For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భైరవ గీత మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Bhairava Geetha Movie Review భైరవ గీత మూవీ రివ్యూ | Filmibeat Telugu

  Rating:
  2.5/5
  Star Cast: ధనుంజయ్, ఇరా మోర్, బాలరాజ్‌వాడీ
  Director: సిద్ధార్థ్ తాతోలు

  రంగస్థలం, RX 100 సినిమాల తర్వాత గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలకు డిమాండ్ పెరిగింది. నేటివిటి సినిమాలకు క్రేజ్ పెరుగడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టి వాటిపై పడింది. ఆర్జీవి స్కూల్ నుంచి సిద్ధార్థ అనే యువ దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం భైరవగీత. రిలీజ్‌కు ముందు టీజర్లకు, ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో భైవర గీత డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా వర్మ అభిమానులను సంతృప్తి పరిచిందా? యువ దర్శకుడి పనితీరు ప్రేక్షకులను మెప్పించిందా? హీరో, హీరోయిన్లుగా నటించిన ధనుంజయ్, ఇరా ఆకట్టుకొన్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

   భైరవ గీత మూవీ స్టోరి

  భైరవ గీత మూవీ స్టోరి

  రాయలసీమలో భూస్వామి సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) వద్ద భైరవ పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి కూతురు గీత (ఇరా మోర్)ను తొలి చూపులోనే ఇష్టపడుతాడు. ఒకానొక సమయంలో ప్రాణాలను తెగించి ప్రత్యర్థి దాడుల నుంచి గీతను కాపాడటంతో భైరవ అంటే ఇష్టం కలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే ఫ్యాక్షన్ నేతతో గీతకు నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థ కార్యక్రమంలో కాబోయే భర్తను గీత చెంపపై కొట్టడం, ఆ తర్వాత తండ్రి సుబ్బారెడ్డితో గొడవ పడి భైరవను పెళ్లి చేసుకొంటానని తెగేసి చెబుతుంది.

  భైరవ గీత మూవీ ట్విస్టులు

  భైరవ గీత మూవీ ట్విస్టులు

  తన కూతుర్ని బుట్టలో వేసుకొన్న భైరవను అంతమొందించడానికి ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో భైరవ, గీత పారిపోతారు. పారిపోయిన భైరవ, గీత‌లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? భైరవ నుంచి సుబ్బారెడ్డికి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. బానిస బతుకు నుంచి విముక్తి కావడానికి భైరవ ఎలాంటి పోరాటం చేశాడు. సుబ్బారెడ్డి, కేశవరెడ్డి, (భాస్కర్ మన్యం), కట్టారెడ్డి ఆగడాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే భైరవ గీత.

  ఫస్టాఫ్‌లో

  ఫస్టాఫ్‌లో

  పక్కా గ్రామీణ, ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం భైరవ గీత. భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థ, ఫ్యాక్షన్ రాజకీయాల్లో కనిపించే అంశాలను హైలెట్ చేస్తూ కథ మొదలవుతుంది. ఉన్నత చదువులకు వెళ్లిన గీత ఊర్లోకి రావడం, ఆమెను చూసి భైరవ ఇష్టపడటం లాంటి అంశాలతో రొటీన్‌గా మారుతాయి. కాకపోతే ఇంటెన్సివ్ టేకింగ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఊరు చూడటానికి వెళ్లిన గీతను సుబ్బారెడ్డి ప్రత్యర్థులు దాడి చేసే అంశం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గీతపై దాడి తర్వాత తన వద్ద పనిచేసే వ్యక్తి (పులి లక్ష్మణ్)ను సజీవంగా దహనం చేసే సీన్ నేచురల్‌గా ఉంటుంది. ఇక తొలిభాగంలో నల్లోడు (దయానంద్) పాత్రను మలిచిన తీరు ఆకట్టుకొంటుంది. ఓ భారీ ఛేజింగ్‌, ఆసక్తికరమైన సన్నివేశంతో తొలి భాగం ముగుస్తుంది.

