twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Sirish's ABCD Movie review (ఏబీసీడీ రివ్యూ)

    |

    Recommended Video

    ABCD Movie Review And Rating || ఎబిసిడి సినిమా రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: అల్లు శిరీష్, రుక్షర్ థిల్లాన్, నాగబాబు, మాస్టర్ భరత్, కోట శ్రీనివాసరావు
    Director: సంజీవ్ రెడ్డి

    అల్లు కుటుంబం నుంచి వచ్చిన నట వారసుడు అల్లు శిరీష్ వేగంగా సినిమాలు చేయకపోయినప్పటికీ.. కథ, కథనాలకు ప్రాధాన్యతను ఇస్తూ మంచి చిత్రాలకే ఓటు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తొలి సినిమా గౌరవం నుంచి చూస్తే కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలు ఆయన టేస్ట్‌కు అద్దంపట్టాయి.

    తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ: అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశీ అనే చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తూ సంజీవరెడ్డి అనే దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్‌కు అదనంగా విజయాన్ని అందించిందా? కొత్త దర్శకుడిగా సంజీవరెడ్డి ఎలాంటి మార్కును చూపించాడనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఏబీసీడీ స్టోరీ

    ఏబీసీడీ స్టోరీ

    అమెరికా పౌరుడైన అభి (అల్లు శిరీష్)కు జీవితంలో విలాసాలు తప్ప మరోకటి తెలియవు. జీవితంలో లక్ష్యం, బాధ్యతలు తెలుసుకోకుండా తిరిగే అభిని దారిలో పెట్టాలని తండ్రి (నాగబాబు) అతడిని ఇండియాకు పంపిస్తాడు. డబ్బును దుబారాగా ఖర్చు చేసే అభికి పైసలు ఇవ్వకుండా బతకమని సూచిస్తాడు. ఆ క్రమంలో నేహా (రుక్షర్)‌తో ప్రేమలో పడుతాడు? జీవితం ఏంటో తెలుసుకొనే పరిస్థితుల్లో తాను నివసించే మురికివాడకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి యువ రాజకీయ నేతను ఎదురించాల్సి వస్తుంది.

    ఏబీసీడీలో మలుపులు

    ఏబీసీడీలో మలుపులు

    జీవితంలో బాధ్యతలు తెలుసుకోవడానికి తండ్రి పెట్టిన పరీక్షలో అభి విజయం సాధించాడా? నేహాను ఇష్టపడిన క్రమంలో ఆమెకు తన ప్రపోజల్‌ను ఎలా చెప్పాడు? నేహా ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? తాను నివసించే మురికివాడకు ఎదురైన సమస్య ఏంటి? అభి యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకోవడానికి ఎలాంటి ప్రతికూలతను అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏబీసీడీ మూవీ కథ.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    ఏబీసీడీ సినిమా తొలిభాగంలో అభి విలాసాలు, ఎంజాయ్ చేస్తూ బతికి సన్నివేశాలతో మొదలవుతుంది. బాధ్యత ఎరుగని తన కుమారుడి గురించి తండ్రి ఆలోచించడమనే అంశాలతో కథ రెగ్యులర్‌గా, రొటీన్‌గా సాగుతుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అభి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాలు స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల సినిమా ఆసక్తిని రేకెత్తించలేకపోయిందనిపిస్తుంది. అలాగే రొటీన్ సన్నివేశాలతో సాగడం సినిమాకు ప్రతికూలంగా మారిందని చెప్పవచ్చు.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో కథలో అసలు సమస్య మొదలువుతుంది. అభి కథలోకి పొలిటికల్ అంశాలు చేరడంతో సినిమా కొంత సీరియస్ నోట్‌లోకి వెళ్తుంది. కాకపోతే మంచి సమస్యను ప్రేక్షకుడిని హత్తుకునేలా, ఆలోచింపజేసేలా, కన్విన్స్‌గా చెప్పలేకపోవడం ప్రధానమైన లోపం అని చెప్పవచ్చు. అయితే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీ, భరత్ హాస్యం ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తాయి. అన్ని కథల్లో మాదిరిగానే సక్సెస్ ఎండింగ్‌తో రొటీన్‌గా ముగించడంతో సాదాసీదా చిత్రంగా మిగిలిపోయిందనిపిస్తుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    సినిమా పరిశ్రమలో ఓ రీమేక్‌తో మళ్లీ సక్సెస్ కొట్టడమనేది ఎవరికైనా ఓ సవాల్ లాంటిందే. దర్శకుడు సంజీవరెడ్డికి అదే ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నాడు. రీమేక్ అంటే అన్ని పక్కాగా తెలిసిన అంశాలే ఉంటాయి. వాటిని అలా తెర మీద డ్రైవ్ చేసుకొంటూ పోవాల్సిందే. ఏ మాత్రం తడబాటుకు గురైనా గానీ.. ఫలితం మరోలా ఉంటుంది. ఏబీసీడి విషయంలో సంజీవరెడ్డికి అదే ఎదురైంది. మలయాళంలో ఉండే ఎమోషనల్ టచ్ ఈ సినిమాలో కనిపించలేదనేది ప్రధానమైన విమర్శ. కాకపోతే దర్శకుడిగా రాణించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సొంత కథతోనో లేదా.. స్ట్రయిట్ సినిమాతో వస్తే అసలు టాలెంట్ తెలిసేది.

    అల్లు శిరీష్ యాక్టింగ్

    అల్లు శిరీష్ యాక్టింగ్

    ఇక అల్లు శిరీష్ అభి పాత్ర కోసం మరింత కసరత్తు చేయాల్సింది. అభి పాత్రను ప్రేక్షకుడిని కనెక్ట్ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. హ్యాపీ గో లక్కీ బాయ్ క్యారెక్టర్‌ను మరింత పండించాల్సింది. కథలో ఎమోషన్ మిస్ కావడం వల్ల శిరీష్‌కు అలాంటి అవకాశం లభించలేదేమో అనే అనుమానం కలుగుతుంది. రుక్షర్‌తో రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాయి. పేలవంగా రాసుకొన్న సీన్లను కూడా భరత్‌తో కలిసి వాటిని నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే సత్తా ఉందనే అభిప్రాయాన్ని శిరీష్ కలిగిస్తాడు.

    హీరోయిన్‌గా రక్షర్ థిల్లాన్

    హీరోయిన్‌గా రక్షర్ థిల్లాన్

    రక్షర్ థిల్లాన్ విషయానికి వస్తే అందంగా కనిపించింది. సెకండాఫ్ వరకు కూడా ఆమెకు పెద్దగా స్కోప్ లేకపోవడం అసలు హీరోయిన్ ఉందా అనే అనుమానం కలుగుతుంది. రెండో భాగంలో తనకు లభించిన సీన్లకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. మెల్ల మెల్లగా పాటలో శిరీష్‌తో కెమిస్ట్రీ పండింది. రక్షర్‌కు నేహా పాత్ర గొప్ప పేరు తెచ్చే అవకాశం తక్కువే. నటనపరంగా మరింత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది.

    ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    మిగితా పాత్రల్లో టెలివిజన్ న్యూస్ రీడర్‌గా వెన్నెల కిషోర్ తన మార్కును చూపించారు. బాలనటుడిగా అందరిని ఆకట్టుకొన్న మాస్టర్ భరత్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో ఫ్రెండ్‌గా తన మార్కును మళ్లీ ఎస్టాబ్లిష్ చేశాడు. హీరో తండ్రిగా నాగబాబు ఎప్పటిలానే ఆకట్టుకొన్నాడు. ఇతర కమెడియన్ పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌గా

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జుడా శాండీ స్వరపరిచిన రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సిద్ శ్రీరామ్ పాడిన మెల్ల మెల్లగా పాట సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఈ పాటకు కృష్ణకాంత్ రాసిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి విభాగాల పనితీరు ఒకేలా ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఏబీసీడి అనే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని మధుర శ్రీధర రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్‌ బ్యానర్లపై రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథను తెలుగు నేటివిటికి తగినట్టుగా మార్చడంపై మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది. నటీనటుల ఎంపికపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదేమో అనిపిస్తుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఏబీసీడీ చిత్రంలో అల్లరిగా తిరిగే ఓ యువకుడు బరువు బాధ్యతలను తెలుసుకోవడమనే కీలక పాయింట్. సరైన రీతిలో ప్రజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. యూత్‌కు నచ్చే అంశాలు సినిమాకు కొంత సానుకూలతగా మారింది. ఓ ఎన్నారై స్వదేశానికి వచ్చి జన్మభూమి విలువను, సాంప్రదాయాలను తెలుసుకునే కథాంశాలు తెర మీద ఇప్పటికే బోలెడు కనిపిస్తాయి. ఏబీసీడీ చిత్రంలో కొత్తదనం ఏమీ కనిపించదు. యూత్‌కు, బీ, సీ సెంటర్లలో కనెక్ట్ అయ్యే దానిని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    తెర ముందు, తెర వెనుక
    నటీనటులు: అల్లు శిరీష్, రుక్షర్ థిల్లాన్, నాగబాబు, మాస్టర్ భరత్, కోట శ్రీనివాసరావు తదితరులు
    దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
    నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
    సంగీతం: జుడా శాండీ
    ఎడిటింగ్: నవీన్ నూలి
    బ్యానర్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్‌
    రిలీజ్ డేట్: 2019-05-17

    English summary
    ABCD – American Born Confused Desi starring Allu Sirish and Rukshar Dhillon in prominent roles.It is directed by Sanjeev Reddy and produced by Madhura Sreedhar Reddy. The title is based on the term American-Born Confused Desi. The film is a remake of the Malayalam film of the same name. The film is scheduled to be released on 17 May, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X