For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  భాగమతి సినిమా రివ్యూ: మెప్పించిన అనుష్క

  By Rajababu
  |

  Rating:
  2.5/5
  Star Cast: అనుష్క శెట్టి, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్
  Director: అశోక్

  'Bhaagamathie' Movie Review భాగమతి సినిమా రివ్యూ..!

  ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి2 చిత్రం తర్వాత అందాల తార అనుష్క శెట్టి చేస్తున్న సినిమా భాగమతి. అత్యున్నత సాంకేతిక విలువలతో విభిన్నమై కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు జి అశోక్. గతంలో జీ అశోక్ పిల్లా జమీందార్, సుకుమారుడు చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భాగమతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న సమీక్ష ఇదే.

  భాగమతి కథ

  చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి. మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తి (ఉన్ని ముకుందన్)తో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఏకంగా మంత్రికి ఎదురుతిరుగుతుంది.

  కథలో చిక్కులకు సమాధానం

  భాగమతి బంగ్లాలో చంచలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజాయితీపరుడైన మంత్రి ఈశ్వర ప్రసాద్‌కు ఎందుకు ఎదురు తిరిగింది? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మంత్రిని ఎందుకు చంచల ఎదురించాల్సి వచ్చింది? ప్రియుడు శక్తిని చంచల ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది. తన అనుకొన్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్ర కథ.

  ఫస్టాఫ్ రివ్యూ

  మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) నిజాయితీ అయిన రాజకీయవేత్తగా చూపించడం. రైతుల సంక్షేమం కోసం ప్రాణధార అనే ప్రాజెక్ట్‌ను చేపట్టమనే అంశాలతో తొలి భాగం పాజిటివ్ నోట్‌లో ప్రారంభమవుతుంది. రాజకీయాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రక్షాళన చేయడం అనే పాయింట్‌తో ఫీల్ గుడ్‌గా సినిమా అనిపిస్తుంది. ఓ వైపు మంత్రి ఈశ్వర ప్రసాద్‌పై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం, ఆయనను ప్రజల నుంచి దూరం చేయడానికి చంచలను రంగంలోకి దించడంతో సినిమా ఓ మలుపు తిరుగుతుంది. భాగమతి బంగ్లాలో జరిగే సంఘటనలు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. పలుమార్లు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిసాయి. అనుష్క టాలెంట్‌ను మరోసారి గుర్తు చేసే విధంగా చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రథమార్థాన్ని ముగిస్తాడు.

  సెకండాఫ్ రివ్యూ

  ఇక రెండో భాగంలో కథ అనేక మలుపు తిరిగి ప్రేక్షకుడిని కొంత గందరగోళంలో పడేస్తాయి. ఊహించిన ట్విస్టులు కంగారు పెట్టిస్తాయి. సినిమా పక్కదారి తప్పుతుందా? దర్శకుడు అశోక్ తడబడుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమైన సమయంలో ఓ సామాజిక అంశాన్ని తెరమీదకు తెచ్చి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది.

  దర్శకుడు, కథ, కథనాలు

  ఇప్పటి వరకు మోస్తారు సినిమాలతోనే సరిపెట్టుకొన్న దర్శకుడు అశోక్ ఈ సారి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్న, మధ్య తరగతి దర్శకుడి రేంజ్‌కే పరిమితమైన ఆయన ఓ థ్రిల్లింగ్ కథకు అనుష్కను జోడించి మంచి హైప్‌ను సాధించాడు. అత్యున్నత సాంకేతిక విభాగాలను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయడంతో సినిమా సగం సక్సెస్ సాధించినట్టు అయింది. తొలి భాగంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంది. కానీ సెకండాఫ్‌లో కథపై పట్టుకోల్పోయాడనే భావన కలుగుతుంది. అనుష్క ఇమేజ్‌ చట్రంలో బందీ అయ్యాడా అనే ఫీలింగ్ వెంటాడుతుంది. అందుకే కథ, కథనంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఓవరాల్‌గా అశోక్ ఓకే అనిపించే విధంగా తన ప్రతిభను చాటుకొన్నారు.

  అనుష్క మరోసారి ..

  అరుంధతి, దేవసేన, రుద్రమదేవి లాంటి బరువైన పాత్రలతో అనుష్క తెలుగు ప్రేక్షకులు సుపరితులు. అదే కోవలో ఈ సారి చంచల పాత్రతో అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాధ్యతాయుతమైన అధికారిగా, సమాజం పట్ల అంకిత భావం ఉన్న ప్రభుత్వ ఉద్యోగిగా అనుష్క మళ్లీ అద్భుతంగా కనిపించింది. భాగమతి బంగ్లాలో అనుష్క చేసిన నట విన్యాసం మరోసారి గత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కథలో ఉండే కొన్ని లోపాల వల్ల అనుష్క ఆ రేంజ్‌లో విజ‌ృంభించలేదా అనిపిస్తుంది. కాకపోతే భాగమతిలో అనుష్క అన్నితానై సినిమాను తన భుజాలపై మోసింది. వన్ ఉమన్ షోతో అనుష్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

  జయరాం నటనా ప్రతిభ

  భాగమతి చిత్రంలో అనుష్క తర్వాత ఎక్కువ ఆకట్టుకొన్నది తమిళ నటుడు జయరాం. రెండు రకాల షేడ్స్‌లో జయరాం తన మార్కును చాటారు. తొలిభాగంలో సాఫ్ట్‌గా మెప్పించిన ఆయన సెకండాఫ్‌లో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. అనుష్కతో పోటాపోటీగా నడిచిన సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు. భాగమతి చిత్రానికి ఆయన నటన అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో మురళీశర్మ, ఉన్ని ముకుందన్ తదితరులు నటించారు. అనుష్కకు ప్రియుడిగా, సామాజిక కార్యకర్తగా ఉన్ని ముకుందన్ తన పాత్రకు న్యాయం చేకూర్చాడు. కీలకమైన సన్నివేశాల్లో ఉన్ని మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. మురళీశర్మకు ఎప్పటిలానే ఓ మంచి పాత్ర లభించింది. పోలీస్ అధికారిగా రాణించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇలాంటి పాత్రలు మురళీశర్మకు కొట్టిన పిండే అని చెప్పవచ్చు.

