»   » అజారుద్దీన్ ఫ్యాన్స్ కూడా భరించలేరు! (‘అజర్’ రివ్యూ)

అజారుద్దీన్ ఫ్యాన్స్ కూడా భరించలేరు! (‘అజర్’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చుట్టూ ఎన్ని విజయాలున్నాయో.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపం లో అన్ని వివాదాలూ ఉన్నాయి. అజర్‌ 99 టెస్టుల్లో 6215, 334 వన్డేల్లో 9378 పరుగులు సాధించిన ఈ హైదరాబాదీ క్రికెటర్ 2000 సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా అజర్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఏళ్ల తరబడి జరిగిన విచారణ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2012లో ఆ నిషేధాన్ని కొట్టివేసింది.

అజరుద్దీన్ మీద కోర్టు నిషేదం ఎత్తి వేసినా....క్రికెట్ అభిమానుల్లో అసలు తెర వెనక ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలనే కుతూహలం అలానే ఉండి పోయింది. అందుకు సంబంధించిన విషయాలను సినిమా రూపంలో చూపించే ప్రయత్నమే 'అజర్‌' సినిమా. అజారుద్దీన్ క్రికెట్ జీవితం, పెళ్లి, సంగీతతో ప్రేమ వ్యవహారం, మ్యాచ్ ఫిక్సింగ్ అంశాలను ఫోకస్ చేస్తూ తెురకెక్కిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.

Azhar Movie Review

వాస్తవ కథ కాదా?
అయితే సినిమా ప్రారంభంలోనే ఓ ప్రకటన వేసారు. ఇది వాస్తవ కథ కాదు.... కల్పిత పాత్రలతో సినిమాను తీసాం. ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించి కాదు. ఏ వ్యక్తిని దోషి అని గానీ నిర్దోషి అనిగానీ ఇందులో చెప్పే ప్రయత్నం చేయలేదు. కొన్ని వాస్తవ సంఘటనలకు సినిమాటిక్ డ్రామా జోడించి సినిమా మాత్రమే అని వేసారు. అందుకే ఈ సినిమాను మీరు అజారుద్దీన్ నిజ జీవితం అనుకుంటారో? లేదా ఇంకేదో అనుకుంటారో మీ ఇష్ఠం!

కథ విషయానికొస్తే...
1963లో హైదరాబాద్ లో మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహ్మద్ అజారుద్దీన్(ఇమ్రాన్ హస్మి) తన నానాజాన్(కులభూషణ్ కర్భంద) ప్రోత్సాహంతో క్రికెటర్ గా ఎదుగుతాడు. అనతికాలంలో సక్సెస్ ఫుల్ కేప్టెన్ గా ఎదుగుతాడు. డబ్బు, హోదా, సమాజంలో గౌరవం. అంతా బాగా జరిగిపోతుందనుకుంటున్న సమయంలో అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తాయి.

1996లో సౌత్ తాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో, 1998లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో, 1999లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫిక్సింగుకు పాల్పడ్డట్లు ఓ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్లో బయట పడుతుంది. ఈ స్టింగ్ ఆపరేషన్లో బుకీలు తాము అజర్ కు డబ్బులు ఇచ్చినట్లు చెబుతారు. సీబీఐ విచారణ అనంతరం అతనిపై జీవితకాల నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకుంటుంది బిసిసిఐ.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల అనంతరం అజర్ పరిస్థితి తలక్రిందులైవుతుంది. ఒకప్పుడు తనంటే గౌరవించిన వారే చీకొట్టడం మొదలు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో అజర్ ఏం చేసాడు? అజర్ బుకీల దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు డబ్బులు తీసుకున్నాడా? లేదా? అజర్ జీవితంలోకి సంగీత ఎలా వచ్చింది? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్...
అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హస్మి బాగా నటించాడు. అజారుద్దీన్ మాదిరిగా ఆటిట్యూడ్, బ్యాటింగ్ శైలి ఓవరాల్ గా అజారుద్దీన్ ను గుర్తు చేసేలా నటించేందుకు ఇమ్రాన్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. అజారుద్దీన్ భార్య నౌరీన్ పాత్రలో ప్రాచీ దేశాయ్ డీసెంట్ గా నటించింది. ఆమె పాత్రకు నిడివి కూడా చిన్నదే కావడంతో ఎక్కువగా నటించే అవకాశం కూడా లేదనే చెప్పాలి. ప్రియురాలు సంగీత పాత్రలో నర్గీస్ ఫక్రి పెద్దగా ఆకట్టుకోలేదు. గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆమెకు మైనస్ మార్కులే. ఇక అజారుద్దీన్ కు వ్యతిరేకంగా వాదించే లాయర్ మీరా పాత్రలో లారా దత్తా పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. అజర్ లాయ్ రెడ్డి పాత్రలో కునాల్ రాయ్ కపూర్ ఓకే.

విశ్లేషణ...
సినిమా ప్రారంభంలోనే ఇది బయోపిక్ కాదని చెప్పిన దర్శకుడు టోనీ డిసౌనా డ్రామా కోణంలో కూడా పెద్దగా రక్తి కట్టించలేక పోయాడు. సాగదీసినట్లు ఉండే స్టోరీ, సీన్లు ప్రేక్షకులను మరింత అసహనానికి గురి చేస్తాయి. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేని, ఎడతెగని కోర్టు సీన్లు ప్రేక్షకుడికి ఎప్పుడు బయటికి వెళ్లి పోదామా అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. సినిమాలో ఒక్కటంటే ఒక్కటి ఆకట్టుకునే సీన్ లేదు. బయోపిక్ లాంటి సినిమా కాబట్టి ఎంటర్టెన్మెంటుకు అసలు చోటే లేదు. అలా అని ఏదైనా ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో లాగించారా? అంటే అదీ లేదు. క్రికెట్ ప్రధానంగా సాగే సినిమా కాబట్టి ఆ కోణంలో ఏవైనా మంచి సీన్లు రాసుకున్నా బావుండేదోమో? ఈ విషయంపై దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. ఓవరాల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో టోనీ డిసౌజా విఫలం అయ్యాడే చెప్పాలి.

ఫైనల్ గా...
అజర్ సినిమా అంటే ప్రేక్షకులు.... క్రికెట్ నేపథ్యాన్ని, లేదా అజారుద్దీన్ జీవిత నేపథ్యాన్ని ఇంట్రెస్టింగ్ చూపిస్తారనే ఆశతో వెళతారు. ఈ రెండు విషయాలను పర్ ఫెక్టుగా ప్రజెంట్ చేయడంలోదర్శకుడు విఫలం అయ్యాడు. అటు గేమ్ స్పిరిట్ గానీ, ఇటు పర్సనాలిటీ(అజారుద్దీన్) గురించిగానీ సంపూర్ణంగా కాప్చర్ చేయలేదు. ఈ సినిమాను అజారుద్దీన్ అభిమానులు కూడా భరించలేరు.

English summary
Azhar is a complete misfiled. It neither captures the spirit of the game nor the personality.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu