»   » కథ,కథనం కూడా 'సైజ్‌ జీరో' (రివ్యూ)

కథ,కథనం కూడా 'సైజ్‌ జీరో' (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

'సైజ్‌ జీరో' ఈ రోజు ప్రపంచాన్ని ఊపేస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ ని పట్టుకుని సినిమా చేయాలనుకోవటం చాలా మంచి ఆలోచన. ముఖ్యంగా నేటి సొసైటీలో ఈ ట్రెండ్ ఎంతవరకూ మంచిది...ఫాలో అవవచ్చు అనే విషయం చర్చించే సినిమా రావటం చాలా అవసరం..హర్షణీయం. అందుకు తగినట్లే దర్శకుడు సమజానికి సందేశం ఇవ్వాలని, ఆ దిశగా కొంచెం కామెడీ మిక్స్ చేస్తూ కథనం అల్లుకుందామనుకున్నాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభం లో ఎత్తుగడ , మెయిన్ పాత్ర క్యారక్టర్ ఎలివేషన్ బాగున్నా ... కథని మలుపు తిప్పే ప్రధాన సమస్య వైపు చాలా సేపటివరకూ ప్రయాణం పెట్టుకోలేదు. దాంతో సెకండాఫ్ కు వచ్చేసరికి సబ్ ప్లాట్ లు ఎక్కువై కన్ఫూజ్ అయ్యిపోయాడనిపిస్తుంది. సింగిల్ లైన్ గా బాగున్నా, విస్తరించిన సినిమాగా అంత గొప్పగాలేదు. అప్పటికీ అనుష్క ఒబిసిటీ ఉన్న పాత్ర స్వీటీగా లీనమై బాగానే మొత్తం తన భుజంపై వేసుకుని నిలబెట్టే ప్రయత్నం చేసింది.


చిన్నప్పటి నుంచి బొద్దుగా,లావుగా ఉండే సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క)కు ఎన్ని సంభంధాలు వచ్చినా సెట్ అవ్వవు. ఆమె శరీర తీరే ఆమెకు అడ్డమవుతూంటుంది. అదే ప్రాసెస్ లో పెళ్లి చూపులకు వచ్చిన అభి(ఆర్య)తో పెళ్లి కుదరకపోయినా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అది స్నేహం నుంచి ప్రేమగా మారుతున్న సమయంలో అభి జీవితంలోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటరవుతుంది. దాంతో తన ప్రేమ సక్సెస్ కాదని అర్దం చేసుకున్న స్వీటీ ...ముందు తన లావు తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) నడిపే సైజ్ జీరో సంస్ధ లో చేరుతుంది. అయితే అక్కడ వెయిట్ లాస్ పోగ్రామ్ లో ఇస్తున్న ఫుడ్, డ్రింక్స్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయిని తెలుసుకుని ఆ సంస్దపై యుద్దం ప్రకటిస్తుంది. అంతేకాదు...అప్పటికే అక్కడ చేరి ఆరోగ్యం పోగొట్టుకున్న స్నేహితురాలు జ్యోతి కు సాయిం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వీటీ ఏం చేసింది. తను అనుకున్న లక్ష్యం చేరిందా...అభితో ప్రేమ వ్యవహారం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


 వాస్తవానికి ఈ కథలో ప్లాట్ కన్నా సబ్ ప్లాట్ డామినేషన్ ఎక్కవ కనిపిస్తుంది. ఒక స్టేజిలో ఏది ప్లాటో ఏది సబ్ ప్లాటో అర్దం కాని సిట్యువేషన్ కు వస్తుంది. ఈ కథ..స్వీటి అనే అమ్మాయి... సైజ్ జీరో అనే మోసపూరిత వెయిట్ లాస్ సంస్ధపై చేసిన పోరాటమో, లేక అభి అనే కుర్రాడితో ప్రేమ కథో అవన్నీ కాక స్వీటి పెళ్లి ఎలా జరిగిందనే కథో స్పష్టం ఉండదు. కాస్సేపు అటు వైపు, మరి కాస్సేపు ఇటు వైపు సాగుతుంది. దానికి తోడు అనుష్క పాత్రకు సరైన ఎమోషన్ బ్యాక్ అప్ ఉండదు. ఆమె భుజాన వేసుకునే సమస్యతో ఆమెకు ఎమోషన్ బాండింగ్ ఉండదు. దాంతో అది ఎవరి కథో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సైజ్ జీరో కాన్సెప్టు మీద మొదలైన కథ...మోస పూరిత వెయిట్ లాస్ క్లీనిక్ ని బయిట పెట్టడంతో ముగియటంతో పూర్తిగా కథ,కథనం దారి తప్పినట్లనిపిస్తుంది.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


క్రెడిట్ మొత్తం

క్రెడిట్ మొత్తం

ఈ సినిమా క్రెడిట్ మొత్తం అనుష్కకే దక్కాలి. ఎందుకంటే హీరోయిన్ గా టాప్ స్లాట్ లో ఉన్న ఆమె...ఇలాంటి గీతా సింగ్ ని గుర్తు చేసే గ్లామర్ లేని పాత్రను ఒప్పుకుని,మెప్పించే ప్రయత్నం చేసినందుకు. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అయినా ఆ క్రెడిట్ మొత్తం నిశ్శందేహంగా ఆమెదే.


