For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Urvasivo Rakshasivo Movie Review:రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. అల్లు శిరీష్ హిట్ కొట్టాడా అంటే?

  |

  రేటింగ్: 3/5

  టైటిల్: ఊర్వశివో రాక్షిసివో
  నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిశోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, అనీష్ కురువిల్లా తదుతరులు
  ప్రొడక్షన్ బ్యానర్: గీతా ఆర్ట్స్ 2, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్
  నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
  సమర్పణ: అల్లు అరవింద్
  దర్శకత్వం: రాకేష్ శశి
  కథ: ఎలాన్
  సంగీతం: అచ్చు రాజమణి (మాయరే సాంగ్-అనూప్ రూబెన్స్)
  సినిమాటోగ్రఫీ: తన్వీర్
  విడుదల తేది: నవంబర్ 4, 2022

  ప్రముఖ నిర్మాత కుమారుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు శిరీష్ తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విభిన్నమైన సినిమాలతో ఎంటర్టైన్ చేసిన అల్లు శిరీష్ చివరిగా ఏబిసిడి అనే సినిమాలో నటించాడు. సుమారు మూడేళ్ల గ్యాప్ తో మరోసారి 'ఊర్వశివో.. రాక్షసివో' అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జత కలిసే, విజేతే సినిమాలకు దర్శకత్వం వహించిన రాకేష్ శశి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ఊర్వశివో.. రాక్షసివో' సినిమా హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

  కథ:

  కథ:


  శ్రీ కుమార్ (అల్లు శిరీష్) ఒక మధ్య తరగతి యువకుడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తుంటాడు. అతని ఆఫీస్ కు ఎదురుగా ఉన్న మరో ఆఫీస్ లో పని చేసే సింధుజ (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయిని దూరం నుంచే లవ్ చేస్తుంటాడు. ఆమెతో ఎలాగైన మాట్లాడుదామనుకున్న సమయంలో తన ఆఫీస్ లో చేరుతుంది సింధుజ. దీంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు తెగ కష్టపడుతుంటాడు శ్రీ కుమార్. అయితే సింధుజ మాత్రం అమెరికాలో పుట్టి పెరిగి వచ్చిన అమ్మాయి. పెళ్లి కన్నా గోల్, ఇండిపెండెంట్ గా ఉండాలనుకునే అమ్మాయి. మరి శ్రీ కుమార్ తో ప్రేమ, పెళ్లికి సింధుజ ఒప్పుకుందా? వాళ్లు ఇద్దరు కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారు? తల్లిదండ్రుల కోసం శ్రీ కుమార్ ఏం చేశాడు? అసలు అతను ఎందుకు ఇల్లు వదిలిపారిపోయాడు? కెరీర్ ముఖ్యమనుకున్న సింధుజ చివరిగా ఏం చేసింది? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా కచ్చితంగా చూడాల్సిందే.

  విశ్లేషణ:

  విశ్లేషణ:


  ఊర్వశివో.. రాక్షసివో.. ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రేమ, పెళ్లి, సహజీవనం, కెరీర్, గోల్స్ వంటి తదితర విషయాలపై నేటితరం మోడ్రన్ అమ్మాయిలు, మధ్యతరగతి అబ్బాయిల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయే చెప్పేందుకు ఇచ్చిన దృశ్యరూపమే ఈ సినిమా. శ్రీ కుమార్ తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్) తమ కొడుకు తప్పిపోయాడని పోలీస్ స్టేషన్ లో కంప్లేంట్ ఇవ్వడంతో స్టోరీ మొదలవుతుంది. తర్వాత కథలోకి తీసుకెళ్లి.. రెగ్యులర్ గా ఆఫీస్ కు హడావిడిగా వెళ్లే ఉద్యోగిలా చూపించి ఒక అమ్మాయి కోసం ఎవరు రాకముందే వెళ్లడాన్ని చూపించి ఆసక్తి క్రియేట్ చేశారు.