  కామెడీ పూయించిన గ్యాంగ్

  ఇక కామెడీ విభాగాన్ని ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్ లీడ్ చేశారు. ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ మధ్య ఉండే సీన్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం ఖాయం. ధన్ రాజ్‌ది కామెడి టచ్ ఉన్న సీరియస్, సింపతీ క్యారక్టర్. అలాంటి క్యారెక్టర్‌ను ధన్‌రాజ్ అవలీల పండించాడు. కొంత సీరియస్ నోట్‌లో సాగే ఈ చిత్రంలో వీరి కామెడీ కొంత రిలీఫ్‌గా ఉంటుంది.

  రవీందర్ ఆర్ట్ వర్క్

  భాగమతి సినిమాకు వెన్నముకగా మారిన సాంకేతిక అంశాల్లో కళా విభాగం ఒకటి. కళా దర్శకుడు రవీందర్ రూపొందించిన భాగమతి బంగ్లా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. దాదాపు మూడు కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ సెట్‌ తెర మీద అద్భుతంగా కనిపిస్తుంది. రవీందర్ కృషి ప్రతీ ఫ్రేమ్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భాగమతి సక్సెస్‌లో రవీందర్‌కు పెద్ద పీటే దక్కడం ఖాయం.

  మాధీ సినిమాటోగ్రఫీ హైలైట్

  భాగమతి సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం సినిమాటోగ్రఫీ. థ్రిల్లర్ కావాల్సిన లైటింగ్‌ను, యాంబియెన్స్‌‌ను చక్కగా వాడుకోవడంలో ఆర్ మాధీ వందశాతం సక్సెస్ అయ్యాడు. భాగమతి సినిమాను మరో మెట్టు ఎక్కించడానికి మాధీ ప్రతిభ ఎంతగానో తోడ్పాటునందించినట్టు చెప్పవచ్చు.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  భాగమతి సినిమాను యూవీ క్రియేషన్ బ్యానర్‌పై నిర్మాతలు వీ వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కేఈజీ రాజా రూపొందించారు. ఉత్తమ నిర్మాణ విలువలకు పెద్ద పీట వేసే ఈ బ్యానర్.. భాగమతిని కూడా అదేస్థాయిలో తెరకెక్కించింది. అత్యున్నత సాంకేతిక విలువలు తెర మీద ఆకట్టుకునే విధంగా భాగమతిని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ మరోసారి సక్సెస్ అయింది.

  తుదితీర్పు

  అనుష్క క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అల్లుకొన్న కథ భాగమతి. అయితే నాలుగైదు అంశాల మధ్య కథ కొంత గందరగోళంలా అనిపిస్తుంటుంది. కథనం సెకండాఫ్‌లో ఇబ్బందిగానే ఉంటుంది. కథ, కథనాలపై దర్శకుడు అశోక్ మరింత దృష్టిపెట్టి ఉంటే మరో అరుంధతి కోవలో చేరేది. ఈ సినిమా సరైన స్థాయిలో ప్రేక్షకుడిని మెప్పించలేదనే విమర్శ వస్తే దర్శకుడి ఖాతాలో వేసుకోవాల్సిందే. నటీనటులు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకొన్నారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరినట్లయితే మరో సూపర్‌హిట్ కావడానికి అవకాశం ఉంది. అన్నికోణాల్లో పరిశీలించిన తర్వాత ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనుష్కకే దక్కడం ఖాయం.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  అనుష్క ఫెర్ఫార్మెన్స్
  మిగితా నటీనటులు
  ఆర్ట్ విభాగం పని తీరు
  మాధీ సినిమాటోగ్రఫీ
  తమన్ సంగీతం

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  సెకండాఫ్ కథనం
  ఫస్టాఫ్‌ స్లో నేరేషన్

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు: అనుష్క శెట్టి, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, మురళీ శర్మ, విద్యుల్లేఖ రామన్, తదితరులు
  దర్శకత్వం: జీ అశోక్
  నిర్మాతలు: వీ వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కేఈజీ రాజా
  మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
  సినిమాటోగ్రఫీ: ఆర్ మాధీ, సుశీల్ చౌదరీ
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  బ్యానర్: యూవీ క్రియేషన్స్, గ్రీన్ స్టూడియో
  రిలీజ్ డేట్: జనవరి 26, 2018
  నిడివి: 142 నిమిషాలు

  English summary
  After Arundhati and Rudhramadevi, Anushka Shetty is back with yet another female-centric movie in the form of Bhaagamathie. The film, directed by G Ashok Malayalam actor Unni Mukundan, has paired up with her in the multilingual flick, which has Asha Sarath, Prabhas Sreenu, Dhanraj, Murali Sharma and others in the cast.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more