For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిశ్శబ్దం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: అనుష్క శెట్టి, ఆర్ మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినిపాండే
  Director: హేమంత్ మధుకర్

  బాహుబలి, భాగమతి చిత్రాల తర్వాత అనుష్క శెట్టి నటించిన చిత్రం నిశ్శబ్దం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో నిశ్శబ్దం మూవీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ రిలీజైంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఈ చిత్రం అధిగమించిందా అనే విషయాలు తెలుసుకోవాలంటే నిశ్శబ్దం కథ, కథనాలను సమీక్షించాల్సిందే.

  నిశ్శబ్దం మూవీ కథ

  నిశ్శబ్దం మూవీ కథ

  పుట్టుకతో మూగ, చెవుడు యువతి సాక్షి (అనుష్కశెట్టి) అద్భుతమైన పెయింటర్. ఆంథోని (ఆర్ మాధవన్) గొప్ప సంగీతకారుడు. ఇద్దరిలోని ప్రతిభ ఒకరికి మరొకరు దగ్గరయ్యేలా చేస్తుంది. ఎంగేజ్‌మెంట్ తర్వాత సాక్షి స్నేహితురాలు (సొనాలి) అదృశ్యం అవుతుంది. ఆ క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో ఆంథోని హత్యకు గురవుతాడు. ఆంథోని హత్య మిస్టరీగా మారడంతో ఆ కేసును ఛేదించడానికి పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్ రిచర్డ్ (కిల్ బిల్ ఫేం మైఖేల్ మ్యాడ్సన్) సహాయంతో మరో పోలీసు అధికారి మహాలక్ష్మి (అంజలి) రంగంలోకి దిగుతుంది.

  నిశ్శబ్దం మూవీలో ట్విస్టులు

  నిశ్శబ్దం మూవీలో ట్విస్టులు

  ఆంథోని మరణానికి కారణమేమిటి? ఆంథోనిని ఎవరు? ఎందుకు చంపారు? ఆంథోని హత్యలోని మిస్టరీని మహాలక్ష్మి ఛేధించిందా? ఆంథోని హత్యకేసులో కెప్టెన్ రిచర్డ్ పాత్ర ఏంటి? సొనాలి అదృశ్యం వెనుక కారణాలు ఏమిటి? అదృశ్యమైన సోనాలి గురించి వివేక్ (సుబ్బరాజు) ఎందుకు ఆవేదన చెందుతాడు? తన ప్రాణ స్నేహితురాలు సొనాలి తప్పిపోయిన తర్వాత సాక్షి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? లాంటి ప్రశ్నలకు సమాధానమే నిశ్శబ్దం సినిమా కథ.

  నిశ్శబ్దం మూవీ అనాలిసిస్

  నిశ్శబ్దం మూవీ అనాలిసిస్

  అమెరికాలోని సీటెల్‌లోని ఓ విల్లాలో జరిగిన మర్డర్ల ఆధారంగా కథ మొదలవుతుంది. ఓ హత్య అనంతరం 40 ఏళ్ల తర్వాత అదే విల్లాలో మ్యూజిక్ లెజెండ్ ఆంథోని మర్డర్ జరగడంతో హత్య కేసు దర్యాప్తు కీలకంగా మారుతుంది. మహాలక్ష్మికి ముందుకు వచ్చిన అనుమానాలు దర్యాప్తును మరోస్థాయికి చేరుతుంది. ఈ క్రమంలో వెల్లడయ్యే ట్విస్టుల కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ కథలో బలమైన పాత్రలు ఉండటంతో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇందులోని ప్రతీ పాత్ర కూడా అర్ధవంతంగా ఉండటంతోపాటు ప్రాధాన్యం కల్పించడం సినిమాకు బలంగా మారింది. హత్య కేసు దర్యాప్తు విషయానికి వస్తే దర్శక, రచయితలు తమ సౌలభ్యానికి పరిస్థితులను వాడుకోవడం అత్యంత సినిమాటిక్‌గా అనిపిస్తుంది. బలమైన పాత్రల కారణంగా ఆ లోపాలు పెద్దగా కనిపించవు. కొన్ని విషయాలు లాజిక్‌ల పరంగా సిల్లీగా ఉంటాయి. వాటి విషయంలో మరింత దృష్టిపెట్టి ఉంటే డెఫినెట్‌గా నిశ్భబ్దం నెక్ట్స్ లెవెల్ థ్రిల్లర్ అయి ఉండేది.

  అనుష్క శెట్టి ఫెర్ఫార్మెన్స్

  అనుష్క శెట్టి ఫెర్ఫార్మెన్స్

  నిశ్శబ్దం సినిమాకు ముఖ్యంగా బలం అనుష్కశెట్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మిగితా పాత్రలు కూడా అంతే మొత్తంలో స్ట్రాంగ్‌గా కనిపిస్తాయి. ఇక అనుష్క శెట్టికి సాక్షి పాత్ర ఛాలెంజింగే. ఆ పాత్రను తన పరిధిలోకి తెచ్చుకొని సాక్షిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఆకట్టుకొన్నారు. కీలక సన్నివేశాల్లో అనుష్క శెట్టి నటన హైలైట్‌గా ఉంటుంది. క్లిష్టమైన పాత్రను చాలా సులభంగా, సున్నితంగా పోషించారేంటీ అనే ఫీలింగ్ కలుగక మానదు.

