For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బీటెక్ బాబులు మూవీ రివ్యూ: సీరియల్ ఎక్కువ.. సినిమాకు తక్కువ

  By Rajababu
  |

  Rating:
  1.0/5

  'B.Tech Babulu' Movie Review By Filmibeat బీటెక్ బాబులు మూవీ రివ్యూ

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలు సెన్సేషనల్ విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో వస్తున్న చిత్రాలు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. పెళ్లిచూపులు, మెంటల్ మదిలో లాంటి ఫీల్‌గుడ్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బీటెక్ బాబులు అనే చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన నటీనటుల, దర్శకులు, ఇతర సాంకేతిక వర్గం చేసిన ప్రయత్నం ఇది. ఇందులో హీరో నందు, యాంకర్, హీరోయిన్ శ్రీముఖి అతిథి పాత్రలు పోషించారు. ఇలాంటి విశేషాలు ఉన్న బీటెక్ బాబు నవంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

  బీటెక్ బాబులు కథ

  ఇంజినీరింగ్ కాలేజీలో కాలేజీ నలుగురు యువకులు, ముగ్గురు అమ్మాయిల మధ్య చోటుచేసుకొన్న స్నేహం, ప్రేమ అంశాల మేలవింపే బీటెక్ బాబులు చిత్ర కథ. స్నేహంలో మధురానుభూతి, ప్రేమలో మనస్పర్థలు, కాలేజీ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను తెర రూపమే బీటెక్ బీటెక్ బాబులు చిత్రం.

  కథలో ప్రధానాంశాలు

  మూడు ప్రేమ జంటల మధ్య వచ్చిన విభేదాలు ఏంటీ? వారి ప్రేమకు అడ్డంకిగా మారిన అంశాలేమిటి? ఈ కథలో నందు, శ్రీముఖ కథేంటి? షకలక శంకర్, తాగుబోతు రమేశ్, ఆలీ కథకు ఎలా ఉపయోగపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బీటెక్ బాబులు.

  నూతన నటీనటులతో

  బీటెక్ బాబులు చిత్రంలో నావెల్ కిషోర్, వైజాగ్ శంకర్, శౌర్య, రోషిణి ప్రకాశ్, పూర్ణిమ తదితరులు నటించారు. తొలిభాగంలో షకలక శంకర్ శోభన గదిలో ప్రారంభవుతుంది. కాలేజీ లైఫ్‌లో జరిగిన సంఘటనల గురించి తన భార్యకు వివరించడం ద్వారా కథ ప్రారంభమవుతుంది. కాలేజీలో చిలిపి సంఘటనలు, ఫ్రెండ్ షిప్, అఫైర్లు, వ్యక్తిగత లక్ష్యాలు ఇలాంటి అంశాలు కనిపిస్తాయి.

  శ్రీముఖి, నందు ఎపిసోడ్

  ఈ కథలో ఏ అంశం కూడా కనీస సినిమా ప్రమాణాలకు కనుచూపు మేరలో కూడా కనిపించవు. అని విభాగాల పనితీరు కూడా నాసిరకంగా ఉంటాయి. టెలివిజన్ సీరియల్స్ కూడా అంతో ఇంతో స్టాండర్డ్స్ మెయింటెన్స్ చేస్తున్నాయి. కనీసం ఆ స్థాయిలో కూడా ప్రమాణాలు కనిపించవు. గుడ్డిలో మెల్ల అన్నట్టు సినిమాలో శ్రీముఖి, నందు ఎపిసోడ్ కాస్త ఊరట కలిగించే అంశం.

  ప్రేమికులుగా నందు, శ్రీముఖి

  దర్శకుడు అవ్వాలనే తపనతో బతుకుతున్న నందు, శ్రీముఖి ప్రేమించుకుంటారు. కెరీర్ ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రలివి. వీరిద్దరూ చాలా సహజంగా నటించారు. వారి మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి.

  ఫర్వాలేదనిపించిన నందు, శ్రీముఖి

  పెళ్ళిచూపులు త‌ర్వాత నందు చాలా మంచి పాత్రలో కనిపించాడు. అతని పాత్ర ప్ర‌తీ ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీ ముఖి మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నందు శ్రీముఖి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు దర్శకుడు చక్కగాతెరకెక్కించారు.

  కామెడీ తీరు

  షకలక శంకర్, ఆలీ, తాగుబోతు రమేశ్ కామెడీ ఏంటో, ఎందుకు వస్తారో అర్థం కాని పరిస్థితి. సీన్లు కథ మధ్యలో వచ్చి దూరినట్టు అనిపిస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం తీసినట్టుగా సన్నివేశాలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా కథలో గానీ, కథనంలో గానీ బలం లేని ఓ నాసిరకం సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

  శ్రీను ఇమంది డైరెక్షన్

  బీటెక్ బాబులు చిత్రానికి దర్శకుడు శ్రీను ఇమంది. సినిమా హ్యాపీడేస్ స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అంతా అతుకుల బొంతగానే కనిపిస్తుంది. సినిమా ఇక ముగుస్తుందేమో అనుకునే సమయంలో సడెన్ నందూ, శ్రీముఖి స్టోరి లాక్కొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా వందశాతం శ్రీను ఇమంది విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

  అజయ్ పట్నాయక్ సంగీతం

  అజయ్ పట్నాయక్ అందించిన సంగీతం అంతంతా మాత్రమే. సీను ఒకటి ఉంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది. పాటలు కూడా బాగాలేవు. మిగితా సాంకేతిక అంశాల్లో కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. కానీ సీన్లలో పసలేకపోవడంతో మరుగునపడిపోయాయి. ఎడిటింగ్ విభాగమైతే మరీ అధ్వాన్నం. సీన్లలో లెంగ్త్, అనవసరపు సీన్లు బాగానే ఉంచేసి సినిమా నిడివిని రామాయణం సీరియల్‌గా మార్చారు.

  నిర్మాతగా మధు వర్మ

  మధు వర్మ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కొత్తగా సినీ నిర్మాణం చేపట్టేటప్పుడు చిన్నచిత్రాల నిర్మాణం, కథ, కథనాల గురించి అధ్యయనం చేసి ఉంటే మంచి సినిమాలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలపైన నిర్మాత మధుకు అవగాహన లేనట్టు కనిపిస్తుంది.

  చివరిగా

  ఎలాంటి ఆకట్టుకోలేని అంశాలతో రూపొందిన సినిమా బీటెక్ బాబులు. చిన్న చిత్రాలపై గౌరవం పెరుగుతున్న నేపథ్యంలోఈ సినిమాను చూస్తే అలాంటి వాతావరణం కలుషితం చేసినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ట్రెండ్‌లో రావాల్సిన సినిమా కాదనిపిస్తుంది.

  తెర వెనుక.. తెర ముందు..

  నటీనటులు: శౌర్య, రోషిణి, అశ్విని, పూర్ణిమ, వైజాగ్ శంకర్, నావెల్ కిషోర్, శకలక శంకర్, తాగుబోతు రమేశ్, ఆలీ తదితరులు
  దర్శకుడు: శ్రీను ఈమంది
  మ్యూజిక్: అజయ్ పట్నాయక్
  నిర్మాత: మధు వర్మ

  English summary
  B.Tech Babulu is a Telugu movie starring Ashwini and Novel KIshore in prominent roles. The movie also stars Vizag Shankar and Shakalaka Shankar. It is a romantic comedy directed by Seenu Imandi with Ajay Patnayak as musician. This movie released on December 8th. Exclusive review for Telugu filmibeat movie goers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more