Baahubali: The Epic Review and Rating: బాహుబలి: ది ఎపిక్ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: కీరవాణి
రిలీజ్ డేట్: 2017-04-28
మహిష్మతి సామ్రాజ్యంలో రాజమాత శివగామి (రమ్యకృష్ణ) మాటే శాసనం. అధికారమంతా తన కళ్లలోనే కొనసాగుతుంది. అయితే తన సొంత కొడుకు భళ్లాలదేవ (రానా దగ్గుబాటి) పెంపుడు కొడుకు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)లో ఒకరిని తన సామ్రాజ్యానికి అధిపతి చేయాలని శివగామి నిర్ణయించుకొంటుంది. అయితే దేవసేన ఎంట్రీతో కుటుంబంలో కలహాలు పెరిగిపోతాయి. భర్త బిజ్జాలదేవ (నాజర్), భళ్లాలదేవ కలిసి కుట్ర చేసి అమరేంద్ర బాహుబలిని కట్టప్ప (సత్యరాజ్)తో చంపించాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో జరిగిన పరిణామాల మధ్య దేవసేనను బందీగా చేస్తారు. భళ్లాలదేవ, బిజ్లాల కుట్రలు తెలిసి మహేంద్ర బాహుబలి కుమారుడు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ను తీసుకొని రాజసౌధం నుంచి పారిపోతుంది.

రాజ్యాధికారం కట్టబెట్టడానికి శివగామి ఎలాంటి ప్లాన్స్ చేసింది? అమరేంద్ర బాహుబలికి రాజ్యాధికారం కట్టబెట్టాలని శివగామి నిర్ణయించిన తర్వాత మళ్లీ ఎందుకు మాట మార్చింది? అమరేంద్ర, దేవసేనపై దేశ బహిష్కరణ ఎందుకు చేపట్టారు? కట్టప్పతో అమరేంద్రను ఎలా చంపించాలని ప్రయత్నం చేశారు? మహేంద్ర బాహుబలిని తీసుకొని శివగామి ఎక్కడికి పారిపోయింది? అమరేంద్ర ఎక్కడ పెరిగాడు? మళ్లీ మహిష్మతి సామ్రాజ్యానికి తిరిగి వచ్చి తల్లి దేవసేనను ఎలా విడిపించాడు? తన చిన్నాన్న భళ్లాలదేవకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే బాహుబలి: ది ఎపిక్ సినిమాగా చూపించారు.
బాహుబలి సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం, ఆ మూవీ కథ ఎవరికి తెలియనిదేమీ కాదు. అయితే ఆ 2 పార్ట్స్‌ను కలిపి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మూవీగా సుమారుగా 3.45 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలోని ప్రధానమైన సన్నివేశాలను కూర్పు చేసిన విధానం చక్కగా ఉంది. దాదాపు ఐదున్నర గంటల కథను తగ్గించి సన్నివేశాలను పేర్చిన విధానం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభకు, విజన్‌కు అద్దం పట్టింది. స్టోరీ ఫ్లోను ఏ మాత్రం డిస్ట్రబ్ కాకుండా కథను పరుగులు పెట్టించాడు.
బాహుబలి ది ఎపిక్ సినిమాలో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తమ పాత్రలను అద్బుతంగా పోషించి ఇప్పటికే ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకొన్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా పాత్ర, ఆమె నటించిన సన్నివేశాలు చాలా వరకు కనుమరుగైపోయియాయి. సుదీప్ కిచ్చ సన్నివేశాలను పూర్తిగా లేపేశారు. నిడివిని బ్యాలెన్స్ చేయడానికి మూడు పాటలను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. వార్ సీక్వెన్స్‌ను చాలా వరకు ట్రిమ్ చేశారు. కానీ కథలో ఉండే ఆత్మను ఏమాత్రం కోల్పోకుండా సినిమాను ఫీల్ గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, యాక్షన్ మూమెంట్స్‌తో బ్యాలెన్స్ చేశారు. చూసిన ప్రేక్షకుడికి కూడా కొత్తగా చూస్తున్న ఫీలింగ్, మంచి అనుభూతిని పంచేలా కట్ చేశారు. అయితే 3.45 నిమిషాల నిడివిలో ఇంకాస్త అంటే 10 నుంచి 15 నిమిషాల నిడివిని తగ్గించి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ ఉండేదనిపిస్తుంది.
ఓవరాల్‌గా బాహుబలి ది ఎపిక్ లార్జర్ ద్యాన్ లైఫ్ స్టోరీ. పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న కంటెంట్ కావడంతో ప్రేక్షకుడు లీనమై పాత్రలను అనుసరిస్తూ లీనమైపోవడం గ్యారెంటి. గతంలో రెండు పార్టులు చూసిన వారికి, ఏదో ఒక్క పార్ట్ చూసిన గానీ.. ఏ మాత్రం తేడా ఉండకుండా.. ఈ చిత్రం మంచి ఫీల్‌ను అందిస్తుంది. ఈ వారం మిస్ కాకుండా తప్పకుండా మరోసారి ఎక్స్‌పీరియెన్స్ పొందండి.. మరోసారి బాహుబలి విజువల్ వండర్‌ను ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











