»   »  ‘బాజీరావు మస్తానీ’ మూవీ రివ్యూ

‘బాజీరావు మస్తానీ’ మూవీ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హైదరాబాద్: డిసెంబర్ 18 తేదీ కోసం ఇండియన్ సినీ అభిమానులు గత కొంత కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రెండు భారీ బాలీవుడ్ సినిమాలు విడులవుతున్నాయి. ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదలైనప్పటి నుండే సినీ ప్రియుల్లో భారీగా అంచనాలు రేకెత్తించాయి. ఇందులో ఒకటి షారుక్ నటించిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్ వాలె' సినిమా కాగా...... మరొకటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం ‘బాజీరావు మస్తానీ'. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా నటించిన ‘బాజీ రావు మస్తానీ' మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం...

కథ విషయానికొస్తే...
బాజీ రావు భల్లాల్ భట్ (రణవీర్ సింగ్) ఓటమి ఎరుగని యుద్ధ వీరుడు. అతన్ని పీష్వా బాజీరావు అని కూడా పిలుస్తుంటారు. 40 యుద్ధాలలో ఓటమి అంటే ఏమిటో తెలియని రికార్డ్ ఆయనది. ఢిల్లీ సింహాసనం నుండి మొఘలులను గద్దె దించాక దేశం మొత్తాన్ని తన పాలన కిందకి తెచ్చుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఇందులో భాగంగా యుద్ధాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు.

ఆ సంగతి అలా ఉంటే బాజీరావు మస్తానీ(దీపిక పదుకోన్) అనే ముస్లిం అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పటికే బాజీరావుకు కాశీభాయి(ప్రియాంక చోప్రా)తో వివాహం జరుగుతుంది. అయితే బాజీరావు ముస్లిం అమ్మాయిని ప్రేమించడాన్ని కుటుంబ సభ్యులు, అతని తల్లి వ్యతిరేకిస్తుంది. ఓ వైపు భారత దేశం మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని యుద్దాలు చేస్తూనే మరో వైపు తన ప్రేమను గెలుచుకోవడానికి కుటుంబ సభ్యులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో బాజీరావు ఎలా విజయం సాధించాడు అనేది తెరపై చూడాల్సిందే...

పాజిటివ్ అంశాలు...
రామ్ లీలా సినిమాలో రణవీర్ సింగ్-దీపిక పదుకోన్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ‘బాజీరావు మస్తానీ' సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరింత హయ్యెర్ లెవల్ కి వెళ్లింది. తెరపై ఇద్దరి జోడీ సూపర్బ్ అనేలా ఉంది.

రణవీర్ సింగ్ పీష్వా బాజీరావు పాత్రలో జీవించాడు. పాత్రకు తగిన విధంగా అతని ఆహార్యంతో పాటు పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. యుద్ధ వీరుడు బాజీరావు నిజంగా ఇలానే ఉంటాడు అనే ఫీలింగ్ కలించాడు. రణవీర్ సింగ్ పాత్రకు సంబంధించి సన్నివేశాల్లో, యుద్ద సన్ని వేశాల్లో రణవీర్ సింగ్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బావున్నాయి.

దీపిక పదుకోన్.... మస్తానీ పాత్రలో ఒదిగి పోయింది. ఎంతో అందంగా కనిపించడంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించింది. సినిమాలో కాశీబాయిగా ప్రియాంక చోప్రా పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగా నటించింది.

ఇతర నటీనటులు తన్వి అజ్మి, మిలింద్ సోనమ్, మహేష్ మంజ్రేకర్ తమ పాత్రలకు తగిన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అప్పటి కాలానికి తగిన విధంగా అంజు మోడి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి.

నెగెటివ్ అంశాలు....
సినిమాలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ..... కన్ ఫ్యూజింగ్ గా సాగే కథనం ప్రేక్షకులను కాస్త అసహనానికి గురి చేస్తుంది. సంజయ్ లీలా భన్సాలీ సినిమా సినిమాను గ్రాండ్ గా చూపించడానికి పెట్టిన శ్రద్ధ కథనం విషయంలో పెట్టలేనది స్పష్టమవుతోంది. మరో వైపు సినిమా చాలా స్లోగా రన్ అవడం కూడా మైనస్ పాయింటే...

టెక్నికల్ అంశాలు...
సంజయ్ లాలీ భన్సాలీ.... టేకింగ్ పరంగా తన సినిమా రేంజి ఏమిటో అద్భుతంగా చూపించాడు. విజుల్స్ పరంగా సినిమా అద్భుతంగా ఉంది. సినిమా కోసం వాడిన సెట్టింగులు, విజువల్ ఎఫెక్ట్స ఇలా ప్రతి అంశం ప్రేక్షకులు విజువల్ ట్రీట్ లా ఉంటుంది. డైలాగ్స్ కూడా బావున్నాయి. పాటలు బావున్నాయి. పాటులు తెరకెక్కించిన తీరు కూడా సూపర్బ్. ఎడిటింగ్ ఓకే. సినిమాకు హైలెట్ సినిమాటోగ్రీ.

ఫైనల్‌గా....
చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంటే కథనం ఓ రేంజిలో ఉంటుందని భావిస్తారంతా. ఈ కోణంలో ఆలోచించే ప్రేక్షకులను దర్శకుడు సంతృప్తి పరచలేక పోయాడు. అయితే సినిమాను తెరపై చూపించిన తీరు, విజువల్స్ పరంగా సరికొత్త ఎక్స్ పీరియన్స్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

బాజీరావు మస్తానీ

బాజీరావు మస్తానీ


సంజయ్‌ లీలా భన్సాలీ 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా-1‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు.

రణవీర్, దీపిక, ప్రియాంక

రణవీర్, దీపిక, ప్రియాంక


రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ఆహార్యం

ఆహార్యం


బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపించారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. బాజీరావ్‌ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకోన్ చేతిలో విల్లుతో వీరనారిగా పెర్ఫార్మెన్స్ అరదగొట్టింది.

సినిమా ఎలా ఉందంటే..

సినిమా ఎలా ఉందంటే..


చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా అంటే కథనం ఓ రేంజిలో ఉంటుందని భావిస్తారంతా. ఈ కోణంలో ఆలోచించే ప్రేక్షకులను దర్శకుడు సంతృప్తి పరచలేక పోయాడు. అయితే సినిమాను తెరపై చూపించిన తీరు, విజువల్స్ పరంగా సరికొత్త ఎక్స్ పీరియన్స్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

English summary
Bajirao Mastani is a must-watch for some exquisite visuals and out of the world performances by the lead cast. Missing this would mean missing on the treat that the movie is in a lot of senses.
Please Wait while comments are loading...