For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  4 లెటర్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5
  Star Cast: ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా
  Director: ఆర్‌.ర‌ఘురాజ్

  ఎన్నారై యువకుడు ఈశ్వర్ హీరోగా ఏ. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు నిర్మించిన చిత్రం 4 లెటర్స్. ఇటీవల కాలంలో భారీ ప్రమోషన్ మధ్య రిలీజై అన్ని వర్గాలను ఈ చిత్రం ఆకట్టుకొన్నది. యూత్‌ఫుల్, రొమాంటిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో టుయా చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకున్నది. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన ఆ 4 లెటర్స్ ఏంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  4 లెటర్స్ మూవీ కథ

  సంపన్న వ్యాపారవేత్త వర్మ (సురేష్) కుమారుడు అజయ్ (ఈశ్వర్). తన కుమారుడికి బిజినెస్ ఆలోచనలు ఉన్న భార్య రావాలని వర్మ కోరుకొంటాడు. ఆ క్రమంలో మధ్య తరగతి యువతి అంజలి (టుయా చక్రవర్తి)తో అజయ్ ప్రేమలో పడుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల అంజలి తల్లి వారి ప్రేమను వ్యతిరేకిస్తుంది. దాంతో అజయ్‌కి అంజలి బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత మరో యువతి అనుపమ (అంకిత మహారాణా)తో అజయ్ ప్రేమలో పడుతాడు.

  4 లెటర్స్ మూవీలో ట్విస్టులు

  అజయ్‌కి అంజలి బ్రేకప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అజయ్‌తో ప్రేమను అంజలి తల్లి ఎందుకు వ్యతిరేకించింది. అనుపమతో ప్రేమ పెళ్లి వరకు దారితీసిందా? ట్రయాంగిల్ లవ్‌లో అంజలి, అనుపమలో ఎవరిని అజయ్ పెళ్లి చేసుకొన్నాడు? తండ్రి కోరుకొన్న విధంగా అజయ్‌కి భార్య దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 4 లెటర్స్ సినిమా కథ.

  4 లెటర్స్ మూవీ ఫస్టాఫ్

  కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో అజయ్ కథ ప్రారంభమవుతుంది. అంజలి, అజయ్ ప్రేమలోపడటంతో కథ ముందుకు సాగుతుంది. అజయ్, అంజలి మధ్య హాట్ హాట్ సీన్లు ప్రేక్షకులకు కొంత వినోదాన్ని పంచుతాయి. అంజలి కుటుంబంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా అజయ్‌కు అంజలి బ్రేకప్ చెప్పడంతో తొలిభాగం ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో యూత్‌ఫుల్ సీన్లకు, రొమాంటిక్ అంశాలకు పెద్ద పీట వేశారు. యూత్‌కు నచ్చే కామెడీతో సినిమా అలరించే ప్రయత్నం చేసింది.

  4 లెటర్స్ మూవీ సెంకడాఫ్

  ఇక అంజలితో బ్రేకప్ తర్వాత వెంటనే అజయ్ రెండో ప్రేమకథ మొదలవుతుంది. అనుపమ పాత్రలో హీరోయిన్ అకింత మహారాణా హాట్ హాట్ ఎంట్రీతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అజయ్, అనుపమ మరీ ఘాటుగా, నాటుగా సాగిపోతుంది. లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సినిమా చకచకా సాగిపోతుంది. చివర్లో ఇంట్రస్టింగ్ ట్విస్టుతో కథ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల అనుభవ లేమి, కథ, కథనంలో లోపాలు కొన్ని సినిమాకు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు.

  డైరెక్టర్ ప్రతిభ

  దర్శకుడు రఘురాజ్ రాసుకొన్న కథ బాగున్నది. కానీ పాత్రలకు ఎంపిక చేసుకొన్న కొందరు నటీనటుల పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కాలేజీలో తాగుబోతు అటెండర్ క్యారెక్టర్ సినిమా వేగానికి, ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు అవరోధంగా మారిందని చెప్పవచ్చు. నేటితరం యువతను ఆకట్టుకొనే రొమాంటిక్, లిప్ లాక్‌లతో సినిమాను క్రేజీగా రూపొందించారు. డైలాగ్స్ బాగున్నాయి. కనెక్టింగ్ డైలాగ్స్‌తో సీన్ ట్రాన్ఫర్మేషన్ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

