్

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: మేఘన (అనన్య), పృథ్వీ (చైతన్య), కార్తీక్ (మహేందర్), జెస్సీ (దివ్య) మూర్తి (వీరభద్రం), జానకమ్మ ( శ్రీ కుమారి) మేనేజర్ (నరేంద్ర వనం), వసుధ (అనిత వనం), బంగారం (ప్రసన్న అట్కూరీ)
    దర్శకత్వం: పృథ్వీ వనం
    నిర్మాతలు: అనురాగ్, శరత్
    మ్యూజిక్: జోస్ జిమ్మీ
    సినిమాటోగ్రఫి, డీఐ: ప్రత్యాక్ష్ రాజు
    రచయితలు: అసమర్ధుడు, మనోజ్ పోడూరి
    ఎడిటింగ్, టైటిల్స్, డిజైనర్: తారక్ సాయి ప్రతీక్
    వెబ్ సిరీస్: 6 ఎపిసోడ్స్
    బ్యానర్: చాయ్ బిస్కెట్
    రిలీజ్: యూట్యూబ్

    English summary
    30 Weds 21 Web Series is now top trending in Youtube. This web series consisted with 6 episodes. 30 Weds 21 Web Series well made and will designed with charectes. Its clean and green entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X