»   » బాలకృష్ణుడు మూవీ రివ్యూ: కామెడీ టచ్‌తో ఫ్యాక్షన్ డ్రామా

బాలకృష్ణుడు మూవీ రివ్యూ: కామెడీ టచ్‌తో ఫ్యాక్షన్ డ్రామా

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.5/5
  Star Cast: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, పృధ్వీ, ఆదిత్య మీనన్
  Director: పవన్ మల్లెల

  బాలకృష్ణుడు మూవీ పబ్లిక్ టాక్

  విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో యువ హీరో నారా రోహిత్‌ డిఫరెంట్ స్టయిల్. అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి లాంటి చిత్రాల తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం బాలకృష్ణుడు. ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన రెజీనా నటించింది. శరశ్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు పవన్ మల్లెల. బీ మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నారా రోహిత్‌కు సక్సెస్‌ను అందించిందా? ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకున్నదో తెలుసుకోవాంటే కథలోకి వెళ్లాల్సిందే.

  బాలకృష్ణుడు కథ

  బాలు అలియాస్ బాలకృష్ణుడు (నారా రోహిత్) అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. కిరాయి గుండాగా పనిచేస్తుంటాడు. రాయలసీమలో ప్రతాప్‌రెడ్డి (అజయ్)‌తో వైరం ఉన్న కారణంగా భానుమతి (రమ్యకృష్ణ) తన మేనకోడలు ఆద్య (రెజీనా)కు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆద్యను రక్షించుకోవడానికి బాడీగార్డ్‌గా బాలును నియమిస్తుంది. అయితే ఆద్యకు మాత్రం బాలు తనకు బాడీగార్డ్ అనే విషయం తెలియదు. ఈ క్రమంలో బాలు, ఆద్య ఒకరినొకరు ప్రేమించుకొంటారు. కానీ ఆద్య ప్రాణాలు కాపాడటం అనే బాధ్యత గుర్తు వచ్చి బాలు ప్రేమను త్యాగం చేయాలనుకొంటాడు. ఈ మధ్యలో ఆద్యను ప్రతాప్ రెడ్డి మనుషులు వెంటాడుతుంటారు.

  Error An error occurred while processing your request.

  Reference #97.a7fc645f.1540348211.faa9f11

  ఫ్యాక్షన్ జోరుకు కళ్లెం ఇలా

  భానుమతి, ప్రతాప్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఎందుకు ఏర్పడింది. ఆద్యను ప్రతాప్ రెడ్డి మనుషులు ఎందుకు చంపాలనుకొంటారు? ప్రతాప్ రెడ్డి మనుషుల నుంచి ఆద్యను ఎలా కాపాడాడు? బాలు బాడీగార్డ్ అని తెలిసిన తర్వాత ఆద్య పరిస్థితి ఏమిటి? ఆద్యపై ప్రేమను బాలు ఎలా నిలబెట్టుకొన్నాడు? భానుమతి వర్గానికి బాలు ఎలా అండగా నిలిచాడు అనేది బాలకృష్ణుడు కథ.


  బాలకృష్ణుడు విశ్లేషణ

  ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా పేరున్న నారా రోహిత్ చేసిన ఓ డిఫరెంట్ అటెప్ట్ బాలకృష్ణుడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే మాస్, మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ మల్లెల తీర్చిదిద్దారు. కమర్షియల్ అంశాలకు ఓ పక్క ప్రాధాన్యమిస్తూనే ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ కార్యెక్టర్‌తో పుష్కలమైన వినోదం పంచడంలో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఇక నారా రోహిత్ పక్కా మాస్ పాత్రలో నటించాడు. సినిమా మొత్తం నారా రోహిత్, రెజీనా, పృథ్వీ ట్రావెలింగ్ జర్నీతోనే సరదాగా గడిచిపోతుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళ్లే జర్నీకి శ్రీనివాస్‌రెడ్డి డ్రామా బృందం, తాగుబోతు రమేశ్ తదితర కార్యెక్టర్లు జోడవుతాయి. రెగ్యులర్ కామెడీ పాటలో రెండో భాగం సాగుతుంది.


