»   » ‘బాబు బంగారమే’ కానీ....(రివ్యూ, రేటింగ్)

‘బాబు బంగారమే’ కానీ....(రివ్యూ, రేటింగ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

హైదరాబాద్: వయసు పైబడుతుండటంతో స్టార్ హీరో రేంజి నుండి సీనియర్ హీరో లెవల్ కి పడిపోయిన విక్టరీ వెంకటేష్.... తన వయసుకు, ఇమేజ్ కు తగిన పాత్రలు, కథలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాడనే చెప్పక తప్పదు. ఆ మధ్య కొన్ని సినిమాలు దెబ్బ కొట్టడంతో.... కుర్రాడిలా కాకుండా... ఇటు మరీ వయసైపోయిన పాత్రలు కాకుండా మధ్య రకంగా ఉండే కథలను, పాత్రలను ఎంచుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకున్న దృశ్యం, గోపాల గోపాల సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ఈ సినిమాలు బావున్నప్పటికీ తమకు కావాల్సిన వెంకీ మసాలా ఆ సినిమాల్లో దొరకలేదనే అసంతృప్తి మాత్రం అభిమానుల్లో ఉండిపోయింది. దాన్ని బర్తీ చేయడానికే అన్నట్లు వెంకటేష్ తాజాగా 'బాబు బంంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.


తనకు లక్ష్మి, తులసి చిత్రాల్లో పర్ ఫెక్ట్ జోడీగా కుదిరిన నయనతాను హీరోయిన్ గా, ఈ తరం యువత మెచ్చేలా వినోదాత్మక సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి దర్శకత్వంలో ఈ సినిమా చేసారు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్లో బొబ్బిలిరాజా ఈజ్ బ్యాక్ అనే రేంజిలో సినిమా ఉంటుందని ప్రచారం చేసారు. సినిమా ఆ రేంజిలో ఉందా? అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనేది రివ్యూలో చూద్దాం...


కథలోకి వెళితే...
ఏసిపి కృష్ణ( వెంకటేష్) క్రైం బ్రాంచి ఏసీపీ. చాలా సున్నిత మనస్తత్వంగల జాలి పోలీస్. ఉద్యోగ ధర్మంలో భాగంగా క్రిమినల్స్ ను కొట్టడం, తర్వాత జాలితో తానే స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించడం, వారు త్వరగా కోలుకోవాలని పూజలు చేయించే రకం.


శైలు(నయనతార) ఓ మెస్ నడుపుతూ తన ముగ్గురు చెల్లెల్లను పోషిస్తూ చాలా కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆమె మంచి మనసు, అందం చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిన కృష్ణ ఎలాగైనా ఆమె సహాయం చేయాలనుకుంటాడు. ఆమెకు దగ్గరవ్వడానికి శైలు బావ బత్తాయికాల బాబ్జీ(పృథ్వి)ని వాడుకుంటాడు. శైలు కుటుబానికి సహాయం చేస్తూ ఆమెకు దగ్గరవ్వడంతో పాటు తన మసులో ఉన్న ప్రేమ విషయం చెబతాడు. కృష్ణ మంచి తనం చూసి శైలు కూడా అతన్ని ప్రేమిస్తుంది.


మిగతా స్టోరీ, సినిమా విశ్లేషణ స్లైడ్ షోలో...


కట్ చేస్తే....

కట్ చేస్తే....

ఇన్ కం టాక్స్ ఆఫీసరైన శైలు తండ్రి (వి. జయప్రకాష్) తన సహోద్యోగిని హత్య చేసిన కేసులో పరారీలో ఉంటాడు. అతని కోసం ఇటు పోలీసులతో పాటు ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని), మేయర్ కావాలని ఆశ పడుతున్న రౌడీ షీటర్(సంపత్ రాజ్) వెతుకుతుంటారు.


వెంకీ ఏం చేసాడు?

వెంకీ ఏం చేసాడు?

