»   » ‘3జి లవ్’ మూవీ రివ్యూ...

‘3జి లవ్’ మూవీ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5
హైదరాబాద్: కేవలం యూత్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ మధ్య వచ్చిన ఈ రోజుల్లో, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద సక్సెస్ కావడంతో అలాంటి కోవలోనే.... కేవలం యువతరాన్ని టార్గెట్ చేస్తూ నిర్మించిన చిత్రం 3జి లవ్. గోవర్ధన్‌కృష్ణ దర్శకత్వంలో 26 మంది నూతన తారలతో స్క్వేర్ ఇండియా స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాలేజీ స్టూడెంట్ మధ్య జరిగే ప్రేమ వ్యవహారాల చుట్టూ చిత్రం తిరుగుతుంది. కొందరు ప్రేమించే దశలోనే ఉంటారు. మరి కొందరు ఇద్దరు ముగ్గురిని ప్రేమించి వదిలేసి ఉంటారు. అదే కాలేజీలో దుర్గ అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకు మగాల్లంటే అస్సలు పడదు. మగాళ్లంటేనే మోసగాళ్లు వాళ్లు నమ్మొద్దు అనేది ఆమె సిద్దాంతం. తన తోటి ఆడవాళ్లను కూడా మగాళ్లపై ద్వేషం పెంచుకునేలా పురమాయిస్తుంది.

ఈ సాగుతున్న కథలో... ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయిల మధ్య విబేధాలు ఏర్పడతాయి. అంతా ఒక చోట చేరి అబ్బాయిల మైనస్ లను అమ్మాయిలు అమ్మాయిల మైనస్ లను అబ్బాయిలు ఎత్తి చూపెట్టుకుంటారు. కొన్ని విషయాల్లో అమ్మాయిలు గెలుస్తారు. కొన్ని విషయాల్లో అబ్బాయిలు గెలుస్తారు. అభిప్రాయ భేదాలు తీవ్రమై అంతా విడిపోతారు. చివరకు వీరంతా ఎలా కలిసారు? అనేది క్లైమాక్స్.

ఇతర వివరాలు స్లైడ్ షోలో..

కొత్త నటీనటులంతా అనుభవం లేక పోయినా నటన పరంగా ఫర్వాలేదనిపించారు.

రావు రమేష్ ఓ ముఖ్య పాత్రను పోషించారు.

దర్శకుడికి ఇది తొలి చిత్రం. ప్రేమ విషయంలో నవతరం యువతీ యువకుల ఆలోచనధోరణి ఎలా ఉందనే విషయాన్ని దర్శకుడు ముఖ్యంగా ఫోకస్ చేసాడు.

శేఖర్ చంద్ర అందించి సంగీతం ఫర్వాలేదు. ఇతర టెక్నికల్ విభాగాలు కూడా బాగానే పని చేసాయి.

ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురు ప్రేమికులు, ఒక అబ్బాయి ఇద్దరు ముగ్గురు అమ్మాయితో ప్రేమ వ్యవహారం..తద్వారా జరిగే పరిణామాలు కన్యత్వం మీద నేటి తరం అభిప్రాయాలు లాంటి అంశాలను ఆలోచనాత్మకంగా చూపించారు.

మొత్తానికి ఈ సినిమా నేటి తరం యువతకు నచ్చుతుందో లేదో కానీ..... ఇతర వర్గాల ప్రేక్షకులకు మాత్రం అస్సలు రుచించదు.

ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాత: కృష్ణకిషోర్ ఇట్ల, నిర్మాత: ప్రతాప్ కోలగట్ల.

English summary
The youth-centric Telugu movies like Mem Vayasuku Vacham, Oka Romantic Crime Katha, Ee Rojullo, which dealt with the story of students, have got good opening and had gained instant success Taking a cue from it, debutant director Venkatapathy Raju, who has earlier worked with Nagesh Kukunoor and Neelakanta, has come up with a youthful entertainer 3G Love, which is good time-passer film.
Please Wait while comments are loading...