  హీరో ఈశ్వర్‌ ఫెర్ఫార్మెన్స్

  హీరో ఈశ్వర్‌కు 4 లెటర్స్ తొలి చిత్రం. తొలుత నటనపరంగా తడబాటు కనిపించినా.. చివర్లో యాక్టింగ్‌లో మెరుగ్గా కనిపించాడు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం, స్వయంగా పాట కూడా పాడి ఆకట్టుకొన్నారని చెప్పవచ్చు. ఫెర్ఫార్మెన్స్ పరంగా ఫర్వాలేదనిపించాడు. అయితే నటన, డ్యాన్సులు, బాడీ లాంగ్వేజ్ పరంగా కొన్ని లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఓవరాల్‌గా ఈశ్వర్ ప్రయత్నం అభినందనీయం.

  హీరోయిన్ల గ్లామర్

  హీరోయిన్ అనుపమఅందం, అభినయంతో మెప్పించింది. ఆకట్టుకొనే హెయిర్ స్టయిల్‌తో మరింత అందంగా కనిపించింది. లత్తుకు మట్టుకు అనే పాటలో బికినీ అందాలతో రెచ్చిపోయింది. టుయా చక్రవర్తి కూడా సాఫ్ట్‌గా, మ్యూజిక్‌పై అభిరుచి ఉన్న యువతిగా మెప్పించింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో ఇద్దరు హీరోయిన్లు వేడిపుట్టించారు.

  మిగితా క్యారెక్టర్లలో

  హీరోకు ఫ్రెండ్స్‌గా ధన్‌రాజ్, తదితరులు నటించారు. వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అంజలికి తండ్రిగా పోసాని తనదైన మార్కు కామెడీని పండించాడు. అన్నపూర్ణ మోడ్రన్ అమ్మమ్మగా ఆకట్టుకొన్నది. హీరో తండ్రిగా సురేష్ ఫర్వాలేదనిపించారు. హీరోకు నాన్నమ్మగా సుధ చివర్లో తనదైన మార్కు డైలాగ్స్‌తో అదరగొట్టింది.

  సాంకేతిక, ప్రొడక్షన్ విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు చాలా రిచ్‌గా ఉంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు సినిమాకు అసెట్ అని చెప్పవచ్చు. సినిమా నడివి కొంత ఎక్కువగానే కావడం కొంత అసంతృప్తిని కలుగుజేస్తుంది. ముఖ్యంగా నిర్మాతలు ఉద‌య్ కుమార్, హేమలత దొమ్మ‌రాజు నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించదు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంది.

  ఫైనల్‌గా

  ఫ్యామిలీ, యూత్, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కిన చిత్రం 4 లెటర్స్. ముక్కోణపు ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో రూపొందింది. డబుల్ మీనింగ్ డైలాగులు, హాట్ హాట్ సీన్లు యూత్‌కు ఎట్రాక్షన్‌గా ఉంటాయి. అయితే నటీనటుల అనుభవలేమి, కథలో కొత్తదనం లేకపోవడం కొంత మైనస్‌గా మారింది. యూత్‌కు ఈ సినిమా కనెక్ట్ అయితే మంచి విజయాన్ని అందుకొనే అవకాశం ఉంది.

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, రొమాన్స్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్
  పాటలు
  డైలాగ్స్
  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  నిడివి
  అంతగా ప్రాధాన్యం లేని పాత్రలు
  నటీనటులు అనుభవలేమి

  తెర ముందు, తెర వెనుక

  ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా, కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్
  పాట‌లు: సురేశ్ ఉపాధ్యాయ‌
  కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌
  ఆర్ట్‌: వ‌ర్మ‌
  మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
  సినిమాటోగ్ర‌ఫీ: చిట్టిబాబుకె

  నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్
  క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్

  English summary
  The youthful entertainer, 4 Letters, produced under the banner of Om Sri Chakra Creations and directed by R. Raghu Raj is set to release on February 22nd. The censor formalities have been completed and the movie has received an A certificate. The movie stars debut actor, Eswar, as well as debut actresses, Anketa Maharana and Tuya Chakraborthy. The cast also includes Suresh, Posani, Sudha, Kousalya, Annapurnamma, and Satya Krishnan among others. The music director for the film is Bheems Ceciroleo who is known for his mass hits has given upbeat, folk numbers in 4 Letters. The movie 4 Letters is comedy filled and contains a heartfelt message for college students about their education, love and personal life. Watch 4 Letters in theaters on February 22nd.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more