For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అంతరిక్షం 9000 kmph’ మూవీ రివ్యూ, రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి, శ్రీనివాస్ అవసరాల
  Director: సంకల్ప్ రెడ్డి

  తెలుగు సినిమా పరిశ్రమ మూస కథలు, రోటీన్ సినిమాల వలయం నుంచి క్రమక్రమంగా బయట పడుతోంది. ఈ మధ్య కాలంలో యువ దర్శకులు తమ సరికొత్త ఆలోచనలకు పదును పెడుతూ వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. మనది కేవలం రిజనల్ ఇండస్ట్రీ కాదు... జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే సత్తా ఉందని నిరూపించే సినిమాలు తీయడానికి నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'అంతరిక్షం'. ఇంతకు ముందు 'ఘాజీ' లాంటి రొమాలు నిక్కబొడిచే అండర్ వాటర్ సస్సెన్స్ థ్రిల్లర్ రూపొందించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా కావడం, ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ దర్శకడు క్రిష్ భాగస్వామ్యం, వరుణ్ తేజ్ ఇలా అన్నీ కలిసి అంచనాలు నిజంగానే అంతరిక్షం అంత పైకి ఎగబాకాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది అనేది ఓసారి విశ్లేషిద్దాం.

   కథ విషయానికొస్తే....

  కథ విషయానికొస్తే....

  ఇండియన్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్ దేవ్(వరుణ్ తేజ్). అతని నేతృత్వంలో భారతదేశం ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకుగాను విప్రయాన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తుంది. ప్రయోగం విజయవంతం అయినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దానితో కమ్యూనికేషన్ తెగిపోతుంది. దాన్ని సరిచేయడానికి చేసిన ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తన ప్రియురాలు(లావణ్య)ను కోల్పోయిన దేవ్... తన జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు.

   దేశం పరువుపోయే పరిస్థితుల్లో...

  దేశం పరువుపోయే పరిస్థితుల్లో...

  కట్ చేస్తే... మెహిరా అనే శాటిలైట్లో సాంకేతిక లోపం ఏర్పడుతుంది. అది కక్ష తప్పితే ఇతర దేశాల శాటిలైట్లను సైతం ఢీకొని ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అలా జరిగితే మన దేశం నుంచి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగిపోతుంది. ప్రపంచ దేశాల ముందు మన పరువు పోతుంది. మెహిరా లోపాన్ని సరిచేసే సత్తా దేవ్‌కు మాత్రమే ఉంటుంది. ఐదేళ్లుగా స్పేస్ సెంటర్‌కు దూరంగా ఉన్న అతడిని తిరిగి రప్పిస్తారు.

  అసలు లక్ష్యం విప్రయాన్

  అసలు లక్ష్యం విప్రయాన్

  మెహిరా శాటిలైట్ సమస్యను సరిచేయడానికి స్పేస్ లోకి వెళ్లిన దేవ్.... అసలు లక్ష్యం అది కాదు. అందరూ డెడ్ అయిపోయింది అనుకుంటున్న విప్రయాన్ మిషన్ సక్సెస్ చేయాలనుకుంటాడు. కానీ దేవ్ చేసే దాంట్లో చాలా రిస్క్ ఉండటం, దేవ్‌తో పాటు ఇతర వ్యోమగాముల ప్రాణాలు రిస్కులో పడే అవకాశం ఉండటంతో ఇండియన్ స్పేస్ సెంటర్ నుంచి అనుమతి లభించదు. మరి దేవ్ ఏం చేశాడు? తాను అనుకున్నది ఎలా సాధించాడు? అనేది తర్వాతి కథ.

  పెర్ఫార్మెన్స్

  పెర్ఫార్మెన్స్

  వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో నటన సూపర్బ్ అనేలా ఉంది. దేశం గర్వించే లక్ష్యాలు అందుకోవాలని తపనపడే పరిశోధకుడిగా మెప్పించాడు. మరో వ్యోమగామి రియా పాత్రలో అదితిరావు హైదరి ఫర్వాలేదు. లావణ్య త్రిపాఠి కనిపించేది కొంతసేపే అయినా క్యూట్‌గా అనిపిస్తుంది. సత్యదేవ్, శ్రీనవాస్ అవసరాల, శంకర్, రెహమాన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే

  ప్రశాంత్ విహారి అందించిన సంగీతం ఫర్వాలేదు. జ్ఞానవేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బావుంది. రాజీవ్ రాజ‌శేఖ‌రన్ అందించిన గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగిన విధంగా ఉన్నాయి.

  కథ, స్క్రీన్ ప్లే

  కథ, స్క్రీన్ ప్లే

  సినిమా కథ పరంగా చూస్తే.... ఇప్పటి వరకు తెలుగులో రాని సరికొత్త కథ. అయితే స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రేక్షకులకు సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయాడు.

   ఫస్టాఫ్ ఎలా ఉంది?

  ఫస్టాఫ్ ఎలా ఉంది?

  సినిమా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. హీరో ఫ్లాష్‌బ్యాక్ సీన్లు, ప్రజంట్ జరిగే కథను సరిగా సింక్ చేయలేదు. ఇంటర్వెల్ వరకు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనంలో వేగం లోపించడం ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తుంది. వినోదం కానీ, సీరియస్‌నెస్ కానీ కనిపించదు.

   సెకండాఫ్ ఎలా ఉంది

  సెకండాఫ్ ఎలా ఉంది

  ఇక సెకండాఫ్ కథ మొత్తం అంతరిక్షంలోనే నడుస్తుంది. ఇందులో వచ్చే సన్నివేషాలు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని పెంచాయి. వరుణ్ తేజ్ చేసే రిస్కీ సీన్లు కొన్ని చోట్ల ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ముగింపు గొప్పగా ఉందని చెప్పలేం కానీ ఫర్వాలేదు.

   ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  అంతరిక్షం నేపథ్యంలో సాగే కథ.
  స్పేస్, శాటిలైట్ విజువల్ ఎఫెక్ట్స్
  వరుణ్ తేజ్, అదితి రావు హైదరి

   మైనస్ పాయింట్స్

  మైనస్ పాయింట్స్

  స్లోగా సాగే మొదటిభాగం
  స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేక పోవడం

  చివరగా

  చివరగా

  తెలుగులో ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడం అభినందించదగ్గ విషయం. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను రూపొందించే ప్రయత్నం బావుంది. అయితే వినోదం లోపించింది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ సినిమాలో చూపించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా... సరికొత్త అనుభూతితో కూడిన వినోదం అందించాలనే ప్రయత్నం చేసినా.... ప్రేక్షకుల మెప్పుపొందడానికే. అది ఏ మేరకు వారికి రీచ్ అయింది? అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుుంది.

  న‌టీన‌టులు

  న‌టీన‌టులు

  వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల

  సాంకేతిక విభాగం:
  ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
  నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
  నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
  సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా)
  ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్
  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: రామ‌కృష్ణ సబ్బ‌ని, మోనిక నిగొత్రే స‌బ్బ‌ని
  సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్ విహారి
  స్టంట్స్: ట‌డోర్ ల‌జ‌రోవ్
  సిజి: రాజీవ్ రాజ‌శేఖ‌రన్

  English summary
  Antariksham movie Review and Review. Antariksham 9000 KMPH is a 2018 Indian Telugu-language science fiction space thriller film written and directed by Sankalp Reddy. The film stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X