twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాదు...త్రీ (‘అవును 2′ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    తొలినుంచి మనకు సీక్వెల్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ అవటం లేదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్, బిజినెస్ పర్పస్ లో సీక్వెల్ కోసం కథలేకపోయినా సాగతీసే కథనం చాలా సార్లు కారణమవుతూంటాయి. ఇప్పుడు అవును 2 కి అదే పరిస్ధితి ఏర్పడింది. దెయ్యమా సాప్టవేర్ ఇంజినీరా అని డౌట్ వచ్చేలా జరిగే ఈ చిత్రం ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. హర్రర్ సినిమా కదా అని భయపడదాం అని ప్రిపేరై వెళ్లినవాళ్ళు...ఇలాంటి సినిమాకు వచ్చేమేంటిరా అని భయపడేలా రవిబాబు తీసారు.

    దానికి తోడు ఈ హర్రర్ జానర్ చిత్రాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎక్కువగా హాలీవుడ్ పై ఆధారపడుతూంటారు. కాబట్టి అక్కడ నుంచి కథ,కానీ సీన్స్ కాని ఎత్తుకొస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ విషయం మర్చిపోయాడో ఏమో కానీ రవిబాబు...Paranormal Activity, The Entity , The Haunted చిత్రాలు కలిపి వండేసారు. అవన్నీ హర్రర్ అభిమానులు ఒకటికి నాలుగుసార్లు చూసేవే..కాబట్టి...మరోసారి వాటినే చూద్దామనిపిస్తుంది ఈ సినిమా చూసి బయిటకు వచ్చాక. ఇవన్నీ ప్రక్కన పెడితే హీరోయిన్ పూర్ణ అభిమానులకు ఇది...ఆమె సినిమా..ఆమె భుజాలపై మోసిన సినిమా గా చూడవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు మొదటే చెప్పినట్లు ‘అవును 2′ కథ సరిగ్గా ‘అవును′ సినిమా చివరి షాట్ దగ్గరనుండి మొదలవుతుంది(దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనుకోండి). ఒక్కసారి ‘అవును' చిత్రం గుర్తు చేసుకుంటే...ఆ మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది.

    Avunu 2 Movie Review: Another Substandard Sequel

    సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.

    వినటానికి ఈ కథ బాగనే ఉందనిపించినా ఫైనల్ గా ఈ చిత్రం తను ఏం చేయాలో క్లారిటీ లేని దెయ్యం లేదా ప్రేతాత్మ కథ గా తయారైంది. ముఖ్యంగా దెయ్యం (కెప్టెన్ రాజు) కు ఎంతసేపూ టెక్నాలిజీ మీదే దృష్టే కానీ...మొదటి పార్ట్ లలోగా మోహని పై ఉన్నట్లు కనిపించదు. అలాగే అసలు ఏం జరుగుతోందా అని డౌట్ వచ్చేలా... శరీరమే లేకుండా..మోహన్ ని మానబంగం చేయటానికి ప్రయత్నించటం, ఇంకొసారి..వేరే వారి శరీరంలో ప్రవేసించటం వంటివి ఆ దెయ్యం చేస్తూంటుంది. అంతేకానీ ఇలా చేద్దాం..అని ఆదెయ్యానికి ఎక్కడా క్లారిటీ ఉన్నట్లు కనపడదు.

    అలాగని మీరీ ప్లస్ పాయింట్లు లేవు అని కాదు... అవునులో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ద్వారా భయపెట్టినట్టే, ఇక్కడ ఆటోమేటిక్ మస్కిటో స్ప్రే ద్వారా భయపెట్టే ప్రయత్నం బాగుంది. అలాగే తొలిభాగం చూడనివారికి కూడా ఇది సంపూర్తిగా అర్దమయ్యేలా దర్శకుడు డిజైన్ చేయటం కూడా మంచి ఎలిమెంటే. అంతేకాకుండా హీరోయిన్ పూర్ణ ..ఈ సినిమాకు పెద్ద హైలెట్. ఆమె లేకపోతే ఈ సినిమాని చివరి వరకూ చూడటమే కష్టం. హర్షవర్దన్ రాణే కూడా బాగా చేసాడు. రవివర్మ పాత్ర క్లైమాక్స్ లో మాత్రమే ఏక్టివ్ అయ్యింది.

    Avunu 2 Movie Review: Another Substandard Sequel

    ఇక ... ఈ సినిమాలో ప్రధానలోపం..ఈ చిత్రం అటు హర్రర్ లేదా థ్రిల్లర్ రెండు జానర్ లకు చెందని విధంగా ఉండటం. చాలా ప్రెడిక్టుబుల్ గా అంటే ఊహకు అందే విధంగా కథ ఉండటం. అలాగే ఎక్కడా భయపడని విధంగా హర్రర్ సీన్లు రావటం.

    టెక్నికల్‌గా చెప్పాలంటే...రెగ్యులర్ రవిబాబు సినిమాల్లో లాగానే...కెమెరా వర్క్ ముఖ్యంగా లైటింగ్, ఫ్రేమింగ్, మూడ్ క్రియేట్ చేయటం ఈ సినిమాలోనూ బాగుంది. ఈ సినిమాలో లైటింగ్ సిస్టమ్ పనితనాన్ని కొత్తగా ఆస్వాదిస్తారు. పూర్తి ఎల్‌ఈడీ లైట్లతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కేబుల్ అనేదే లేకుండా సినిమాకి లైటింగ్ సమకూర్చారు. లిమెటెడ్ బడ్జెట్ లో చేసినా విజువల్ ఎఫెక్టులు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త నిదానంగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదో హడావిడి చేసిన ఫీలింగ్ కొన్ని సన్నివేశాల్లో వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైలాగులు ఓకే. దర్శకుడుగా రవిబాబు..మొదటి పార్ట్ లో మ్యాజిక్ ఇందులో చూపలేకపోయారు.

    బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్
    నటీనటులు: హర్షవర్థన్ రానె, పూర్ణ , నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు
    స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌,
    కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి,
    సంగీతం: శేఖర్‌చంద్ర,
    ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌,
    ఆర్ట్‌: భూపేష్ ఆర్‌.భూపతి,
    రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.
    విడుదల తేదీ: ఏప్రియల్ 3,2015.

    ఫైనల్ గా... మొదటి పార్ట్ చూడనివారికి ఈ చిత్రం కొత్తగా అనిపించి బాగుందనిపించవచ్చు. అలాగే అదే పనిగా హర్రర్ సినిమాలు చూస్తూ భయపడుతూ ఎంజాయ్ చేసే వారకి ఈ సినిమా అంత కిక్ ఇవ్వకపోవచ్చు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    After scoring few disasters, Ravi Babu is trying his luck by coming up with a sequel of his previous super hit film, Avunu. Avunu 2 has hit the screens today. But did it repeat the magic? Read the review to know.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X