  రెగ్యూలర్ లవ్ స్టో

  రెగ్యూలర్ లవ్ స్టో


  ఇది ఒక రి. లవ్ స్టోరీస్ పోయి ప్రేమలో సహాజీవనం కాన్సెప్ట్ లు సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. అయితే ఈ నార్మల్ స్టోరీని రొమాంటిక్ గా, కామెడీగా చూపించి ఎంటర్టైన్ చేశారు. ట్రైలర్ చూపించినట్లుగానే ఎక్కువగా యూత్ టార్గెటెడ్ గా ఉంది. ముద్దు సీన్లు, ఇటు ఫ్యామిలీ అటు లివింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేసే క్రమంలో జెనరేట్ చేసిన కామెడీ మంచి ఫన్ ఇస్తుంది. ఇక సెకండాఫ్ లో శ్రీ కుమార్ గురించి వెన్నెల కిశోర్, సునీల్ కలిసి క్రికెట్ కామెంట్రీలా చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాలో సంభాషణలు కూడా బాగున్నాయి. ఇటు అమ్మాయిల ఆలోచన ధోరణి, అటు మధ్యతరగతి యువకుల తల్లిదండ్రులు ఇష్టాన్ని నెరవేర్చాలనే బాధ్యతను అక్కడక్కడా ఫన్ తో.. కొన్ని చోట్ల ఎమోషనల్ గా అందంగా మలిచారు. పెళ్లయ్యాకా అమ్మాయిలు డ్రీమ్స్ నెరవేర్చుకోలేరనడానికి ఒక క్యారెక్టర్ తో చూపించిన.. ఇంకాస్త డెప్త్ గా చూపిస్తే బాగుందనిపించింది. ఇంట్లో నుంచి శ్రీ కుమార్ వెళ్లిపోవడానికి గల కారణం స్పష్టంగా చూపించాల్సింది.

  ఎవరెలా చేశారంటే..

  ఎవరెలా చేశారంటే..


  మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించాడు అల్లు శిరీష్. అమాయకపు చక్రవర్తిగా, లవర్ గా, తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవాలని తపన పడే వ్యక్తిగా చక్కగా నటించాడని చెప్పవచ్చు. శ్రీ కుమార్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ఇక మోడ్రన్ ఆలోచనలు ఉన్న యువతిగా అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకుంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, వారి కెమిస్ట్రీ యువతను తెగ అట్రాక్ట్ చేస్తుంది. శ్రీ కుమార్ తల్లిదండ్రులుగా ఆమని, కేదార్ శంకర్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై బబ్లూ పృథ్వీరాజ్ (పెళ్లి ఫేమ్) కనిపించి ఆకట్టుకున్నారు. నేటితరం యువతీయువకులను అర్థం చేసుకునే తండ్రిగా బాగా చేశారు.

  నవ్వించేలా కామెడీ..

  నవ్వించేలా కామెడీ..

  ఇక సునీల్, వెన్నెల కిశోర్ కామెడీ అదిరిపోయిందనే చెప్పవచ్చు. వాళ్లు కనిపించిన సీన్లు నవ్వుకునేలా ఉన్నాయి. ఇక పోసాని కృష్ణమురళి కనిపించింది రెండు మూడు సన్నివేశాలే అయినప్పటికీ తన స్టైల్ లో నవ్వించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగినట్లు బాగా సరిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో, కామెడీ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. పాటలు, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా రాకేష్ శశి సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు.

   ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..


  నేటితరం మోడ్రన్ రిలేషన్ షిప్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా. యూత్ ఫుల్ లవ్, రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఫైనల్ గా చెప్పాలంటే కపుల్స్, లవ్ బర్డ్స్, యూత్ కు సూపర్ ఎంటర్టైనర్ ఈ 'ఊర్వశివో.. రాక్షసివో'.

  English summary
  Allu Sirish And Anu Emmanuel Romantic Comedy Entertainer Urvasivo Rakshasivo Movie Review And Rating In Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X