twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పస లేని.... (‘ఆంధ్రా పోరి’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    మరాఠీలో ఘన విజయం సాధించిన 'టైమ్ పాస్' చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం టైమ్ పాస్ గా అయినా వర్కవుట్ అయ్యి పాస్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే రీమేక్ ను మన నేటివిటీకి తెవటం ఒకటే కాకుండా...ఆ సినిమాలో వర్కవుట్ అయిన ఇన్నోసెన్స్ లవ్ ను ..ఇక్కడ తెరపైకి అనువదించి...మన భావోద్వేగాలతో కనెక్టు చేసినప్పుడే నడుస్తుందనే విషయం దర్శకుడు మర్చిపోయారు. ముఖ్యంగా నైంటీస్ లలో నడిచే ఈ కధని అదే కాలం నాటి టేకింగ్ తో బోర్ కొట్టే నేరేషన్ తో తెరకెక్కించారు. అలాగే ప్రధాన పాత్రల నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేకపోవటంతో సినిమా ఆషామాషి వ్యవహారంగా..టైమ్ పాస్ కు కూడా కష్టమనిపించేలా అనిపించింది. అలాగే తెలంగాణా కుర్రాడు, ఆంధ్రా అమ్మాయి లవ్ స్టోరీ అంటూ ప్రాంతీయను గుర్తు చేసే ఎత్తుగడ ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నారో కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నిజామాబాద్ కుర్రాడు నర్సింగ్ (ఆకాష్ పూరి) ఓ పేద కుర్రాడు. అతని తల్లి యాదమ్మ(ఈశ్వరి) కు తన కొడుకు బాగా చదువుకుని గొప్పవాడవ్వాలనేది కల. అయితే నర్శింగ్ అందుకు విరుద్దంగా ఆవారాగా తిరుగుతూంటాడు. అంతేకాకుండా...అదే కాలనీలో ఉండే ప్రశాంతి(ఉల్కా గుప్త) తో ప్రేమలో పడతాడు. మొదట్లో ప్రశాంత్ పట్టించుకోకపోయినా తర్వాత యస్ అంటుంది. అక్కడ నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూంటారు. అయితే వీరి ప్రేమకు ..ప్రశాంతి తండ్రి గోపాలరావు(డా.శ్రీకాంత్) అడ్డుపడతాడు. ఆ తర్వాత ఏమైంది...వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుంది...నర్సింగ్ తల్లి కల ఏమైంది అనేది మిగతా కథ.

    Aaksash puri's Andhra Pori  review

    ఆంధ్రా పోరీ టైటిల్, తెలంగాణా కుర్రాడు, ఆంద్రా అమ్మాయి లవ్ స్టోరీ అన్నట్లుగా వచ్చిన ప్రోమోలు..అప్పట్లో వచ్చిన జై బోలో తెలంగాణా తరహాలో ఏదైనా ప్రాంతీయతల మధ్య నలిగిపోయిన ఓ లవ్ స్టోరీ అనుకుని థియోటర్ కు బయిలు దేరతారు. అయితే లోపలకు వెళ్లాక అర్దమవుతుంది ..దర్శకుడు కేవలం ఆసక్తి రేపి, జనాలను ఎట్రాక్ట్ చేయటానికే ఆ టైటిల్ పెట్టాడని. దాంతో మొదట నిరాశ మొదలవుతుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ కథ... పరమ రొటీన్ గా ఎన్నో సార్లు చూసిన సీన్స్ కథ వస్తూంటుంది. సర్లే కథ కు ఏముంది...పాత దయినా...కొత్త సీన్స్ తో అదరకొడతాడు అనుకుంటే అవీ అలాగే వస్తూంటాయి.

    ముఖ్యంగా మరాఠీలో వర్కవుట్ అయ్యింది... ఇన్నోసెన్స్ . ఇంకా పరిపక్వతకు రాని ఇద్దరు మధ్య లవ్ స్టోరీ మన గతంలోకి తీసుకుపోతుంది. కానీ తెలుగుకు వచ్చేసరికి...కమర్షియాలిటి కోసమో లేక క్రియేటివిటీ అనకున్నారో కానీ కొత్త సీన్స్ జత చేసి ఆ ఫీల్ ని కట్ చేసేసారు. సినిమా డబ్ చేసినా బాగుండేది అనిపించేలా తయారైంది.

    సంగీతం విషయానికి వస్తే...పాటలు వినటానికి బాగానే ఉన్నా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. సిగెరెట్ సాంగ్స్ లాగ అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సరిగ్గా చేయలేదు. దర్శకుడుగా రాజ్ మాదిరాజు...జస్ట్ ఓకే అనిపించాడు. డైలాగ్స్ ,వన్ లైనర్స్ ఇంకాస్త ఇంప్రెసివ్ గా ఉంటే ఇంట్రస్టింగ్ గా ఉండేది. ఎడిటింగ్ కూడా శ్రీకర్ ప్రసాద్ గారు ఇంకాస్త ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ట్రిమ్ చేస్తే మైనస్ లు మరికాస్త తగ్గేవి.

    ఫైనల్ గా... రీమేక్ లలో కనపడే పెద్ద సమస్య అయిన.. ఒరిజనల్ లోని మ్యాజిక్ ని రిపీట్ చేయటం కష్టమని, అది క్రియేట్ చేయటం మరింత కష్టమని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పటికే మరాఠి సినిమా టైమ్ పాస్ చూసి ఉంటే...దాన్ని తెలుగులో ఎలా దించారో సినిమావాళ్లు చూడవచ్చు. చూడనివాళ్లు 'టైమ్ పాస్' సినిమానే చూడటం బెస్ట్......ఇప్పటికే ఆంధ్రాపోరిని చూసేసి ఉంటే... ఒరిజనల్ 'టైమ్ పాస్' ని చూసి... సేద తీరవచ్చు.

    బ్యాన‌ర్‌ : ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్

    నటీనటులు : ఆకాష్ పూరి, ఉల్కా గుప్త, పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ ఇతర తారాగణం
    ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ,
    పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె,
    పి.ఆర్.ఒ: సురేంద్రనాయుడు,
    సంగీతం: డా.జోశ్యభట్ల .,
    ఆర్ట్: రాజీవ్ నాయర్,
    ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్,
    సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి,
    డాన్స్: చంద్రకిరణ్,
    పాటలు: సుద్ధాల ఆశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల
    నిర్మాత: రమేష్ ప్రసాద్,
    దర్శకుడు: రాజ్ మాదిరాజ్.
    విడుదల తేదీ: 05, జూన్, 2015.

    English summary
    Puri Jagannath's son Akash Puri's debut film Andhra Pori is releasing today in a grand manner with divide talk. The film is a remake film of Marathi hit 'Time Pass'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X