  సెకండాఫ్‌లో

  సెకండాఫ్‌లో

  ఇక సెకండాఫ్‌లో సుబ్బారెడ్డి, భైరవకు మధ్య దాడులు, ప్రతీదాడుల అంశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. సుబ్బారెడ్డిపై తిరుగుబాటు చేయడానికి భైరవ ఊరి ప్రజలను ఏకం చేయడం లాంటి సీన్లు 80వ దశకంలోని బీరం మస్తాన్ రావు, మాదాల రంగారావు సినిమాలను గుర్తు తెస్తాయి. మితీమీరిన హింస, జుగుప్సకరమైన కొన్ని సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉంటాయి. భూస్వాములపై అణగదొక్కబడిన ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడి ప్రతిభ

  భైరవ గీతను తెరకెక్కించిన విధానం చూస్తే యువదర్శకుడు సిద్దార్థ్‌లో మెచ్యురిటీ కనిపిస్తుంది. మేకింగ్‌పై కాకుండా కథ, కథనాల్లో ఇంటెన్సెటిపై దృష్టిపెట్టి ఉంటే కొంత ఎమోషనల్ కంటెంట్ సినిమాకు ప్లస్ అయ్యేది. ప్రతీ సన్నివేశంలోనూ రక్తం ఏరులా ప్రవహించడం సాధారణ ప్రేక్షకులకు ఇబ్బంది అనే విషయాన్ని దర్శకుడు మరిచిపోయినట్టు ఉన్నాడు. కొన్ని సీన్లు అయితే పూనకం వచ్చినట్టు చిత్రీకరించారు. కట్టారెడ్డి ఇంట్రడక్షన్ సీన్‌లో మర్డర్ ఎపిసోడ్ చాలా దారుణంగా అనిపిస్తుంది. అలాగే కట్టారెడ్డి హత్య కూడా అలాంటి ఫీలింగ్‌నే కల్పిస్తుంది. హీరో, హీరోయిన్ల లిప్‌లాక్‌పైనే దృష్టిపెట్టకుండా కొంత కెమిస్ట్రీని వర్కవుట్ చేసి ఉంటే బాగుండేదేమో. తొలిభాగంలో పట్టు సాధించినట్టు కనిపించిన దర్శకుడు సిద్ధార్థ్ సెకండాఫ్‌లో తేలిపోయాడనిపిస్తుంది. ఓవరాల్‌గా సిద్ధార్థ్ భవిష్యత్‌లో మంచి దర్శకుడయ్యే స్కోప్ మాత్రం కనిపించింది.

  హీరో ధనుంజయ గురించి

  హీరో ధనుంజయ గురించి

  భైరవ పాత్రలో ధనుంజయ్ చక్కగా నటించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో తడబాటు కనిపించింది. పట్టి పట్టి డైలాగ్‌లు చెప్పించడం కొంత డిస్ట్రబ్‌గా అనిపిస్తుంది. ఇరాతో కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. సున్నితమైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడం మరీ నాటుగా అనిపించింది. తల్లి హత్యకు గురయ్యే ఎపిసోడ్‌లో నటన బాగుంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు.

  ఇరా మోర్ గ్లామర్

  ఇరా మోర్ గ్లామర్

  గీతగా ఇరా మోర్ అందంతో ఆకట్టుకొన్నది. లిప్‌లాక్ లాంటి బోల్డు సీన్ల జంకు లేకుండా నటించింది. కొంత యాక్షన్ సీన్లు చేసే అవకాశాన్ని బాగానే ఉపయోగించుకొన్నది. కథలో ఫ్యాక్షన్ మోతాడు ఎక్కువ కావడంతో గ్లామర్ పండించడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. ఇరా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఒకట్రెండు పాటల్లో హాట్‌హాట్‌గా కనిపించింది.

  విలన్ పాత్రల్లో నటీనటులు

  విలన్ పాత్రల్లో నటీనటులు

  ఫ్యాక్షన్ లీడర్లుగా బాలరాజ్‌వాడి, భాస్కర్ మన్యం, విజయ్ రామ్‌ తన పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. మరీ నాటుగా ఊగిపోవడం తప్ప ఎమోషనల్ సీన్లు లేకపోవడంతో వారి ప్రతిభ పెద్దగా బయటకు కనిపించలేదు. వీరి పాత్రల్లో పేరున్న నటీనటులు ఉంటే మరింత బాగుండేదేమో అనిపిస్తుంది.