అవసరమా

అవసరమా

బ్రహ్మానందం కామెడీ ట్రాక్ చాలా వెకిలిగా సాగుతుంది. రాఘవేంద్రరావుగారి సినిమాల్లో ఉండే ట్రాక్ లాగ అనిపిస్తుంది. అంతేకానీ సెన్సిబుల్ గా తీసిన ఈ సినిమాకు తగినట్లు ఉండదు. ఇక బాల నటుడు నుంచి యంగ్ కమిడియన్ గా ఎదుగుతున్న భరత్ ..అనుష్క తమ్ముడుగా ఓకే అనిపిస్తాడు. ఇలాంటి రెగ్యులర్ పాత్రలకు ఇంతటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవసరమా అనిపిస్తుంది.


గెస్ట్ లు అంటే గెస్ట్ లే

గెస్ట్ లు అంటే గెస్ట్ లే

ఈ సినిమాలో నాగార్జున, రానా దగ్గుబాటి, జీవ, అడవి శేష్, బాబీ సింహా, తమన్నా, హన్సిక, శ్రీ దివ్య, లక్ష్మీ మంచులు అతిధి పాత్రలు చేసారు. అయితే వీరు గెస్ట్ లు అంటే గెస్ట్ లే..కొద్ది క్షణాలే కనిపిస్తారు. ఉన్నంతలో నాగార్జున,మంచు లక్ష్మి కాస్త రిజిస్టర్ అవుతారు.


లావుగా ఉన్నా...

లావుగా ఉన్నా...

ఈ సినిమాలో రొటీన్ కాన్సెప్టు..లావుగా ఉన్నా మంచి మనస్సు ఉంటుంది అని. ఈ ముక్క చెప్పటానికి రెండు గంటలు పైగా సాగతీసారనిపించేలా కథనం అల్లారు. మరికాస్త ఎంటర్టైన్మెంట్ జోడిస్తే బాగుండేది.అస్సలు లేదు

అస్సలు లేదు

సినిమా సెకండాఫ్ వరకూ కథలోకి రాకుండా నానుస్తుంది. సరే వచ్చారు అనుకున్నా...తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయాలే స్క్రీన్ ప్లే రాసారు. అంతేగానీ కాస్తంత అయినా స్క్రీన్ ఇంట్రస్ట్ కోసమైనా సీన్స్ చేసుకోలేదు.


దర్శకుడుగా

దర్శకుడుగా

దర్శకుడుగా అనగనగా ఒక ధీరుడుతో లాంచ్ అయిన ప్రకాష్..ఈ సినిమాను జస్ట్ ఓకే అనిపించేలా తీసారు. దర్శకత్వ మెరుపులేవీ కనిపించవు.టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

ఈ సినిమా మీరు చివరి దాకా ఈ మాత్రం అయినా చూడగలిగాం అంటే నిరవ్ షాహ్ కెమెరా వర్క్, కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ అనే చెప్పాలి. డైలాగులు అద్బుతం కాదుకానీ ఓకే అనిపిస్తాయి. అక్కడక్కడా బాగానే పేలాయి.


ఎవరెవరు

ఎవరెవరు

నటీనటులు:అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: యం.యం.కీరవాణి,
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా,
ఆర్ట్: ఆనంద్ సాయి,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
కాస్ట్యూమ్స్: ప్రశాంత్,
కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం,
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,
దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి
విడుదల తేదీ: 27, నవంబర్ 2015.ఫైనల్ గా ఒబిసిటీ అనే విషయాన్ని సుగర్ కోటెడ్ గా చెప్పాలన్న దర్శకుడు ఆలోచన వరకూ అద్బుతం. అయితే దాని ఎగ్జిక్యూషన్ మరింత బాగుంటే ఖచ్చితంగా ఓ లాండ్ మార్క్ సినిమా అయ్యేది. ఇప్పుడు ఈ సినిమా అనుష్క అభిమానులకు, మల్టి ఫ్లెక్స్ అభిమానులకు అన్నట్లు తయారైంది. వీరిని పూర్తిగా అలరిస్తే...బాగా రీచ్ అయినట్లే


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
After tasting two back to back blockbusters Baahubali and Rudhramadevi, Anushka Shetty came today with Size Zero. Size Zero released today with divide talk. Size Zero deals with an often overlooked issue with great sensibilities.
Please Wait while comments are loading...