twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐతే 2.0 సినిమా రివ్యూ : కొత్తదనం లేదు..వినోదమూ లేదు !

    |

    Rating:
    2.5/5

    ఈ ఇంటర్నెట్ యుగంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీపై మంచి పరిజ్ఞానం ఉన్న వారు సైబర్ నేరాలకు పాల్పడుతన్నారు. ప్రతి రోజు మనం సైబర్ నేరాలు, హ్యాకింగ్ గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. హైలెవెల్ లో సైబర్ నేరాలు, హ్యాకింగ్ వలన ఎలాంటి ఇబ్బందులకు కలుగుతాయి అనే పాయింట్ పై ఐతే 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు. లోబడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం మంచి ప్రచార కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

    అమీర్ పేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఆరుగురు స్నేహితులు ఉంటారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు. నిరుద్యోగ భాదతో ఏదోఒ కటి సాధించాలనే తపన వారిలో పెరుగుతుంది. ఆ నేపథ్యంలోనే వారికి ఇండియాలో బ్యాంకు నిర్వహణ వ్యయం తగ్గించాలనే ఆలోచన వస్తుంది. ఆమ్ బ్యాంక్ అనే సంస్థ సీఈవోతో ఈ ఆరుగురు స్నేహితులు ఒక మిలియన్ డాలర్స్ కి ఒప్పందం కుదుర్చుకుంటారు. బంక్యు వ్యయాలని తగ్గించే సాఫ్ట్ వేర్ కు ఈ స్నేహితులు యురేకా అని నామకరణం చేస్తారు. బ్యాంకు సీఈఓ కుట్ర వలన ఈ స్నేహితులు అనుకున్న లక్ష్యం నెరవేరక పోగా ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకు సీఈవో యురేకా సాఫ్ట్ వేర్ ఎలా వారి నుంచి చేజిక్కించుకున్నాడు, అతడిపై ఈ స్నేహితులు రివేంజ్ ఎలా తీర్చుకున్నారు అనేది ఈ చిత్ర కథ.

     ఐతే 2.0 అసలు కథ ఇదే

    ఐతే 2.0 అసలు కథ ఇదే

    చిత్రం విలన్ అవినాష్ ( ఇంద్రనీల్ సేన్ గుప్త) పరిచయంతో ప్రారంభం అవుతుంది. బ్యాంకు సీఈవో అయినప్పటికీ అతడు సైబర్ నేరాలు, హ్యాకింగ్ లో ఆరితేరిపోయి ఉంటాడు. విలన్ డైలాగులతో ఆరంభంలోనే చిత్రంపై అటెన్షన్ క్రియేట్ అవుతుంది. సైబర్ నేరాలకు భారీగా ప్లాన్ చేస్తుంటాడు. ఈ ఆరుగురు ఫ్రెండ్స్ కు అతడి గురించి తెలియక వారు రూపొందించాలనుకున్న యురేకా సాఫ్ట్ వేర్ గురించి వివరిస్తారు. కానీ కోడ్ ని మాత్రం బయటపెట్టరు. కోడ్ కావాలంటే ఒక మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు. పైకి ఒప్పందానికి ఒకే అన్నట్లుగా ఉన్నా లోపల మాత్రం ఆ స్నేహితులపై కుట్ర పన్నుతాడు. సైబర్ నేరాలు చేయడానికి అతడు ఉపయోగించే టెక్నిక్ గురించి ఆరంభంలో భారీగా చూపిస్తారు. అదే టెక్నిక్ తో యురేకా సాఫ్ట్ వేర్ ని ఈ స్నేహితుల గ్యాంగ్ నుంచి అక్రమంగా పొందుతాడు. యురేకా సాఫ్ట్ వేర్ అతడు ఎలా పొందగలిగాడు ? అవినాష్ ఉపయోగించిన టెక్నీక్ ఏంటి ? ఈ ఆరుగురు స్నేహితులు అతడిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనే అంశాలు తెరపై చూడాల్సిందే.

