»   » కామెడీ రివేంజ్ డ్రామా (అంధగాడు మూవీ రివ్యూ)

కామెడీ రివేంజ్ డ్రామా (అంధగాడు మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉయ్యాల జంపాల చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి విజయాలతో హీరో రాజ్ తరుణ్ టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం అంధగాడు. విభిన్నమైన పాత్రల ఎంపిక ప్రక్రియలో భాగంగా తన ఇమేజ్ భిన్నంగా రాజ్ తరుణ్ ఈ చిత్రంలో అంధుడి పాత్రను పోషించారు. లవ్, రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను కలబోసుకొని రూపుదిద్దుకొన్న అంధగాడు ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.

అంధగాడు కథ..

అంధగాడు కథ..

గౌతమ్ (రాజ్ తరుణ్) ఓ అనాధ. పుట్టుకతోనే అంధుడు. ఓ అంధుల ఆశ్రమంలో పెరిగి పెద్దయిన రాజ్ తరుణ్ రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. కంటిచూపు వస్తే ప్రపంచాన్ని చూడాలనే బలమైన కోరికతో ఉంటాడు. ఆ క్రమంలో నేత్ర (హెబ్బా పటేల్) కంటి డాక్టర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ (షియాజీ షిండే) కూతురు నేత్ర అంటే ఆకర్షణ ఏర్పడుతుంది. తనకు తెలియకుండా ప్రేమలో పడిపోతాడు. కానీ ఓ విషయంలో వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడుతాయి. అయినా వైద్యురాలిగా రాజ్ తరుణ్‌కు కంటిచూపు తెప్పించడంలో తన బాధ్యతను నెరవేరుస్తుంది. అలా కళ్లు వచ్చి ప్రపంచాన్ని చూస్తున్న రాజ్ తరుణ్‌కు ఓ సమస్య వచ్చి పడుతుంది. కొన్ని పరిస్థితుల కారణంగా ఓ మర్డర్ చేస్తాడు. విశాఖలో పేరు మోసిన రౌడీ పందెం బాబ్జీ అనే మరో వ్యక్తిని మర్డర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


పలు ప్రశ్నలకు సమాధానమిలా..

పలు ప్రశ్నలకు సమాధానమిలా..

కళ్లు వచ్చిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన రాజ్ తరుణ్ ఇలా ఎందుకు మర్డర్లు చేయాల్సి వచ్చింది? అందుకోసం ఎలాంటి డ్రామాలు ఆడాడు? ప్రేమించిన నేత్ర కోసం ఆమె తండ్రిని ఎలా మెప్పించాడు? అసలు తన లక్ష్యం ఏమిటీ? హెబ్బా పటేల్‌తో ఏర్పడిన మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి? పందెం బాబ్జీని ఎందుకు చంపాలనుకొంటాడు. ఈ కథలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే అంధగాడు చిత్రం.


ఫస్టాఫ్ ఇలా..

ఫస్టాఫ్ ఇలా..

లవ్, కామెడీ కలిసిన ఈ చిత్రం రివేంజ్ డ్రామా. పగ, ప్రతీకారంతో రగిలిపోయే యువకుడు తన లక్ష్యాన్ని ఎలా నేరవేర్చుకొన్నాడు అనేది చాలా సింపుల్ లైన్. కానీ స్వతహాగా కథా రచయిత అయిన వెలిగొండ శ్రీనివాస్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటను తాను అల్లుకొన్న కథకు హీరో, హీరోయిన్లుగా ఎంచుకొన్నారు. అనాధ అంధులు అనే ఉద్వేగపూరితమైన పాయింట్‌కు కమర్షియల్ హంగులు జోడించడం అభినందనీయం. కానీ కథలో ఇంటెన్సిటీకి తగినట్టు కథనం లేకపోవడం, నిర్మాణ విలువలు నాసిరకంగా ఉండటం ఈ సినిమా వేగానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఫస్టాఫ్‌లో చాలా రొటీన్‌గా సాగిపోతున్న సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో కథ రచయితగా, దర్శకుడిగా సఫలమయ్యాడు. ఫస్టాఫ్ అయిన తర్వాత విశ్లేషించుకొంటే క్లైమాక్స్‌లో చెప్పే పాయింట్ కోసం మొదటి భాగాన్ని చాలా నాసిరకంగా చుట్టేశారు అనే ఫీలింగ్ కలుగుతుంది.


సెకండాఫ్ అలా..

సెకండాఫ్ అలా..

ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో రెండో భాగం ప్రారంభమవుతుంది. గత చిత్రాల్లో రాజ్ తరుణ్‌కు ఉన్న ఇమేజ్, బాడీ లాంగ్వేజిని దృష్టిలో పెట్టుకోవడం మూలాన కథలో ఉండే సీరియస్ పాయింట్‌ను వదిలేసి చివరి వరకు హాస్యంతో దర్శకుడు వెలిగొండ నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రాసెస్‌లో సినిమా గ్రిప్పింగ్ లేకపోవడం, పాటలకు సరైన టైమింగ్ లేకపోవడం, కామెడీ చాలా పేలవంగా ఉండటం వెరసి రొటీన్ సినిమా చూస్తూ ఉన్నామన్న భావన ఏర్పడుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఎమోషనల్ పాయింట్‌ను టచ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశాడు. సినిమాను లైన్లోకి తెచ్చాడు అని అనుకునేంతలోనే మళ్లీ రొటీన్ పట్టాలెక్కి హడావిడిగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. రాజ్ తరుణ్‌ను కొత్తగా ప్రజెంట్ చేసే సత్తా ఉన్న కథను ఎంచుకొన్న దర్శకుడు.. దానిని ఆచరణలో పెట్టే విషయంలో తడబాటుకు గురయ్యాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్లను ఆనందించే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా చూసుకొంటే కొన్ని సన్నివేశాల్లో కామెడీ బ్రహ్మండంగా పేలింది.


రాజ్ తరుణ్ ఫెర్ఫార్మెన్స్ ఈ విధంగా..

రాజ్ తరుణ్ ఫెర్ఫార్మెన్స్ ఈ విధంగా..

రాజ్ తరుణ్ మరోసారి అంధగాడు సినిమా బరువును పూర్తిగా తన భుజాలపైనే మోసాడు. గత చిత్రాల్లో కామెడీతో ఆకట్టుకొన్న రాజ్ తరుణ్ ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. సస్సెన్ థ్రిల్లర్ సినిమాలతోపాటు అన్ని జోనర్లు చేసే సత్తా ఉందని నిరూపించుకోవడానికి ఈ చిత్రం బాగా ఉపయోగపడుతుంది. అంధుడి పాత్ర కోసం మరికొంత ఎక్సర్‌సైజ్ చేస్తే బాగుండేది. ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేసే అంధుడి పాత్రను కేవలం కామెడీ కోసం ఉపయోగించుకోవడం వల్ల సినిమాలో ఉండే ఎమోషన్స్ నీరుగారిపోయాయి. ఈ సినిమా వరకు రాజ్ తరుణ్‌ను ఎక్కడ తప్పు పట్టాల్సిన పనిలేదు. పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు.


హెబ్బా గ్లామర్..

హెబ్బా గ్లామర్..

హెబ్బా పటేల్ కంటి డాక్టర్ కనిపించింది. బలమైన పాత్రలు పోషించే హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నటనపరంగా ఇంకా చాలా మెచ్చురిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావనను హెబ్బా కల్పించారు. కేవలం గ్లామర్‌నే నమ్ముకోకుండా యాక్టింగ్ పరంగా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. డ్యాన్స్‌లు, డైలాగ్ సింక్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లామర్ తారగా ఫర్వాలేదనిపించింది. కంటి డాక్టర్ పాత్రను ఇంకా సమర్ధవంతంగా పోషించడానికి స్కోప్ ఉంద.


నట కిరీటీ మరోసారి..

నట కిరీటీ మరోసారి..

అంధగాడులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చాలా కీలకమైన పాత్ర. చిత్రంలోని కీలక భాగమంతా నటకిరీటీ మీదే నడుస్తుంది. ఎంతో అనుభవం ఉన్న ఆయనకు కులకర్ణి లాంటి పాత్రలు కొట్టిన పిండే. కాకపోతే రాజేంద్రప్రసాద్ పాత్రను దర్శకుడు మరింత తీర్చిదిద్ది ఉంటే సినిమాకు మరింత ఆకర్షణగా మారే అవకాశం ఉండేది. రాజేంద్ర ప్రసాద్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. అయితే నటకిరిటీ పోషించిన కులకర్ణి పాత్ర గుర్తుండిపోయే పాత్ర మాత్రం కాదు.


