For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  47 డేస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5

  ప్రముఖ దర్శకుడు కే బాలచందర్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 47 డేస్ అనే సినిమాకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాంటి టైటిల్‌తో మళ్లీ ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజం. యువ హీరో సత్యదేవ్ హీరోగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి కలయికతో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  47 డేస్ కథ ఇదే..

  47 డేస్ కథ ఇదే..

  వైజాగ్‌లో ఏసీపీగా పనిచేసే సత్య (సత్యదేవ్) ఆరు నెలల సస్పెన్షన్‌లో ఉంటారు. తన భార్య పద్దు (రోషిణి ప్రకాశ్) సూసైడ్ విషాదంతో బాధపడుతూ.. ఆమె మరణం వెనుక కారణాలను అన్వేషిస్తుంటాడు. అదే సమయంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రెండు మరణాలకు పోలీకలు ఉండటంతో అధికారులు దృష్టికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఆ కేసు ఫైల్స్ మూసి వేయడం వల్ల దర్యాప్త చేయడానికి పోలీసు కమిషనర్ నిరాకరిస్తారు. అయితే తన ప్రయత్నాలను మానుకోకుండా రాజారాం అనే హెడ్ కానిస్టేబుల్‌ సహాయంతో దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలియట్ (పూజా జవేరి) అనే యువతి ఈ దర్యాప్తులో కీలకంగా మారుతుంది.

  కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  తన భార్య పద్దు మరణానికి అసలు కారణమేమిటి? అదే క్రమంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు మృతి వెనుక వాస్తవాలు ఏమిటి? సత్య దర్యాప్తులో తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ రవి (రవి వర్మ) ఎలాంటి పాత్ర పోషించాడు? ఇక రాజారాం హెడ్ కానిస్టేబుల్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహకారం అందించారు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు జరిగిన రెండు మరణాలు లింక్ ఏమైనా ఉందా? జూలియట్ ఈ దర్యాప్తులో ఎంత వరకు ఉపయోగపడిందనే చిక్కు ముడులకు సమాధానమే 47 డేస్ సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  వైజాగ్‌ బీచ్‌లో శ్రీనివాసరావు మరణంతో 47 డేస్ కథ మొదలవుతుంది. ఆ కేసు సత్యదేవ్ దృష్టికి రావడం తన భార్య పద్దు మరణంతో సారుప్యత ఉండటం లాంటి అంశాలు సత్యదేవ్‌లో పలు అనుమానాలను కలిగిస్తాయి. అలా తన అనుమానాలను స్నేహితుడు రవి, హెడ్ కానిస్టేబుల్‌తో షేర్ చేసుకొంటూ సొంతంగా దర్యాప్తు చేపడుతాడు. సస్పెన్షన్ కారణంగా ప్రైవేట్‌గా దర్యాప్తు చేస్తున్న సత్యదేవ్ కొన్ని క్లూస్ లభిస్తాయి. అయితే ఇన్వెస్టిగేషన్ బేస్డ్ కాబట్టి, బలమైన సన్నివేశాలు, ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే అంశాలు ఉంటే సినిమా ఆసక్తిగా మారడానికి అవకాశం ఉండేది. అలా ఫస్టాఫ్ సాదాసీదాగా నడిచిపోతుంది.

  సెకండాఫ్‌ అనాలిసిస్

  సెకండాఫ్‌ అనాలిసిస్

  ఇక సెకండాఫ్‌లోనైనా కథలో ఇంటెన్సిటీ, దర్యాప్తులో నూతనత్వం, మంచి సన్నివేశాలు ఉంటాయని ఆశించిన వారికి నిరాశే కలుగుతుంది. రొటీన్‌గా ఇన్వెస్టిగేషన్ సాగడం స్క్రిప్టులో అనేక లోపాలు ఉండటంతో ప్రేక్షకుడికి ఎలాంటి థ్రిల్లింగ్ కల్పించలేకపోతాయి. దత్తత తీసుకొన్న కూతురు యాంగిల్‌లోనైనా కనీసం కథను ఎమోషనల్‌‌గా మార్చడంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొన్నారు. క్లైమాక్స్‌లో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రను కీలకంగా మార్చి కథలో వేగాన్ని పెంచడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే అప్పటికే సినిమాలో పసలేదనే విషయం అర్ధమౌపోతుంది. అలా ఎలాంటి భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథనం లేకుండా చప్పగా సినిమా ముగుస్తుంది.

  దర్శకుడు ప్రదీప్ మద్దాలి గురించి

  దర్శకుడు ప్రదీప్ మద్దాలి గురించి

  దర్శకుడు ప్రదీప్ మద్దాలి రాసుకొన్న స్క్రిప్టులోనే చాలా లోపాలు ఉన్నాయి. నాసిరకమైన స్క్రీన్ ప్లే కారణంగా కథలో ఇన్వెస్టిగేషన్ తీరు ఆకట్టుకోలేకపోయింది. క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కడా కనిపించవు. కథాపరంగా బలంగా ఉండి ఉంటే డైరెక్షన్ పరంగా కూడా ఆకట్టుకొని ఉండే వారేమో అనిపిస్తుంది.

  సత్యదేవ్ యాక్టింగ్

  సత్యదేవ్ యాక్టింగ్

  ఏసీపీ సత్యగా మరోసారి సత్యదేవ్ తన వంతుగా పాత్రకు న్యాయం చేశారు. తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారనిపిస్తుంది, కాని కథలో అసలు విషయమే లేకపోవడంతో సత్యదేవ్ ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇద్దరు హీరోయిన్లు పూజా జవేరి, రోహిణి ప్రకాశ్ పాత్రలు కూడా అంతగా రిజిస్టర్ కాలేకపోతాయి. రవివర్మది రొటిన్ పాత్రే. కొంతలో కొంత శ్రీకాంత్ అయ్యంగార్ ప్రీ క్లైమాక్స్‌లో సినిమాను ఆదుకొనే ప్రయత్నం చేశారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  ఇక సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. మ్యూజిక్ విషయంలో రఘు కుంచె ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. పాటలు చాలా నాసిరకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల రీరికార్డింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. జీకే సినిమాటోగ్రఫి బాగుంది. వైజాగ్‌ను మరోసారి అందంగా, ఆకర్షణీయంగా చూపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మిగితా విభాగాలు పనితీరు కూడా అంతంత మాత్రమే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథపై కాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా బాగుండేదేమో అనిపిస్తుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఓవరాల్‌గా 47 డేస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేని సాదాసీదా క్రైం థ్రిల్లర్. బలహీనమైన స్క్రీన్ ప్లే, సరైన కథాబలం లేకుండా తీసిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమాకు కాస్త గౌరవం దక్కే అవకాశాలు పెరిగాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి ప్రయత్నంలో నిజాయితీ కనిపించినా కథలో లోపాల కారణంగా ఆశించినంత ఫలితం దక్కకపోవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ నటన

  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్

  కథ, కథనాలు

  నటీనటులు ఎంపిక

  ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గురిచేసే ట్విస్టులు లేకపోవడం

  తెరవెనుక, తెర ముందు

  తెరవెనుక, తెర ముందు

  నటీనటులు: సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్, పూజా జవేరి, రోహిణి, రవివర్మ. సత్య ప్రకాశ్ తదితరులు

  దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

  సంగీతం: రఘు కుంచె

  సినిమాటోగ్రఫి: జీకే

  రిలీజ్: 2020-06-30

  ఓటీటీ రిలీజ్: జీ5

  English summary
  47 Days movie review and Rating: 47 days movie is directed by Pradeep Maddali, the mystery-drama comes with an interesting plot. Satyadev plays ACP Sathya, who, while accidentally analysing a case similar to the death of his wife (played by Roshni Prakash), has to confront savage villains from unexpected quarters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X