     ఫస్ట్ హాఫ్ ఎలా సాగిందంటే

    ఫస్ట్ హాఫ్ ఎలా సాగిందంటే

    విలన్ ఎంట్రీ తో సినిమా ఆరంభం అవుతుంది. విలన్ చేసే సైబర్ నేరాల గురించి అతడి వాయిస్ ఓవర్ తోనే డైలాగులు వినిపిస్తాయి. విలన్ పరిచయం చూశాక సినిమాలో పెద్ద విషయమే ఉందని అనిపిస్తుంది. ఆ తరువాత ఆరుగురు స్నేహితులు వారి నిరుద్యోగ సమస్యలు, సంతోషాలు, సరదాలతో చిత్రం సాగుతుంది. ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినవిగా అనిపిస్తాయి. విలన్ తో స్నేహితులు మీట్ అయ్యే సన్నివేశం మినహా ఫస్ట్ హాఫ్ లో మరేది బలమైన సీన్ పడలేదు. సైబర్ నేరాలకు విలన్ ఉపయోగించే టెక్నిక్ ఆరంభంలో భారీ స్థాయిలో చూపిస్తారు. అదే టెక్నీక్ తో స్నేహితుల గ్యాంగ్ నుంచి యురేకా సాఫ్ట్ వేర్ అక్రమంగా హ్యాక్ చేస్తాడు. అది చాల సిల్లీగా అనిపిస్తుంది. దీనితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

     సెకండ్ హాఫ్ ఎలా సాగిందంటే

    సెకండ్ హాఫ్ ఎలా సాగిందంటే

    బోరింగ్ సన్నివేయాలతో ఫస్ట్ హాఫ్ ముగిసిన తరువాత సెకండ్ హాఫ్ రివెంజ్ వైపు టర్న్ తీసుకుంటుంది. విలన్ ని హ్యాకింగ్ ద్వారానే వీళ్ళు దెబ్బ కొట్టాలని భావిస్తారు. అందుకోసం వీరు రంచించే పథకం బావుంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో కూడా క్లైమాక్స్ మినహా బలమైన సన్నివేశం మరేది లేదు. క్లైమాక్స్ లో రెండు ట్విస్ట్ లతో సినిమా ముగుస్తుంది.

     దర్శకుడు ప్రతిభ

    దర్శకుడు ప్రతిభ

    సైబర్ క్రైం, బ్యాంకు వ్యయాలని తగ్గించడం వంటి మంచి పాయింట్ ని దర్శకుడు కథగా ఎంచుకున్నాడు. కానీ మంచి సినిమాగా మలచడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కనీసం ఎంటర్ టైన్ మెంట్ కూడా లేకపోవడంతో ప్రేక్షుకులు అసహనానికి గురయ్యేలా చేసాడు. కథలో భాగంలోని సన్నివేశాలు పూర్తిగా నిరాశ పరుస్తాయి.

     నటీనటుల ప్రతిభ

    నటీనటుల ప్రతిభ

    ఈ చిత్రంలో ప్రధాన నటులంతా కొత్తవారే. సినిమా ఎలా ఉన్నపటికీ నటులంతా బాగా నటించారు. నిరుద్యోగ యువతగా వారు చేసే ప్రయత్నాలు, హ్యాకింగ్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా నటించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. కానీ సినిమా లో బలం లేకపోవడంతో వీరి నటనకు విలువ లేకుండా పోయింది.

     సాంకేతిక విభాగం

    సాంకేతిక విభాగం

    ఈ చిత్రంలో సాంకేతిక విభాగంలో అనేక లోపాలు ఉన్నాయి. డబ్బింగ్ సరిగా లేదనే విషయాన్ని ఎవరైనా వెంటనే పసిగట్టేయగలరు. సన్నివేశంలో ఉత్కంఠ రేకెత్తించడానికి దర్శకుడు రెండు మూడు వాయిస్ వినిపించే విధంగా ఓ ప్రయత్నం చేసాడు. అది ఫలించకపోగా గందరగోళానికి గురిచేసే విధంగా ఉంది. తక్కువ బడ్జెట్ లో రూపొందించినప్పటికీ ఈ చిత్ర సినిమాటోగ్రఫీ బావుందని చెప్పుకోవచ్చు. ఇక ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో సరిగా లేదు.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    ఈ చిత్రంలో ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే అది దర్శకుడు ఎంచుకునే స్టోరీ లైన్. దానిని సరైన కథగా మలచడంలో, సినిమాగ తెరకెక్కించడంలో విఫలం చెందాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన ఇంద్రనీల్ సేన్ బాగా నటించాడు. కొత్తవారైన ప్రధాన తారాగణం నటన కూడా బావుంది. హ్యాకింగ్ సంబంధిత సన్నివేశాలు, నిరుద్యోగులు అయినప్పటికీ పరిజ్ఞానం ఉంటె ఎంత సులువుగా హ్యాకింగ్ కు పాల్పడవచ్చు అనే అంశాలు బావున్నాయి.

     మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    దర్శకుడు అనుకున్న పాయింట్ ని సరైన విధంగా ప్రజెంట్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే కూడా ప్రభావం చూపలేక పోయింది. ఈ చిత్రంలో ఆడియన్స్ ఆకట్టుకునే పాట ఒక్కటి కూడా లేదు. ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లు కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం అయ్యారు. డైలుగులు కూడా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ లోపు వచ్చే సన్నివేశాలు చికాకు తెప్పించే విధంగా ఉంటాయి. విలన్ ప్రధాన నటుల్ని రక్తం కక్కేలా కొట్టే సన్నివేశాలు బాగాలేదు.

     సంగీతం

    సంగీతం

    సైబర్ క్రైం, హ్యాకింగ్ నేపథ్యలో సాగె చిత్రాలకు సంగీతం చాలా కీలకం. బ్యాక్ గ్రౌండ్ సంగీతం బావుంటేనే ఆయా అసన్నివేశాలకు బలం చేకూరుతుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం మెప్పించలేకపోయింది. పాటలు కూడా త్వరగా అయిపోతే బావుంటుంది అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.

    తుది తీర్పు

    తుది తీర్పు

    కొత్తదనం, వినోదం ఆశించి ఈ చిత్రానికి వెళితే నిరాశ తప్పదు. మంచి పాయింట్ ని ఎంచుకున్న దర్శకుడు దానిని పద్దతి ప్రకారం తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. దాదాపుగా అన్ని సన్నివేశాలు గతంలో చూసిన విధంగానే ఉంటాయి. గతంలో ఐతే చిత్రం మంచి విజయం సాధించింది. టైటిల్ చూసి ఐతే 2.0 చిత్రానికి వెళితే నిరాశతో వెనుదిరుగుతారు. మొత్తంగా ఐతే 2.0 చిత్రం అన్ని అంశాలలోనూ నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోతుంది.

     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు

    దర్శకత్వం: రాజ్ మదిరాజ్
    నిర్మాతలు: విజయరాజు, డాక్టర్ హేమంత్ వల్లపురెడ్డి
    సంగీతం: అరుణ్ చిలువేరు
    సినిమాటోగ్రఫీ: కౌషిక్ అభిమన్యు
    ఆర్ట్: రాజీవ్ నాయర్
    డైలాగ్స్, పాటలు: కిట్టు విశ్వప్రగడ

    English summary
    Aithe 2.0 tells the story of four unemployed engineering graduates and their tryst with the crime world. How the Internet has made us vulnerable in this digital age is what the film drives home through its detailed & tight screenplay. Vijaya Raju, Dr Hemanth Vallapu Reddy are the producers. Indraneil Sengupta, Zara Shah, Abhishek, Kartavya Sharma, Neeraj, Mrunal, Mridanjli and Dr Srikanth are the main members of the cast. Music is by Arun Chiluveru.The cinematography is by Kaushik Abhimanyu.Rajeev Nair is the Art Director. Kittu Vissapragada has penned the dialogues and lyrics. Aithe 2.0, directed by Raj Madiraju, has released on March 16. In this occassion, Telugu Filmibeat brings you exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X