twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bazaar Rowdy Review: సంపూర్ణేష్ బాబు నట విశ్వరూపం.. ఎలా ఉందంటే?

    |

    రేటింగ్ : 2.5/5
    నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..
    దర్శకుడు: వసంత నాగేశ్వరరావు
    నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు
    బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్
    మాటలు: మరుధూరి రాజా
    సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ
    ఎడిటింగ్: గౌతం రాజు
    సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్

    తెలుగు కామెడీ హీరోలలో సంపూర్ణేష్ బాబుది స్థానం ప్రత్యేకం. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా విలక్షణంగా ఉంటాయి. ఆయన తాజాగా 'బజార్ రౌడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా మీద భారీ ఎత్తున హైప్ క్రియేట్ చేసే లాగా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అదీకాక షూటింగ్ సమయంలో సంపూర్ణేష్ బాబు గాయపడటం కూడా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది మరి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ సినిమా ఆ అంచనాలు ఏమేరకు అందుకుంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    బజార్ రౌడీ కథ విషయానికి వస్తే

    బజార్ రౌడీ కథ విషయానికి వస్తే

    పుట్టిన వెంటనే తండ్రికి అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాడు కాళేశ్వర్ (సంపూర్ణేష్ బాబు). అయితే పిల్లల్ని కంట్రోల్ లో పెట్టకపోతే ఎక్కడ చేయి దాటి పోతారో అనే ఉద్దేశంతో చంద్రశేఖర రావు (నాగినీడు) చిన్న తప్పుకు కూడా ఉతికి పారేస్తూ ఉంటాడు.

    అలా తండ్రి భయంతో ఇంటి నుంచి పారిపోతాడు కాళేశ్వర్.. అయితే చంద్రశేఖర రావు బావ మరదలు మాత్రం చంద్రశేఖర రావు ఆస్తుల మీద కన్నేస్తారు. అనుకోకుండా చంద్రశేఖర రావు సొంత కొడుకు కాళేశ్వర్ ను అతని కొడుకుగా నటింపజేయడానికి తీసుకు వస్తారు. అలా ఇంటికి తిరిగి వచ్చిన కాళేశ్వర్ చివరికి ఏం చేశాడు అన్నది ఈ సినిమా కథ.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    ఈ సినిమా కథలో ట్విస్టులు ఏమాత్రం లేవు అని చెప్పక తప్పదు. సినిమా చూస్తున్నంతసేపు మనం ఎప్పుడో చూసిన సినిమానే అనిపిస్తూ ఉంటుంది.. ఎందుకంటే చాలా రొటీన్ సినిమా కావడంతో ముందు జరగబోయేది ఏమిటి అనే విషయం ప్రేక్షకులకు ఇట్టే అర్థమైపోతుంది.. సో కథలో ట్విస్టులు ఏ మాత్రం లేవు అనే చెప్పాలి.

    అలాగే క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్ట్ మినహా ఈ సినిమా మొత్తం ప్రేక్షకులు ముందుగానే అంచనా వేసే విధంగా రూపొందించారు.. సినిమా ఆసక్తికరంగా తీర్చిదిద్దాలి అనే ప్రయత్నించినా ఆ ప్రయత్నం సఫలం అయినట్లు కనిపించలేదు

    దర్శకుడి విషయానికి వస్తే

    దర్శకుడి విషయానికి వస్తే

    చాలా పెద్ద దర్శకుల దగ్గర చాలా సినిమాలకు కో-డైరెక్టర్ గా వ్యవహరించిన వసంత నాగేశ్వరరావు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.. అయితే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుల దగ్గర కో-డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన కథలో కొత్తదనం ఏమీ చూపించలేకపోయారు అనే చెప్పాలి.

    ఎందుకంటే ఇలాంటి కథతోనే మనం ఇంతకు ముందు ఎన్నో సినిమాలను చూసి ఉంటామని ఆలోచన సినిమా చూస్తున్నంతసేపు కలుగుతూ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం అయినట్లు అనిపించలేదు. సినిమా చూస్తున్నంత సేపు కూడా తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం ప్రతి ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.

    సంపూర్ణేష్ యాక్టింగ్ విషయానికి వస్తే

    సంపూర్ణేష్ యాక్టింగ్ విషయానికి వస్తే

    కామెడీ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న సంపూర్ణేష్ బాబు ఈ సినిమాతో ఓసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. ముందు నుంచి ఆయన "ఇంతవరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒకటి ఒక ఎత్తు" అని చెబుతుంటే ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు గాని అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది..

    ఐదు సంపూర్ణేష్ బాబు నటన మాత్రమే ఆకట్టుకుంది అనే చెప్పాలి.. ఎప్పటిలాగే సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో నటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. మరీ ముఖ్యంగా ఒక సీన్లో బొబ్బిలిపులి పాత్రలో నటించి ఎన్టీఆర్ ని అనుకరించే ప్రయత్నం చేశారు. అలా సంపూర్ణేష్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి.

    ఇతర నటీనటుల విషయానికి వస్తే

    ఇతర నటీనటుల విషయానికి వస్తే

    ఈ సినిమాలో నటీనటులు చాలామందే ఉన్నారు.. శాయాజీ షిండే, 30 ఇయర్స్ పృద్విరాజ్, దివంగత కత్తి మహేష్, నాగినీడు, సమీర్, షఫీ, కరాటే కళ్యాణి, జయలలిత ఇలా చాలా మంది సినిమాల్లో నటించారు.. ఎవరికి వారు తమదైన శైలిలో నటిస్తూ సినిమాని మరింత ఆకట్టుకునేలా చేశారు అనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్ గా పరిచయమైన మహేశ్వరి నటన కూడా పర్వాలేదు అనే చెప్పాలి. అయితే హీరోయిన్ కి పెద్దగా స్కోప్ ఉన్నట్లు అనిపించలేదు.. సంపూర్ణేష్ బాబు పక్కన ఆమె తనదైన శైలిలో నటించారు.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే

    ఈ సినిమాలో సాయి కార్తీక్ మ్యూజిక్ బాగా కుదిరింది. అయితే నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమా నిర్మించారు అని ముందు నుంచి చెబుతూ ఉన్నా బహుశా కెమెరా పనితనం వలన సినిమా లో బడ్జెట్ సినిమా అనిపించే విధంగా ఉంది. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా కంపోజ్ చేశారు. మంచి ఫైట్ మాస్టర్ లతో చేసి ఉండటం వలన ఆ సీన్స్ కి మాత్రం రిచ్నెస్ వచ్చినట్లు అనిపించింది.. ఇక ఉన్న పాటలు చాలా వరకు ఆకట్టుకున్నాయి. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద మరింత పని చేసి ఉండొచ్చు అని చెప్పక తప్పదు. సినిమా కథ రొటీన్ గా అనిపించడంతో మిగతా అన్ని విషయాల మీద ప్రేక్షకులు ముందుగానే అంచనాకి వచ్చేస్తారు.

    Recommended Video

    Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
    ఇక ఫైనల్ గా

    ఇక ఫైనల్ గా

    సంపూర్ణేష్ బాబు చేసిన సినిమాలన్నింటిలో ఇదే పెద్ద సినిమా అని ముందు నుంచి చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసి ఆనందించే సినిమా అని చెప్పక తప్పదు.. రొటీన్ సినిమా అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమా నడిచిన అంతసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

    ప్రస్తుతం కరోనా మహమ్మారి రెండో దశ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా ఈ రోజు ఏకంగా 300 థియేటర్లలో విడుదలైంది.. చిన్న సినిమానే అయినా ధైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కుటుంబాలతో చూసి ఆనందించదగ్గ సినిమా అని చెప్పవచ్చు.

    English summary
    Sampoornesh babu's Bazaar Rowdy movie was released today in 300 theaters. here is the review and rating in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X