twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బురపరిచే 'అపరిచితుడు'

    By Staff
    |

    Aparichitudu
    సినిమా: అపరిచితుడు
    నటీనటులు: విక్రం, సదా, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌,
    నెడుముడి వేణు, కళాభవన్‌ రవి, యనాగుప్తా తదితరులు
    సంగీతం: హారిస్‌ జయ్‌రాజ్‌
    నిర్మాత: ఆస్కార్‌ రవిచంద్రన్‌
    కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శంకర్‌

    నిడివి పెద్దదైనా ప్రేక్షకుడిని కుర్చీకి కట్టిపడేసే సినిమా 'అపరిచితుడు'. విక్రం నటన, శంకర్‌ దర్శకత్వ ప్రతిభ సినిమాలోని అతి ముఖ్యమైన పాయింట్లు. అద్భుత ఊహాశక్తి, చక్కటి చిత్రీకరణ సినిమాను దృశ్యకావ్యంగా మలిచాయి. అధివాస్తవ కథ, విస్తరించిన కాన్వాస్‌లతో ఇది మాస్టర్‌ పీస్‌గా రూపొందింది.

    ఈ సినిమాలో విక్రం బ్రాహ్మణ న్యాయవాది. దైవభక్తి, పాపభీతి ఉంటాయి. సదుద్దేశాలు ఉన్న వ్యక్తి అయినా లాయర్‌గా అంతగా రాణించలేకపోతుంటాడు. న్యాయం నాలుగు పాదాలా నడవాలని కోరుకుంటాడు. ఒక్క వ్యక్తి వల్ల సమాజం మారదని తండ్రి చెబుతుంటాడు. పక్కింటమ్మాయి సదాను ప్రేమిస్తాడు. ఛాందసపు గెటప్‌లో ఉన్న విక్రం ఆమెకు నచ్చడు. సత్యం ధర్మం అంటూ తిరిగే విక్రం ఈ వ్యవస్ధకు పట్టని వ్యక్తిగా మిగిలిపోతాడు. అతనొక ఫెయిల్యూర్‌ స్టోరీ.

    విసిగిపోయిన విక్రం పురాణగాధల నుంచి ప్రేరణ పొంది 'అపరిచితుడు'గా అవతారమెత్తి హింస ద్వారా సత్వర న్యాయం ప్రసాదిస్తూ ఉంటాడు. అధర్మం, అన్యాయం, మోసం ఉన్న చోటల్లా అపరిచితుడు ప్రత్యక్షమవుతాడు. ఒకరకంగా కమల్‌ 'భారతీయుడు' పాత్ర ఇది. సడన్‌గా రెమో అనే మోడల్‌ రంగంలోకి వస్తాడు. అతని సెక్స్‌ అప్పీలుకు ఆధునిక యువతులంతా దాసోహమంటారు. సదా కూడా అతని ప్రేమకోసం పరితపిస్తుంటుంది. రెమో ఎవరో కాదు విక్రమే.

    విక్రం చేసే హత్యలు పోలీసు అధికారి ప్రకాష్‌రాజ్‌కు మిస్టరీగా ఉంటాయి. అపరిచితుడుగా, రెమోగా విక్రం నటన అద్భుతం. రెండు విభిన్న పాత్రలను అతను ఈజ్‌తో పోషించాడు. హారిస్‌ జయరాజ్‌ సంగీతం వీనులవిందుగా సన్నివేశాలకు సపోర్టింగ్‌గా ఉంది. సెట్స్‌, మేకప్స్‌, స్పెషల్‌ ఎఫెక్టుల సినిమాను సూపర్‌ రిచ్‌గా మలిచాయి. త్యాగరాజ ఉత్సవాన్ని రీ క్రియేట్‌ చేయడం హైలైట్‌. మణికందన్‌ కెమెరా పనితనం కంటికి ఇంపుగా ఉంది. దర్శకుడు శంకర్‌ ప్రతిభ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సందేశం ఉన్న సినిమాను ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఒక ప్రవాహంలా నడిపించాడు. సినిమా నిడి వి పెద్దదైనా ఎక్కడా బోర్‌ అనిపించదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X