  క్లైమాక్స్‌లో

  క్లైమాక్స్‌లో అన్ని చిత్రాల మాదిరిగానే విలన్ అంతమొందించడంతో సినిమాకు ఎండ్ టైటిల్ పడుతుంది. అయితే రమ్యకృష్ణ, అజయ్ పాత్ర క్యారెక్టరైజేషన్ చాలా బలహీనంగా ఉండటం, రెగ్యులర్ ఫార్మాట్‌లోనే సినిమా సాగడం ఈ చిత్రానికి లోపాలు అని చెప్పవచ్చు. ఇక రెజీనాకు పెద్దగా గుర్తుండి పోయే పాత్రేమీ కాదు. రెజీనాది ఈచిత్రంలో కీలకమైన పాత్రే అయినప్పటికీ.. దర్శకుడు పెద్దగా దృష్టిపెట్టినట్టు కనిపించదు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు విభిన్నంగా ఎక్కడా అనిపించకపోవడం వల్ల బాలకృష్ణుడు రొటీన్‌గానే అనిపిస్తాడు.


  బాలకృష్ణుడు తొలిభాగంలో

  బాలకృష్ణుడు తొలిభాగంలో రాయలసీమలో రెండు వర్గాల మధ్య రేగిన చిచ్చుతో సినిమా ఆరంభమవుతుంది. పగ, ప్రతీకారం మధ్య ఈ సినిమా సాగుతుందని తొలి పది నిమిషాల్లోనే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇక నారా రోహిత్ మాస్ ఎంట్రీతో, రెజీనా గ్లామర్‌తో అభిమానులకు పండుగల అనిపిస్తుంది. ఇక పృథ్వీ ఎంట్రీతో కామెడీ ట్రాక్ రంజుగా సాగుతుంది. ఇంటర్వెల్ వరకు సరదా సరదాగా సాగుతుంది.


  బాలకృష్ణుడు రెండోభాగంలో

  రెండోభాగంలో నారా రోహిత్, రెజీనా మధ్య రొమాంటిక్ మూడ్, ప్రేమ అంశాలతో ప్రీ క్లైమాక్స్ వరకు సాదాసీదాగా నడుస్తుంది. రెండో భాగంలో కూడా దర్శకుడు కథపై కాకుండా కామెడీనే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఎంత సేపు కథ అక్కడక్కడే తిరగడం, అనవసరపు ప్లేస్‌మెంట్‌తో పాటలు జొప్పించడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. రెగ్యులర్ ఫినిషింగ్ టచ్‌‌తో దర్శకుడు చేతులెత్తేశాడా అనే ఫీలింగ్ కలుగడం సహజం.


  దర్శకుడు పవన్ మల్లెలకు

  దర్శకుడు పవన్ మల్లెలకు తొలి చిత్రమైన భారీ బడ్జెట్ చిత్రాలను హ్యాండిల్ చేసే సత్తా కనిపించింది. బాలకృష్ణుడు కథలో తగినంత బలం ఉండి ఉంటే పవన్‌కు మంచి పేరు వచ్చేది. కథ, కథనంలో దమ్ములేకపోవడంతో మంచి దర్శకుడిగా నిరూపించకోలేకపోయాడనే చెప్పవచ్చు. యాక్షన్ సీన్లను, కామెడీ ట్రాక్‌ను నడిపిన తీరు దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది.


  రెజీనా మరోసారి గ్లామర్ తారగా

  రెజీనా మరోసారి గ్లామర్ తారగానే కనిపించింది. కథ అంతా తన చుట్టు తిరిగినా తన పాత్రకు ఎక్కడ ప్రాధాన్యం లేకపోవడం వలన రెజీనా చేయడానికి ఏమీ లేకపోయింది. సినిమా ఫుల్‌లెంగ్త్‌లో రెజీనా కనిపించినా ఎక్కడా ఆకట్టుకొనే సన్నివేశాలు రెజీనాకు పడకపోవడం వల్ల కేవలం ఆటపాటలకే పరిమితమైంది. కెరీర్‌పరంగా రెజీనాకు పెద్దగా గుర్తింపు లేని పాత్రే అని చెప్పవచ్చు.


  బాలకృష్ణుడిగా నారా రోహిత్‌

  ఎక్స్‌పరిమెంట్ సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే నారా రోహిత్‌కు బాలకృష్ణుడు ఓ డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే కథలో సత్తా ఉండి ఉంటే ఓ మంచి కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చే అవకాశం ఉండేది. హెవీ పర్సనాలిటీ కారణంగా యాక్షన్ సీన్లలో ఈజ్ అంతగా కనిపించలేదు. కొన్ని సీన్లలో నారా రోహిత్ సన్నగా కనిపించి ఆకట్టుకొన్నాడు. నటనపరంగా రోహిత్‌ను ఎక్కడా తప్పుపట్టే అవకాశం ఉండదు. ఓవరాల్‌గా నారా రోహిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.


  అదరగొట్టిన పృథ్వీ

  డిస్కవరీ మాధవరావుగా పృథ్వీ ఫొటోగ్రాఫర్‌గా మరోసారి ఆకట్టుకొన్నాడు. సినిమాకు పృథ్వీ కామెడీ వెన్నముకగా నిలిచింది. తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులకు పుష్కలంగ వినోదాన్ని పంచాడు. మరోసారి పృథ్వీ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాడు. తన ఎంట్రీ నుంచి ఎండ్ టైటిల్ వరకు పృథ్వీ కామెడీ హైలెట్‌గా నిలిచింది.


  రమ్యకృష్ణ మరోసారి పవర్..

  బాహుబలి తర్వాత రమ్యకృష్ణ ఓ పవర్‌ఫుల్ పాత్ర లభించింది. అయితే భానుమతి పాత్రలో పవర్ లేకపోవడం, కొన్ని సీన్లకే పరిమితం కావడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. రమ్యకృష్ణ కేవలం అలంకారప్రాయంగానే మిగిలింది తప్పా.. సినిమాకు పెద్దగా ఉపయోగపడిన అంశం కనిపించదు. ఇక అజయ్ విలనిజం నాసిరకంగా ఉంది. పెద్దగా ప్రభావితంగా విలన్ పాత్ర కనిపించదు.


  శ్రీనివాస్ రెడ్డి కామెడీ బృందంలో


  మిగితా పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్, రఘుబాబు కామెడీతో అలరించారు. ఇక పియా బాజ్‌పేయ్, తేజస్వి మదివాడ తదితరులు గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. రంగం ఫేం పియా బాజ్‌పేయ్ ఓ పాటలో సందడి చేసింది.


  ఫర్వాలేదనిపించిన మణిశర్మ

  మణిశర్మ సంగీతం ఫర్వాలేదని చెప్పవచ్చు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. అందుకు కారణం తెరమీద బలమైన సన్నివేశాలు లేకపోవడంతో మణిశర్మ తన ప్రతిభకు సానపెట్టడానికి ఛాన్సే దక్కలేదా అనే ఫీలింగ్ కలుగుతుంది.


  విజయ్ కుమార్ సినిమాటోగ్రపీ

  బాలకృష్ణుడు చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫీని అందించాడు. ఫారిన్ లొకేషన్లలో సన్నివేశాలను, పాటలను చాలా రిచ్‌గా ప్రజెంట్ చేశాడు. ట్రావెలింగ్ షాట్స్‌ ఆహ్లదకరంగా ఉంటాయి. సినిమా చాలా రిచ్‌గా కనిపించడానికి విజయ్ సీ కుమార్ తన వంతు ప్రయత్నం చేశారు.


  నిర్మాణ విలువలు గుడ్

  బీ మహేంద్ర, వంశీ, వినోద్ నందమూరి సంయుక్తంగా నిర్మించారు. ఖర్చుకు వెనుకాడకుండా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.


  ఫైనల్‌గా

  పాత కథకు కొత్త రంగులు అద్దిన చిత్రం బాలకృష్టుడు. గతంలో ఇలాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. కామెడీ అండతోనే ముందుకెళ్లడం బాలకృష్ణుడి బలంగా మారింది. కామెడీ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు బాలకృష్ణుడు నచ్చుతుంది.


  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  నారా రోహిత్ యాక్టింగ్
  సినిమాటోగ్రఫీ
  పృథ్వీ కామెడీ


  మైనస్ పాయింట్స్
  రొటీన్ కథ
  మ్యూజిక్, పాటలు  తెర వెనుక, తెర ముందు..

  నటీనటులు: నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, పృధ్వీ, ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్, పియా బాజ్‌పాయ్, అజయ్, తేజస్విని, శ్రావ్యారెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు
  దర్శకత్వం: పవన్ మల్లెల
  నిర్మాతలు: మహేంద్రబాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి
  కథ, మాటలు: కొలుసు రాజా
  మ్యూజిక్: మణిశర్మ
  కెమెరా: విజయ్ సీ కుమార్
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  రిలీజ్ డేట్: 2017, నవంబర్ 24
  నిడివి: 130 నిమిషాలు


  English summary
  Balakrishnudu is an Telugu romantic and action film, starring Nara Rohit, Regina Cassandra and Ramya Krishnan in lead roles. The film is directed by debutant Pavan Mallela. Melody Bramha Mani Sharma is the music director. The film is produced by B. Mahendra Babu, Musunuru Vamsi and Sri Vinod Nandamuri on Saraschandrikaa Visionary Motion Pictures and Maya Bazar Movies. This movie released on November 24th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more