పూర్తిస్థాయి విలన్‌గా రాజా రవీంద్ర

పూర్తిస్థాయి విలన్‌గా రాజా రవీంద్ర

ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాత్రల్లో ఒకటి రాజా రవీంద్ర (పందెం బాబ్జీ), రెండోది హెబ్బా పటేల్ తండ్రిగా, ఎస్పీగా చేసిన షియాజీ షిండే. ఇటీవల కాలంలో ఒకట్రెండు సీన్లతో నెట్టుకొస్తున్న రాజా రవీంద్రకు ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర లభించడం విశేషం. ఆకురౌడీగా ఆయన తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేశాడు. అయితే భారీ ఇమేజ్ ఉన్న విలన్లను చూసిన టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్‌గా రాజా రవీంద్రతో సంతృప్తిపడటం కష్టమే. అయినా తన పాత్ర మేరకు విలనిజాన్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. షియాజీ షిండే చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ తెరపై కనిపించాడు. కూతురి ప్రేమను వ్యతిరేకించే తండ్రిగా, నేరస్తుల ఆగడాలను ఎదిరించే సిన్సియర్ ఆఫీసర్‌గా ఆయన ఓకే అనిపించాడు.


హాస్యం గిలిగింతలు..

హాస్యం గిలిగింతలు..

కామెడీ విషయానికి వస్తే రాజ్ తరుణ్‌తో కలిసి సత్య రవి తన మార్కు హాస్యాన్ని పండించాడు. ఆయన హీరో స్నేహితుడిగా రొటిన్ పాత్రలో కనిపించాడు. యువ కామెడీ ఆరిస్టుల్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకొంటున్న సత్య రవి తన నటనను మెరుగు పర్చుకుంటే సునీల్ స్థాయిని చేరుకొనే సత్తా ఉంది. మరో ప్రధానమైన పాత్రలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు.


రచయిత నుంచి డైరెక్టర్‌గా

రచయిత నుంచి డైరెక్టర్‌గా

రచయితగా చాలా అనుభవం ఉన్న వెలిగొండ శ్రీనివాస్ మొదటిసారి మెగా ఫోన్ చేతబట్టాడు. చాలా బరువైన కథకు కామెడీ, కమర్షియల్ హంగులు జోడించి హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే కథనం విషయంలో సరిగా దృష్టి పెట్టకపోవడం, చాలా వరకు సీన్లను చుట్టేశారనే విధంగా చిత్రీకరించడం ప్రధానమైన లోపం. రాజేంద్ర ప్రసాద్, ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే లాంటి ఆర్టిస్టులను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడనే భావన ఏర్పడుతుంది.


రచయితగా..

రచయితగా..

రచయితగా వెలిగొండ శ్రీనివాస్ కథలో ఉండే ఉద్వేగాన్ని తెరమీద పండించడంలో తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. అందుకు ఆయనకు ఉన్న పరిమితులే ఈ లోపానికి కారణమై ఉండొచ్చు. మొదటి సినిమా దర్శకుడిగా చూస్తే మంచి మార్కులే కొట్టేశాడు. డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. పాత్రల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తే మెరుగైన అవుట్‌పుట్ వచ్చే అవకాశం ఉండేది. సినిమా రేంజ్ కూడా పెరిగేది.


సాంకేతిక విభాగాల పనితీరు..

సాంకేతిక విభాగాల పనితీరు..

అంధగాడు చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. మిగితా చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో సంగీతం అంతంతా మాత్రమే. సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా రీరికార్డింగ్ అందించడంలో కొన్ని లోపాలు కనిపించాయి. కెమెరా, ఎడిటింగ్, ఇతర విభాగాలు తమ బాధ్యతను ఓకే అనిపించే విధంగా పనిచేశాయి.


చివరగా..

చివరగా..

రచయితగా రాణించిన వెలిగొండ శ్రీనివాస్ తాను దర్శకుడిగా మారేందుకు సరైన కథనే ఎంచుకొన్నారు. అయితే తాను మనసులో ఊహించుకొన్న భావోద్వేగాన్ని తెరమీద చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుల్లో కనిపించే ఓ కసి, పట్టుదల అంధగాడులో కనిపించదు. బీ, సీ సెంటర్లతోపాటు, మల్టీ ప్రేక్షకులు చూపే ఆదరణ బట్టే ఈ సినిమా రేంజ్ ఎంటో తెలుస్తుంది.


బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
కథ
రాజ్ తరుణ్


నెగిటివ్ పాయింట్స్
కథనం..
మాటలు, పాటలు
డైరెక్షన్
నిర్మాణ విలువలుతెర ముందు.. వెనుక

తెర ముందు.. వెనుక

తారాగణం: రాజ్ తరుణ్, హెబ్బాపటేల్, రాజా రవీంద్ర, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్య రవి,
దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: రామబ్రహ్మం, అనిల్ సుంకర
సంగీతం: శేఖర్ చంద్ర
విడుదల తేదీ: జూన్ 2, 2017


English summary
Tollywood hero Raj Tarun's latest movie Andhagadu. He acted as blind in this movie. Writer Veligonda Srinivas become director for this movie. This movie made with elements like comedy suspense thriller
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu