twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Driver Jamuna Review: సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ గా 'డ్రైవర్ జమున'.. ఐశ్వర్య రాజేష్ ఆకట్టుకుందా?

    |

    రేటింగ్: 2..75/5

    టైటిల్: డ్రైవర్ జమున
    నటీనటులు: ఐశ్వర్య రాజేష్, ఆడుకాలమ్ నరేన్, శ్రీ రంజని, రాజా రాణి పాండియన్, మణికందన్ రాజేష్
    సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్
    కథ, దర్శకత్వం: కిన్స్ లిన్
    సంగీతం: జిబ్రాన్
    నిర్మాత: ఎస్పీ చౌదరి
    సమర్పణ: 18 రీల్స్
    ఓటీటీ విడుదల తేది: జనవరి 20, 2023
    ఓటీటీ వేదిక: ఆహా

    కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయం సాధిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే 'సుఢల్: ది వర్టెక్స్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఐశ్వర్య రాజేష్ మరోసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో ముందుకు వచ్చింది. లేడీ డ్రైవర్ గా ఐశ్వర్య రాజేష్ నటించిన 'డ్రైవర్ జమున' ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా జనవరి 20న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ:

    కథ:

    జమున (ఐశ్వర్య రాజేష్) తండ్రి సుందరం (రాజా రాణి పాండియన్) ఒక క్యాబ్ డ్రైవర్. అతను అనుకోకుండా హత్యకు గురి కావడంతో జమున తల్లి (శ్రీ రంజని) అనారోగ్యం బారిన పడుతుంది. దీంతో కుటుంబ బాధ్యతలు జమునపై పడతాయి. అందుకోసం క్యాబ్ డ్రైవర్ గా మారుతుంది. ఈ క్రమంలోనే ముగ్గురు కరుడు గట్టిన కిరాయి హంతకులు ప్రజల్లో మంచి పేరు ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే మద్దెల వెంకట్రావ్ (ఆడుకాలం నరేన్)ను మర్డర్ చేసేందుకు వెళ్లేందుకని జమున క్యాబ్ బుక్ చేసుకుంటారు. దారి మధ్యలో ఆ ముగ్గురు హంతకులు అని తెలుసుకున్న జమున తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది బెడిసి కొడుతుంది. ఎక్స్ ఎమ్మెల్యే మర్డర్ అయ్యే వరకు జమునను బంధీగా ఉంచుకుందామని అనుకుంటారు. ఈ క్రమంలో జమున ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటీ? హంతకుల బారి నుండి జమున తప్పించుకుందా? ఎక్స్ ఎమ్మెల్యేను వాళ్లు మర్డర్ చేశారా? మద్దెల వెంకట్రావ్ కు క్యాబ్ డ్రైవర్ అయిన జమునకు ఉన్న సంబంధం ఏంటీ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'డ్రైవర్ జమున' క్యాబ్ ఎక్కాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:

    ఇది ఒక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ డ్రామా. ఈ సినిమా ఇదివరకే తమిళంలో 2022, డిసెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓటీటీలో రిలీజైన ఈ డ్రైవర్ జమున ఒక సింపుల్ స్టోరి. కానీ సినిమాను థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా తెరకెక్కించారు డైరెక్టర్ కిన్స్ లిన్. జమున తన క్యాబ్ ను క్లీన్ చేసిన తర్వాత వర్షం పడటం చూపించి ఇంట్రెస్టింగ్ గా ప్రారంభించి ఎండ్ వరకు అదే కొనసాగించారు. పాత్రల పరిచయానికి పెద్దగా ల్యాగ్ తీసుకోకుండా వెంటనే కథలోకి వెళ్లారు. జమున క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో ఫస్ట్ సీన్ లోనే చూపించి.. తర్వాత వెంటనే కిరాయి హంతకులు ప్రవర్తించే సన్నివేశంతో కొనసాగించారు. జమున క్యాబ్ బుక్ చేసుకోవడంతో మొదలైన స్టోరీ థ్రిల్లింగ్ గా, గ్రిప్పింగ్ గా సాగుతూనే ఉంటుంది.

    మిస్ అయిన చిన్న లాజిక్..

    మిస్ అయిన చిన్న లాజిక్..

    హంతకుల గురించి డ్రైవర్ జమున తెలుసుకోవడం, వారి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేయడం.. ఇంతలో పోలీసులు కాపాడేందుకు ట్రై చేయడం.. అదంతా బెడిసి కొట్టడం వంటి సీన్లతో స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. పోలీసులు ఉన్న హంతకులను పట్టుకోవడంలో ప్రతిసారి సఫలం కాలేకపోతారు. అయితే అందుకు కారణంగా వాళ్ల పైఅధికారి ప్రతిసారీ ప్లాన్ మారుస్తూ ఉండటమే అని చూపించి కన్విన్స్ చేశారు. రిటైర్డ్ ఐజీ కొడుకు, కోడళ్లను కిరాయి హంతకులు ఎందుకు చంపారో చూపించి వాళ్ల పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్ చూపించారు. కానీ ఐజీ కొడుకును హంతకులు చంపే కారణం వద్ద చిన్న లాజిక్ మిస్ అయ్యారనిపించింది. అది తప్పితే ఒక గంట 43 నిమిషాలు ఉన్న డ్రైవర్ జమున ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఆకట్టుకుంటుంది. ఇక మధ్య మధ్యలో జమున తండ్రి చెప్పే డైలాగ్ లు కూడా బాగున్నాయి.

     హైలెట్ క్లైమాక్స్.. అదిరిపోయే బీజీఎమ్..

    హైలెట్ క్లైమాక్స్.. అదిరిపోయే బీజీఎమ్..

    ఇక సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ హైలెట్ గా ఉంటుంది. ఆ ఒక్క ట్విస్ట్ తోనే డ్రైవర్ జమున కథ ఉంటుంది. అప్పటివరకు సర్వైవల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన డ్రైవర్ జమున కథ ఒక్కసారిగా రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఇంతకన్నా ఎక్కువగా చెబితే సినిమా స్పాయిలర్ అవుద్ది. ఇక ఈ సినిమాకు జిబ్రాన్ అందించిన సంగీతం పర్ఫెక్ట్ గా కుదిరింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాను ఎంగేజింగ్ గా చూపించేందుకు బీజీఎమ్ కూడా తోడైందని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా సూపర్బ్ గా కుదిరాయి.

     ఎవరెలా చేశారంటే?

    ఎవరెలా చేశారంటే?

    విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో డ్రైవర్ జమునగా అద్భుతంగా నటించింది. భయం, కోపం, మెళకువలు తెలిసిన డ్రైవర్ గా క్యారెక్టర్ లో జీవించిందనే చెప్పవచ్చు. ఇక ప్రజల మనిషిగా ఆడుకాలమ్ నరేన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే కొడుకుగా, వార్డ్ కౌన్సిలర్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ సోదరుడు మణికందన్ రాజేష్ కూడా పర్వాలేదనిపించాడు. కిరాయి హంతకులుగా, సైకోలుగా చేసిన వ్యక్తులు సైతం కరుడుగట్టిన హంతకులుగా అదరగొట్టారు. మిగతా పాత్రలు కూడా బాగా నటించాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే సినీ లవర్స్ కి ఐశ్వర్య రాజేష్ నటించిన 'డ్రైవర్ జమున' ఈ వీకెండ్ లో ఒక బెస్ట్ డ్రైవ్.

    English summary
    Aishwarya Rajesh Aadukalam Naren Starter Revenge Survival Crime Thriller Tamil Film Driver Jamuna Review And Rating In Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X