  ఇతర పాత్రల్లో

  ఇతర పాత్రల్లో

  ఫ్యాక్షన్ గ్రూపుల్లో దయానంద్, పులి లక్ష్మణ్ పాత్రలు ఎలివేట్ అయ్యాయి. RX 100 తర్వాత దయానంద్‌కు మంచి పాత్ర దొరికింది. తనకు లభించిన అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు దయానంద్ న్యాయం చేశాడు. మిగితా పాత్రల్లో చిన్న నటులు బాగా ఆకట్టుకొన్నారు.

  జగదీష్ సినిమాటోగ్రఫి

  జగదీష్ సినిమాటోగ్రఫి

  భైరవ గీత చిత్రానికి సినిమాటోగ్రఫి హైలెట్‌ అని చెప్పవచ్చు. కడప, బాదామి ప్రాంతాల్లోని లోకేషన్లను అద్భుతంగా తెరకెక్కించారు. హాలీవుడ్ సినిమాల్లో గ్రాండ్ కానన్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రధానంగా ఫ్యాక్షన్‌లో ఉండే నాటు అంశాలను జగదీష్ చీకటి తెరకెక్కించిన విధానం బాగుంది. జగదీష్ వాడుకొన్న లైటింగ్ సీన్లను మరింత ఎలివేట్ చేశాయి. రియలిస్టిక్‌గా అనిపించాయి.

  మ్యూజిక్

  మ్యూజిక్

  భైరవ గీతకు రవి శంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. పాటల కంటే రీరికార్డింగ్ బాగుంది. చేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో బీజీఎం అదిరిపోయేలా ఉంది. అన్వర్ అలీ ఎడిటింగ్ పనితీరు బాగుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  భైరవ గీత మూవీని రాంగోపాల్ వర్మ, అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించారు. రాయలసీమ నేటివిటి ఫ్లేవర్‌ను మిస్ కాకుండా రియలిస్టిక్‌గా రూపొందించారు. ప్రధానంగా రెండో భాగంలో కథపై మరింత దృష్టిపెట్టాల్సింది. నటీనటులు ఎంపిక కూడా ఆకట్టుకొనేలా లేదు. బలమైన విలన్ పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులు తేలిపోయారు. నటీనటులు ఎంపిక బాగుంటే మూవీ రేంజ్ మరింత పెరిగి ఉండేది. సినిమా అవుట్ పుట్ మరింత బెటర్‌గా వచ్చి ఉండేది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఫ్యాక్షన్, మితి మీరిన హింస, నాటు అంశాలతో తెరకెక్కిన చిత్రం భైరవ గీత. ఎమోషన్ కంటెంట్ ఎక్కడ వర్కవుట్ కాకపోవడం సినిమాకు మైనస్. తిరుగుబాటు ఎపిసోడ్స్‌లో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ చాలా ఫ్లాట్‌గా, ఆసక్తి లేకుండా కొనసాగడం ప్రతికూలమని చెప్పవచ్చు.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  ధనుంజయ్, ఇరా మోర్ నటన
  డైరెక్టర్ టేకింగ్
  సినిమాటోగ్రఫి
  ఫస్టాఫ్

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్
  కథ, కథనాలు
  పాటలు
  నటీనటుల ఎంపిక

   తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: ధనుంజయ్, ఇరా మోర్, బాలరాజ్‌వాడీ, విజయ్ రామ్, భాస్కర్ మన్యం, దయానంద్ తదితరులు
  దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు
  నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, అభిషేక్ నామా, భాస్కర్ రాశి
  సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
  ఎడిటింగ్: అన్వర్ అలీ
  మ్యూజిక్: రవిశంకర్
  రిలీజ్: 2018-12-14
  ప్రిమీయర్: 2018-12-12 (ఏఎంబీ సినిమాస్)

  English summary
  The Telugu version of Siddhartha Shankar's Bhairava Geetha starring Dhananjaya and Irra Mor set to release on December 14, The release of Ram Gopal Varma presented film was postponed due to the delay in its censorship. After Censor clearance, This movie released. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X