  అంజలి, షాలిని పాత్రలు తీరు

  అంజలి, షాలిని పాత్రలు తీరు

  ఇక నిశ్శబ్దం చిత్రలో అనుష్క తర్వాత అంజలి ఫుల్‌లెంగ్త్ పాత్రతోపాటు అత్యంత ప్రాధాన్యం ఉన్న మహాలక్ష్మి పాత్రలో మెప్పించారు. కథకు వెన్నుముక లాంటి రోల్ అంజలిది. చాలా రోజుల తర్వాత మళ్లీ నటనపరంగా 100 మార్కులు సంపాదించుకొన్నారు. మహాలక్ష్మి పాత్రను మలచడంలో రచయితలు తెలుగు సినిమా ప్రమాణాలను దాటి వెళ్లలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అంజలి పాత్ర విషయంలో రచయితలు క్రియేటివ్ లిబర్టీని ఎక్కువగానే వాడుకొన్నారనే విషయం స్పష్టమవుతుంది. సొనాలి పాత్రలో షాలిని పాండే ఓకే అనిపించారు. ఈ పాత్ర చుట్టే సినిమా తిరిగినప్పటికీ.. సొనాలి పాత్ర అంత గొప్పగా అనిపించదు.

  ఆర్ మాధవన్, మైఖేల్ మ్యాడ్సన్ యాక్టింగ్

  ఆర్ మాధవన్, మైఖేల్ మ్యాడ్సన్ యాక్టింగ్

  ఆర్ మాధవన్ చాలా కాలం తర్వాత మళ్లీ మంచి పాత్రతో మెప్పించాడు. పలు రకాల వేరియేషన్ ఉన్న ఆంథోని పాత్రలో ఒదిగిపోయాడు. కాకపోతే ఆ రోల్‌కు ఇచ్చిన ముగింపు విషయంలో జస్టిఫికేషన్ సరిగా లేదనే అసంతృప్తి కలుగుతుంది. ఇక కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ్సన్‌ పాత్ర ఓకేలా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించే మ్యాడ్సన్ పాత్రలో ఓ ట్విస్ట్ ప్రేక్షకులు కొంచెం థ్రిల్‌కు గురిచేస్తుంది. సుబ్బరాజు పాత్ర కూడా ప్రాధాన్యమైనదే. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా మంచి మార్కులే కొట్టేశాడని చెప్పవచ్చు. ఇక ఫుల్ మూన్ రావు అలియాస్ పూర్ణచందర్ రావు పాత్రలో అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రే. పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు.

  టెక్నికల్ విషయాలకు గురించి

  టెక్నికల్ విషయాలకు గురించి

  టెక్నికల్ విషయాలకు వస్తే.. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ బాగుంది. మధురం పాట ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. గిరిష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలెట్‌ అని చెప్పవచ్చు. ఇక షానిల్ డియో సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. దర్శకుడు హేమంత్‌తో కలిసి కోన వెంకట్ రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల పేలాయి. డైలాగ్ పార్ట్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడంతో అవసరమైనంత మేరకు మేనేజ్ చేశారు. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ కూడా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది.

  దర్శకుడు హేమంత్ ప్రతిభ

  దర్శకుడు హేమంత్ ప్రతిభ

  దర్శకుడు హేమంత్ కథను డీల్ చేసిన విధానం బాగుంది. పాపులర్ యాక్టర్స్‌తో కూడిన పాత్రలను బ్లెండ్ చేయడంలోను, కథను నడిపించిన విధానం కూడా ఆకట్టుకొన్నది. చివరి సన్నివేశం వరకు ట్విస్టులను కొనసాగించిన తీరు, ఆర్టిస్టులతో పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం కూడా బాగుంది. కథ, కథనాలకు సంబంధించిన లాజిక్స్ విషయం మరింత శ్రద్ద పెట్టాల్సి ఉండేదనిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ బ్యానర్లపై వివేక్ కూచిబొట్ల, విశ్వ ప్రసాద్, కోన వెంకట్ అనుసరించిన నిర్మాణ విలువు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటులు ఎంపిక సినిమాపై వారి అభిరుచికి అద్దంపట్టిందని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్‌లో నిశ్శబ్దం చిత్రం విభిన్నమైనది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో రొటీన్‌గా అనిపించినప్పటికీ.. నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్లోని ఆ అసంతృప్తిని తొలగిస్తుంది. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ, నిర్మాణ విలువలు నిశ్శబ్దం థ్రిలర్ సినిమాల్లో క్లాసిక్‌గా మార్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే తప్పకుండా నచ్చుతుంది. ఓవరాల్‌గా నిశ్శబ్దం థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ.. పరిస్థితుల కారణంగా ఇంట్లోనే చూడాల్సి రావడం కొంత అసంతృప్తే.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

  టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్

  ఊహించదగిన కథ

  స్లో నేరేషన్

  లాజిక్స్ లేకుండా ఉండటం

  Anushka Shetty's Nishabdham To Release On Amazon Prime Video
  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: అనుష్క శెట్టి, ఆర్ మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినిపాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్

  దర్శకత్వం: హేమంత్ మధుకర్

  నిర్మాతలు: వివేక్ కూచిబొట్ల, విశ్వ ప్రసాద్, కోన వెంకట్

  సంగీతం: గోపి సుందరం

  ఎడిటింగ్: ప్రవీణ్ పుడి

  సినిమాటోగ్రఫి: షానిల్ డియో

  బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్

  ఒటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

  రిలీజ్‌: 2020-10-02

  English summary
  Anushka Shetty's Nishabdham set to release in Amazon Prime Video on October 2. Amazon prime confirmed that Your silence will protect you. #NishabdhamOnPrime, premieres October 2 in Telugu and Tamil, with dub in Malayalam!. In this occassion, Telugu filmibeat brings Nishabdham movie review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X