For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ATM web series review స్లోగా సాగే ఫీల్‌గుడ్ క్రైమ్ థ్రిల్లర్.. వీజే సన్నీ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.75/5

  నటీనటులు: వీజే సన్నీ, దివి వద్యా, పృథ్వీరాజ్, దివ్య వాణి, దయానంద్ రెడ్డి, సుబ్బరాజు తదితరులు
  నిర్మాత: దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, హన్షిత
  దర్శకత్వం: సీ చంద్రమోహన్
  రచన: దర్శకుడు హరీశంకర్
  సమర్పణ: కౌశిక్ గంగూలీ
  మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
  సినిమాటోగ్రఫి: మోనిక్ కుమార్ జీ
  ఎడిటర్: అశ్వీన్ ఎస్
  ఓటీటీ రిలీజ్: Zee5
  ఓటీటీ రిలీజ్ డేట్: 2023-01-20

  మురికి వాడలో పుట్టి పెరిగిన జగన్ (వీజే సన్నీ) విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కలలు కంటుంటాడు. పేదరికంతో విసిగిపోయిన జగన్ అడ్డదారులు తొక్కైనా డబ్బు, బంగ్లా, కారు సంపాదించాలనుకొంటాడు. తన స్నేహితులు హర్ష (రోయిల్ శ్రీ), కార్తీక్ (కృష్ణ బురుగుల), అభయ్ (రవి రాజ్)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఓ దశలో కారును కొట్టేసి 25 వేలకు అమ్మి జల్సా చేయాలనుకొంటారు. అయితే ఆ కారులో 10 కోట్ల విలువైన వజ్రాలున్నాయని, వాటిని 10 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే అంతుచూస్తానని కారు యజమాని వార్నింగ్ ఇస్తాడు. 10 రోజుల్లో 10 కోట్లు ఇవ్వడం అసాధ్యంగా మారడంతో ఏటీఎంలకు డబ్బు సప్లై చేసే వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్ చేస్తారు.

  కారు యజమానికి 10 రోజుల్లో 10 కోట్లు జగన్ గ్యాంగ్ ఇచ్చారా? ఏటీఎం వ్యాన్ దొంగతనం చేయడంలో సక్సెస్ అయ్యారా? ఏటీఎం వ్యాన్ చోరీ కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ హెగ్డే (సుబ్బరాజు) కు ఎలాంటి చిక్కు ముడులు ఎదురయ్యాయి? ఎమ్మెల్యే కావాలనుకొన్న బస్తీ కార్పోరేటర్ గజేంద్ర (30 ఇయర్ ఫృథ్వీ) కల సాకారమైందా? జగన్ గ్యాంగ్‌ను గజేంద్ర ఎందుకు వార్నింగ్ ఇస్తుంటాడు? ఏటీఏం వ్యాన్ చోరి కథలో ఎలాంటి ట్విస్టులు హెగ్డేకు ఎదురయ్యాయి? ఇంతకు ఏటీఎం వ్యాన్ చోరీ చేసింది ఎవరు? జగన్ జీవితం చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే ఏటీఎం వెబ్ సిరీస్ కథ.

  ATM web series OTT review and rating: VJ Sunny impressive perfromance crime thriller

  లారీ డ్రైవర్ ఓనర్‌ కొడుకుగా జగన్ క్యారెక్టరైజేన్, మురికివాడలో ఉండే యువకుల జీవితం లాంటి సన్నివేశాలతో కథ కొంత సాగదీసినట్టు కనిపిస్తుంది. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత ఎక్కువ సమయమే తీసుకొన్నట్టు కనిపిస్తుంది. మూడు నాలుగు ఎపిసోడ్స్ దాటితే గానీ.. అసలు కిక్కు కనిపించదు. మూడు ఎపిసోడ్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. ఏటీఎం వ్యాన్ చోరీ దర్యాప్తు విషయంలో హెగ్డే రంగంలోకి దిగిన తర్వాత కథ, కథనాలు ఊపందుకొంటాయి. చివరి ఎపిసోడ్‌ వరకు కథను ఆసక్తికరంగా నడిపించి ట్విస్టును రివీల్ చేయడంలో దర్శకుడు చంద్రమోహన్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

  స్లమ్ బాయ్‌గా వీజే సన్నీ లుక్, మేకోవర్ స్టోరికి యాప్ట్ అయ్యేలా ఉండటంతో ఆ క్యారెక్టర్‌కు కనెక్ట్ కావడానికి ఈజీ అయిందనిపిస్తుంది. నటనపరంగా కొత్తవాడైనా వీజే సన్నీ చూపించిన ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్, టపోరి లాంగ్వేజ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. కథను పూర్తిగా వీజే సన్నీ తన భుజాల మీద మోసి మెప్పించాడని చెప్పవచ్చు. ఏసీపీ హెగ్డేగా సుబ్బరాజు మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. పృథ్వీ, దయానంద్ రెడ్డి పాత్రలు పర్వలేదనిపిస్తాయి. దివివద్యా, ఇతర పాత్రలు ఒకే అనిపిస్తాయి.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మోనిక్ కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. హైదరాబాద్‌లోని పలు ప్రదేశాలను బాగా చిత్రీకరించడమే కాకుండా కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. లైటింగ్, కలర్ ప్యాలెట్ డిఫరెంట్‌గానే కాకుండా చూడాలనిపించే విధంగా ఉంది. ప్రశాంత్ విహారీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెబ్ సిరీస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటర్‌కు చాలా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. దిల్ రాజు పర్యవేక్షణలో హర్షిత్ రెడ్డి, హన్షిత పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  మనీ రాబరీకి కథకు క్రైమ్, ఎమోషన్స్ కలిపి రూపొందించిన థ్రిల్లర్ ఏటీఎం. పాత్రల క్యారెక్టరైజన్ కొత్తగా ఉంటాయి. నేటితరం ప్రేక్షకులకు నచ్చే విధంగా, వెబ్ సీరీస్‌లో స్వేచ్ఛగా రాసుకొనే బూతు డైలాగ్స్‌తో సరదాగా సాగిపోతుంది. తొలి మూడు, నాలుగు ఎపిసోడ్స్ చాలా కష్టంగా గడిచిపోతాయి. ఐదో ఎపిసోడ్ నుంచి కథ సాగే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. వెబ్ సిరీస్‌ను తొమ్మిది ఎపిసోడ్స్‌కు బదులుగా కంటెంట్ తగ్గించి.. ఏడు, ఏనిమిది ఎపిసోడ్స్‌కు పరిమితం చేసి ఉండే ఏటీఎం మరింత క్రిస్పీగా ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్నది కాబట్టి.. తీరిక వేళల్లో సరదాగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ అంచనా వేసి చూస్తే కొంత నిరాశ ఉంటుంది. ఈ మధ్య వచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లను చూస్తే.. ఏటీఎం మంచి అటెంప్ట్. ఈ వెబ్ సిరీస్ ఓ సారి చూడొచ్చు. లెట్స్ టై ఇట్ ఫర్ డిఫరెంట్ ఫీల్ అండ్ ఎమోషన్.

  English summary
  Bigg Boss Telugu Winner VJ Sunny's maiden Web Series ATM which Written by Hari Shankar. Produced by Dil Raju and Harshith Reddy and Hanshita. This Web series is streaming on Zee5
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X