For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆవిరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  1.5/5

  అల్లరి లాంటి వినోదాత్మక చిత్రంతో అందర్నీ మెప్పించిన దర్శకుడు రవిబాబు.. మనసును హత్తుకునే ఎన్నో మంచి ప్రేమకథలను కూడా తెరకెక్కించాడు. కాస్త రూట్ మార్చి అమరావతి, అనసూయ, అవును లాంటి థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చివరగా అదుగో అంటూ విభిన్న చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించగా.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు ఆవిరి అనే చిత్రంతో ఈ శుక్రవారం (నవంబర్1) ముందుకు వచ్చాడు. మరి రవిబాబు ఆశించిన విజయాన్ని ఆవిరి అందించిందో లేదో ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  ఆస్తమా భారిన ఇద్దరు పిల్లలు మున్ని, శ్రేయ (శ్రీ ముక్తా) రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులు జీవితాన్ని గడిపేస్తుంటారు. తన నిర్లక్ష్యం మూలాన రాజ్ తన పెద్ద కూతురు శ్రేయాను కోల్పోవాల్సి వస్తుంది. ఆ విషాదం నుంచి బయటపడేందుకు మరో ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లిన మున్ని (శ్రీ ముక్తా) విచిత్రంగా ప్రవర్తిస్తుంది. చనిపోయిన తన అక్కతో మాట్లాడుతూ ఉంటుంది. తండ్రి మూలానే తాను మరణించినట్లు భావించిన పెద్ద కూతురు.. చెల్లెల్ని కూడా అలాగే చంపేస్తారని భావించి.. కనబడని రూపంలో ఆత్మగా మారి మున్నీని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే చివరకు మున్నీ కనిపించకుండా పోతుంది. మున్నీ ఎక్కడికి వెళ్లింది? ఎవరు తీసుకెళ్లారు? కొత్త ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? అసలు ఆ ఆత్మ ఎవరిది? దానికి రాజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే కథ.

  కథలో ట్విస్ట్‌లు

  కథలో ట్విస్ట్‌లు

  మున్నీ ఎవరితో మాట్లాడుతుంది? మున్నీని తీసుకెళ్లింది ఎవరు? ఎక్కడ దాచిపెట్టింది? రాజ్ భార్య లీనాలో ప్రవేశించిన జాన్వీ ఆత్మ ఎవరిది? జాన్వీకి రాజ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? జాన్వీ చివరకు ఏమైంది? చివరకు మున్నీ తన తల్లిదండ్రుల వద్దకు చేరిందా? అనేవి ఆసక్తికరంగా ఉంటాయి.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  మున్నీ విచిత్రంగా ప్రవర్తించడం, ఆవిరి రూపంలో వచ్చిన ఆత్మతో మాట్లాడటం లాంటి సీన్స్‌తో ఫస్టాఫ్‌ను లాగించేశాడు. తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండే రాజ్.. మున్నీ అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, తనతో కాసేపు కూడా ప్రేమగా మాట్లాడకపోవడం, పదే పదే ఇంట్లోంచి పారిపోవాలని ప్రయత్నించే సీన్స్‌తో ఫస్టాఫ్‌ను కాస్త బోర్ కొట్టించాడు. మున్నీపై రాజ్ అరిచిన ప్రతీసారి తన మీద దాడి జరగడం.. అవన్నీ మున్నీనే చేస్తుందని కోపగించుకోవడం.. తాను అలా చేయడం లేదని మున్నీ చెప్పినా వినకపోవడం.. చివరకు మున్నీ అదృశ్యం కావడం లాంటి అంశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  సెకండాఫ్ అనాలిసిస్

  అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. మున్నీ మిస్ అవడంతో రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్ వినోద్ (ముక్తా ఖాన్), అతని ఫ్రెండ్ డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్) ఎంటర్ అవ్వడంతో కథనం కాస్త ముందుకు వెళ్తుంది. తన నిర్లక్ష్యం వల్లే తన పెద్ద కూతురు చనిపోయిందని తెలుసుకున్న పవన్ శర్మ.. మున్నీ మిస్సింగ్ కేసుకు లింక్ చేయడం.. తన భార్య లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్‌పై లీనా దాడి చేయడం, తనలో ఉన్న ఆత్మ జాన్వీది అని తెలుసుకోవడంతో కథ ఇంట్రెస్టెంటిగ్‌గా మారుతుంది.

