For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రొటిన్ కథతోనే వస్తూ...(అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  గౌరవం, కొత్తజంట అంటూ రెండు సినిమాలు ఇచ్చినా,మెగా కుటుంబం నుంచి వచ్చినా అల్లు శిరీష్ కు పెద్ద క్రేజ్ రాలేదనే చెప్పాలి. అయితే ఈ మూడో ప్రయత్నంతో ఖచ్చితంగా హిట్ కొడతాను అంటూ ప్రోమోలు,పోస్టర్స్ తో నమ్మకం కలిగించాడు శిరీష్. అయితే ప్రోమోలలో క్రియేట్ చేసినంత క్యూరియాసిటీకు తగినట్లు గా చిత్రం లేదు కానీ , అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది. పరమ రొటీన్ కథ,కథనంతో పరుశరామ్ చేసిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ అయితే నటనలో మెచ్యూరిటి కనపరిచాడు. సినిమాలో బోర్ పెద్దగా లేదు కాబట్టి.. అల్లు అరవింద్ ఇలాంటి సినిమాలను లేపటంలో సరైనోడు కాబట్టి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్లే అవకాసం ఉంది.

  బిజినెస్ పనిమీద కాశ్మీర్ వేలికు వెళ్లిన శిరీష్ (అల్లు శిరీష్) టెక్కింగ్ ఏక్సిడెంట్ లో ఇరుక్కున్న అనన్య(లావణ్య త్రిపాఠి)ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేస్తూ...ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె బిటెక్ ఫైనలియర్..వైజాగ్ గీతమ్స్ కాలేజీలో చదువుతోందని తెలుసుకుని, వెంబడిస్తారు. అంతేకాకుండా తన ప్రేమ విషయం తన తండ్రి(ప్రకాష్ రాజ్) కు చెప్తాడు.

  అయితే అప్పటికే శిరీష్ అన్నయ్య ఓ మిడిల్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటంతో అప్ సెట్ అయి ఉన్న ప్రకాష్ రాజ్ నో చెప్తాడు. దాంతో శిరీష్ తను తమ కుటుంబ నేపధ్యం చెప్పకుండా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా ఆమెను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఈలోగా ఓ ట్విస్ట్. అను తండ్రి రావు రమేష్ ఆమెకు ఓ సంభంధం సెటిల్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది...ఎలా ఆమె తండ్రిని సైతం ఒప్పించి,తన ప్రేమను గెలిపించుకున్నాడు అనేది మిగతా కథ.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

  మిక్స్ చేయటం

  మిక్స్ చేయటం

  ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ఫ్యామిలీ వ్యాల్యూస్ కు ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేయటం, అందులో పరుశరామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

  కలిసొచ్చింది

  కలిసొచ్చింది

  ముఖ్యంగా ఈ సినిమాకు లావణ్య త్రిపాఠి నటన కలిసివచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు ప్రాణం పోసింది. కేవలం ఫన్నీ సీన్స్ లోనే కాక ఎమోషన్ సీన్స్ లోనూ తన సత్తా ఏంటో చూపెట్టింది.

  కామెడీ

  కామెడీ

  అలీ,సుబ్బరాజు మధ్య నడిచే ట్రాక్ సెకండాఫ్ ని నిలబెడితే, ఫస్టాఫ్ ని ప్రభాస్ సీన్ ..తనదైన శైలి కామెడీతో లాగేసాడు

  ఇల్లాజకల్

  ఇల్లాజకల్

  అయితే దర్శకుడు అంతా బాగానే రాసాడు తీసాడు కానీ హీరోయిన్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు, ఆమెలో ఉన్న ప్రేమను బయిటకు తీసుకురావటానికి చేసే ప్రయత్నం సీన్స్ అన్నీ ఇల్లాజికల్ గా సాగాయి. ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుండేది.

  పరుశరామ్ బలం

  పరుశరామ్ బలం

  పరుశరామ్ కు తను మోజుబడి రాసుకున్న కథ బాగా లేదు కానీ, డైలాగులు మాత్రం బలంగా ఉన్నాయి.

  పెద్ద మైనస్

  పెద్ద మైనస్

  సినిమాలో పెద్ద మైనస్ ఏమిటీ అంటే అప్పటిదాకా బాగా తీసుకువచ్చిన సినిమాని క్లైమాక్స్ లో వదిలేసాడని చెప్పాలి. తేలిపోయింది.

  ధమన్ ప్లస్

  ధమన్ ప్లస్

  ధమన్ రెగ్యులర్ ట్యూన్స్ కాకుండా సినిమాకు డిఫెరెంట్ గా ఫీల్ గుడ్ సినిమాల తరహాలో ప్రయత్నం చేసాడు కానీ పెద్ద గొప్పగా అయితే లేదు

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా

  మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది. అలాగే మణికంధన్ సినిమాటోగ్రఫీ కూడా ప్రతీ లొకేషన్ ని విజువల్ ట్రీట్ లాగ చూపించే ప్రయత్నం చేసింది.

  అదిరింది

  అదిరింది

  ఎప్పటిలాగే అల్లు అరవింద్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాగా రిచ్ గా ఉండి సినిమాను మరో మెట్టు పైకెక్కించాయి.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్: గీతా ఆర్ట్స్

  దర్శకత్వం : పరశురామ్, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు

  సంగీతం: తమన్.యస్‌.యస్‌,

  యాక్షన్: రామ్, లక్ష్మణ్,

  ఆర్ట్ : రామాంజనేయులు,

  సినిమాటోగ్రాఫి : మని కంఠన్,

  ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌: నాగరాజు,

  ఎడిటర్: మార్తాడ్ కె.వెంకటేష్,

  నిర్మాత : అల్లు అరవింద్, బన్నీ వాసు

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పరశురామ్.

  విడుదల తేదీ : 5 ఆగష్టు 2016

  ఫైనల్ గా ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ సినిమా అల్లు శిరీష్ ని వారి గుమ్మాలదాకా తీసుకువెళ్తుంది కానీ వారి హృదయాల్లోకి తీసుకెళ్లలేదు. అసభ్యత, అశ్లీలం లేని ఈ సినిమా కాలక్షేపాణికి ఓ సారి చూడవచ్చు.

  English summary
  Allu Sirsh's SrirastuSubhamastu movie released today. It's a Old school love story , Allu sirish is looks wise decent in this movie. Allu Sirish get a break,he will make him nearer to family crowd to some extent !
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X