కృష్ణ తనకు దగ్గరవ్వడం వెనక పోలీస్ సీక్రెట్ ఆపరేషన్ ఉందని, హత్య కేసులో పరారీలో ఉన్న తన తండ్రిని అరెస్టు చేయడానికే కృష్ణ తనను ప్రేమించినట్లు నటించి మోసం చేసాడని అతన్ని చీదరించుకుంటుంది శైలు. మరి శైలును నిజంగానే ప్రేమించిన కృష్ణ మళ్లీ ఆమెకు ఎలా దగ్గరయ్యాడు? కృష్ణ ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలేమిటి? అనేవి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

వెంకటేష్ పెర్ఫార్మెన్స్, నయనతార అందం ఈ సినిమా హైలెట్. పోలీసాఫీర్ పాత్రలో వెంకీ లుక్స్ సూపర్బ్. నయనతార తన అందంతో పాటు, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఓ వైపు కామెడీ పండిస్తూనే తనదైన స్టైల్ లో సీరియస్ గా సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అవ్వడం ఆకట్టుకుంటుంది.


కామెడీ, విలనిజం

కామెడీ, విలనిజం

కామెడీ విషయానికొస్తే ఫస్టాఫ్ లో బత్తాయికాల బాబ్జీ పాత్రలో పృథ్వి మరోసారి తనదైన మేనరిజంతో అదరగొట్టాడు. వెంన్నెల కిషోర్ ఓకే. సెకండాఫ్ లో బ్రహ్మానందం కాసేపు ఎంట్రీ ఇచ్చినా పెద్దగా నవ్వులు పండలేదు. కామెడీ విలన్ పాత్రలో పోసాని కృష్ణ మురళి మరోసారి తనదైన మార్క్ చూపించారు. రౌడీ షీటర్ గా సంపత్ రాజ్, ఫిష్ వెంకట్ తదితరులు ఫర్వాలేద.


కథ, స్క్రీన్ ప్లే విషయానికొస్తే...

కథ, స్క్రీన్ ప్లే విషయానికొస్తే...

ఈ సినిమాకు పెద్ద మైనస్ కథే. నాగార్జున నిర్ణయం సినిమా కథలోనే కొన్ని మార్పులు చేసారంతే. కొత్తదనం లేక రొటీన్ గా ఉండటంతో పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా పోయింది. కనీసం స్క్రీన్ ప్లే తో అయినా దర్శకుడు ప్రేక్షకుడిలో సినిమాపై ఆసక్తి పెంచాడా అంటే అదీ లేదు. ఫస్టాఫ్ వెంకీ స్టైల్ లో నాలుగు కామెడీ సీన్లు, ఫారిన్ లొకేషన్లలో పాటలతో నింపేసాడు కాబట్టి ప్రేక్షకులు కాస్త ఎంజాయ్ చేసారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి సాగదీసినట్లు ఉండే కథనం, బోరింగ్ సీన్లతో ప్రక్షకుల మూడ్ చేంజ్ అయింది. సినిమా ఇంకా ఎప్పుడు అయిపోతుందనే ఫిలింగ్ కలిగించారు. దర్శకత్వం విషయాన్ని తప్పుబట్టలేం కానీ...కథ, స్క్రీన్ ప్లే విషయంలో మారుతి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేక పోయాడు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే..

టెక్నికల్ అంశాల విషయానికొస్తే..

రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ చేసిన తీరు ప్రేక్షకుల్లో మంచి ఫీల్ కలిగించింది. జిబ్రాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. ఎడిటింగ్ చేసిన ఉద్ధవ్ ఎస్.బి సినిమాలో కొన్ని అనవసర సీన్లు తొలగిస్తే బావుండేది.


చివరగా...

చివరగా...

సినిమాలో ఆసక్తికర అంశాలే ఏమీ లేవు. కేవలం టైమ్ పాస్ కోసం అయితే ఓకే. అది కూడా ఫస్టాఫ్ వరకు మాత్రమే. ట్రైలర్ చూసి సినిమా బొబ్బిలి రాజా రేంజిలో ఉంటుందని ఊహించుకుని వెళితే నిరాశ తప్పదు.


బాబు బంగారం

బాబు బంగారం

బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)
న‌టీన‌టులు: విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృథ్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు
సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
ఎడిట‌ర్‌: ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
నిర్మాత‌లు: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ-పీడీవీ.ప్ర‌సాద్‌
క‌థ‌-స్ర్కీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం: మారుతి
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ


English summary
'Babu Bangaram' movie review. The featuring Victory Venkatesh, Nayanthara (Nayantara) in the lead roles. "Babu Bangaram" is a romantic action film with a good dose of comedy. Maruthi Dasari has written the story and screenplay, while Darling Swamy has penned the dialogues for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu