For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  By Bojja Kumar
  |

  Rating:
  1.5/5
  హైదరాబాద్ : అల్లు శిరీష్ కథానాయకుడిగా రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాష్ రాజ్ నిర్మించిన చిత్రం గౌరవం శనివారం విడుదలైంది. అసలు చూడటానికే హీరో లేనట్లు కనిపించిన అల్లు శిరీష్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించాడో చూద్దాం....

  కథాంశంలోకి వెళితే అర్జున్ (శిరీష్) సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. విలాసంగా జీవించే అర్జున్ తండ్రి వ్యాపారానికి సంబంధించిన పనితో పాటు, తన స్నేహితుడు శంకర్‌‍ను కలిసేందుకు ఎస్.ఎమ్ పల్లి అనే గ్రామానికి వెళతాడు. అక్కడికి వెళ్లిన అర్జున్ తన స్నేహితుడు ఊర్లో లేక పోవడంతో ఆరా తీయగా ఆ ఊరి భూస్వామైన పశుపతి(ప్రకాష్) కూతురిని శంకర్ తీసుకుని లేచిపోయాడని తెలుస్తుంది.

  అతని ఆచూకి ఎంత ప్రయత్నించినా దొరకదు. అదే సమయంలో అర్జున్‌కి పశుపతి మనుషుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో స్నేహితుడు ఆపదలో ఉన్నాడనే విషయం తెలుసుకుంటాడు. అతని చూకి కోసం ఆరా తీస్తుంటాడు. శంకర్ తల్లిదండ్రులను కలిసి జరిగిన నిజాలను తెలుసుకుంటాడు. ఈ క్రమంలో అర్జున్ కి సహాయంగా నిలుస్తుంది లాయర్ యామిని(యామి గౌతం).

  మరి అర్జున్ తన స్నేహితుడి ఆచూకీ కనుక్కోవడానికి ఏంచేసాడు, పశుపతి మనుషులను ఎలా ఎదుర్కొన్నారు, పశుపతి కూతురితో లేచి పోయి శంకర్ ఏమయ్యాడు అనే విషయాలు థియేటర్లో చూడాల్సిందే.

  మిగతా వివరాలు స్లైడ్ షోలో..

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  పెర్ఫార్మెన్స్ పరంగా శిరీష్ నిరాశ పరిచాడు. కథానాయకుడికి ఉండే ఎలాంటి క్వాలిటీస్ అతనికి లేవు. ముఖంలో హావభావాలు పలికించడంలో ఫెయిలయ్యాడు. ఇలా అయితే ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం కష్టమే. నటనతో పాటు, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఎంతో మెరుగు పడాలి.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  యామీ గౌతం నటనకు స్కోపులేని, ప్రాధాన్యత లేని పాత్ర చేసింది. అయితే ఆమె పాత్రకు న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగి పోయాడు. ఇతర నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  సాంకేతిక అంశాలు పరిశీలిస్తే...నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంది. పల్లెటూరి అందాలు చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. దర్శకుడు ఎంచుకున్న కథ ఆదర్శవంతంగా ఉంది.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  కులం కుళ్లు ఇప్పటికీ కొన్ని చోట్ల ఏ రేంజిలో ఉందో స్పష్టంగా వివరించాడు. తక్కువ కులం అబ్బాయి, అగ్రకులం అమ్మాయిలను ప్రేమిస్తే పరువు కోసం పాకులాడే అగ్రకుల పెద్దలు ఎలాంటి దారుణాలకైనా తెగిస్తారని ఇటీవల జరిగి కొన్ని నిజ జీవిత సంఘటనలను ఫోకస్ చేసే విధంగా చూపించాడు.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అయితే సినిమాను ప్రేక్షకరంజకంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ముఖ్యం స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా లేక పోవడం, నేషన్ స్లోగా ఉండటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  ఈ సినిమా మంచి సామాజిక, సందేశాత్మక చిత్రమే తప్ప వినోదాత్మక చిత్రం మాత్రం కాదు.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  వినోదం పాళ్లు, కమర్షియల్ అంశాలు లేని సినిమాలను ప్రేక్షకులు ఆమోదించడం కష్టమవుతున్న నేటి రోజుల్లో ఈ సినిమా గతేమవుతుందో....ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు.

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  అల్లు శిరీష్ ‘గౌరవం’ రివ్యూ

  దర్శకుడు : రాధా మోహన్
  నిర్మాత : ప్రకాష్ రాజ్
  సంగీతం : ఎస్. థమన్
  నటీనటులు : అల్లు శిరీష్, యామి గౌతమి, ప్రకాష్ రాజ్

  English summary
  Director Radha Mohan and actor-turned-producer Prakash Raj have already worked together in five movies in Telugu and Tamil. Now, they are up with their sixth outing Gouravam and they have selected a fresh face Allu Sirish, the brother of Allu Arjun for it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X