  నటీనటుల పర్ఫామెన్స్..

  నటీనటుల పర్ఫామెన్స్..

  తక్కువ పాత్రధారులతో తెరకెక్కించిన ఆవిరిలో అందరూ బాగానే నటించారు. ముఖ్యంగా మూడు పాత్రలు సినిమా మొత్తం కనిపిస్తాయి. రాజ్, లీనా, మున్నీల చుట్టే కథ తిరిగినా.. సందర్భానుసారంగా వచ్చే పోలీస్ పాత్ర, డాక్టర్, జాన్వీ పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. బిగ్‌బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న హిమజ కమల పాత్రలో కనిపించింది ఒక్క సీన్‌లోనే అయినా పర్వాలేదనిపించింది.

  రవిబాబు, నేహా, శ్రీ ముక్తాల నటన

  రవిబాబు, నేహా, శ్రీ ముక్తాల నటన

  తనకు అలవాటైనా ఎక్స్‌ప్రెషన్స్‌తో రవిబాబు చాలా ఈజీగా నటించేశాడు. ఒకటి రెండు చోట్ల కామెడీ కూడా పండించాడు. అయితే సినిమా మొత్తం సీరియస్ లుక్‌లోనే కనబడ్డాడు. ఇక నేహా చౌహాన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించినా.. దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో విసుగుపుట్టించింది. సినిమా మొత్తం కనిపించిన శ్రీ ముక్తా పర్వాలేదనిపించింది.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ఆవిరి పాయింట్ వినడానికి కొత్తగా ఉన్నా.. ఎంచుకున్న కథ, కథనం మాత్రం రొటీన్‌గా ఉంది. ఆత్మలను ఆవిరితో పోల్చడం.. దెయ్యాలకు వేడీ అంటే భయమని చెప్పడం.. పర్వాలేదనిపించినా వాటిని స్క్రీన్‌పై నమ్మేట్టు తెరకెక్కించలేకపోయాడు. కొత్తగా ఉంటుందని నమ్మి వెళ్లే ప్రేక్షకులకు మాత్రం నిరాశనే కలిగించాడు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..


  ఇలాంటి హారర్, థ్రిల్లర్ సినిమాలంటే సంగీతం, నేపథ్యసంగీతం ప్రధానంగా అవసరం. వైద్య అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను సందర్భానుసారంగా భయపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చక్కగా కుదిరింది. ఎడిటింగ్ కూడా సినిమాకు బాగా కుదిరింది. ఎక్కడా సాగదీస్తున్నట్లు అనిపించికుండా కట్ చేశాడు. తనకున్న పరిధిలో సినిమాకు కావాల్సినవన్నీ నిర్మాత సమకూర్చాడు.

   ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  హారర్, థ్రిల్లర్ లాంటి జానర్లను ఓ వర్గానికి సంబంధించిన ప్రేక్షకులు మాత్రమే ఆదరిస్తుంటారు. అలా ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే మెప్పించేందుకు తీసే సినిమాల్లో కొత్తదనం ఉండాలి. ఎప్పుడో చూసిన కథ, కథనాలతో మళ్లీ కొన్ని మార్పులు చేసిన చూపిస్తే వారిని ఆకట్టుకోవడం కాస్త కష్టమే. మరి రవిబాబు స్టైల్ మేకింగ్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఆవిరి ఏమేరకు ఎక్కుతుందో చూడాలి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  నటీనటులు
  నిడివి
  నేపథ్య సంగీతం

  మైనస్ పాయింట్స్
  కథ
  ఊహకందేట్టు సాగే కథనం
  కొత్తదనం లోపించడం

  సాంకేతిక బృందం

  సాంకేతిక బృందం


  నటీనటులు : రవిబాబు, శ్రీ ముక్తా, నేహా చౌహాన్, భరణీ శంకర్, ముక్తా ఖాన్, కాశీ విశ్వనాథ్ తదితరులు
  దర్శకుడు : రవిబాబు
  సంగీతం : వైద్య
  నిర్మాత : రవిబాబు
  సమర్పణ : దిల్ రాజు
  బ్యానర్ : ఫ్లయింగ్ ఫ్రాగ్స్
  ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్

  English summary
  Aaviri Movie Review And Rating. Which Is Direced By Ravibabu. Aaviri Movie Review In Telugu. Ravi Babu, Neha Chauhan, sri Muktha Are Starred. Movie I sReleased On 1st November.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X