twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారత్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.5/5
    Star Cast: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, టుబు, సునీల్ గ్రోవర్
    Director: అలీ అబ్బాస్ జాఫర్

    బాలీవుడ్‌లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న సల్మాన్ ఖాన్ భజ్‌రంగీ భాయ్‌జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ సినిమాలతో నటుడిగా ప్రశంసలు పొందారు. అటు మాస్.. క్లాస్ సినిమాలతో బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా విలక్షణమైన, భావోద్వేగమైన కథతో, విభిన్నపాత్రలతో భారత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్లామర్ పాత్రలకే పరిమితమైన కత్రినా కైఫ్ ఓ భావోద్వేగమైన పాత్రలో నటించారనే విషయం ప్రమోషన్ కార్యక్రమంలో వ్యక్తమైంది. భారత్ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలరించిందా? సల్మాన్ ఖాన్ మళ్లీ బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడా? కత్రినా కైఫ్ తన ప్రతిభతో ఆకట్టుకొన్నదా అనే ప్రశ్నలకు సమాధానమే భారత్.

    భారత్ మూవీ స్టోరీ

    భారత్ మూవీ స్టోరీ

    భారత్ (సల్మాన్ ఖాన్) దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు బయలుదేరుతారు. ఆ క్రమంలో తన తండ్రి (జాకీ ష్రాఫ్), చెల్లెలు గుడియా (టబు) జనరద్దీ తోపులాటలో తప్పిపోతారు. భారత్ తన తల్లి, చెల్లెలు, సోదరులతో ఢిల్లీకి తిరిగివస్తారు. పాకిస్థాన్ నుంచి బయలు దేరుతున్న సమయంలో తనకు ఏదైనా జరిగితే కుటుంబాన్ని చూసుకొనే బాధ్యత నీదే... ఏ క్షణంలోనైనా కుటుంబ బాధ్యతలు వదలిపెట్టకు అని చెబుతాడు. అలా తండ్రి, చెల్లెలు దూరమైన బాధతో బాల్యంలోనే కుటుంబ బాధ్యతను భుజానకెత్తు కొంటాడు.

     భారత్ సినిమాలో మలుపులు

    భారత్ సినిమాలో మలుపులు

    కుటుంబ పోషణ కోసం సర్కస్‌లో బైక్ రైడర్‌గా, అలాగే కుటుంబ పోషణ కోసం గల్భ్‌లో చమురు బావిలో పనిచేసే వ్యక్తిగా, అలాగే నేవీలో ఉద్యోగిగా ఎందుకు మారాడు? తండ్రి చెప్పిన మాటలను తుచ తప్పకుండా పాటించాడా? తన జీవిత ప్రయాణంలో ఎదురైన కుముద్‌కు తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడు? భారత్ ప్రేమను కుముద్ అంగీకరించిందా? తప్పిపోయిన తన తండ్రి, చెల్లెలు తిరిగి కలిశారా? అనే ప్రశ్నలకు సమాధానమే భారత్ సినిమా కథ.

     ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    60 ఏళ్ల భారత్ జీవితంలో ఓ కీలకమైన, భావోద్వేగమైన అంశాన్ని టచ్ చేస్తూ కథ ప్రారంభమవుతుంది. తన మనసుకు, సెంటిమెంట్‌కు సంబంధించిన అంశాన్ని తన వద్ద నుంచి లాక్కోవడాన్ని ఎదురించడంతో కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్తాడు. ఈ క్రమంలో తన జీవిత కథను చెప్పడం ప్రారంభిస్తాడు. పాకిస్థాన్, భారత విభజన సమయంలో ప్రజలు పడిన కష్టాలు, తమ మూలాలను వెతుక్కుంటూ వచ్చే దేశానికి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. భారత్‌లోని ఓ ముస్లిం అబ్బాయిని పాకిస్థాన్ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నకు ఇక్కడే పుట్టాం. ఇక్కడే చస్తాం అనే జవాబు ప్రేక్షకుడిని కదిలించేలా ఉంటుంది. భారత్ తన జీవితంలోని పలు దశలను దాటుకొంటూ ఎలా వెళ్లాడనే అంశాలను చెబుతూ ఓ ఎమోషనల్ పాయింట్ వద్ద తొలి భాగం ముగుస్తుంది. తొలి భాగంలో కాస్త నింపాదిగా కథ చెప్పడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందికి గురిచేసినట్టు అనిపించినా.. ఎమోషనల్ సీన్లు, కామెడీ ప్రేక్షకుడిని కథలో లీనం చేసేలా చేస్తుంది.

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో భారత్ కుటుంబాన్ని ఎదురయ్యే సమస్యలు, చెల్లెలి పెళ్లి, నేవీలో ఉండగా సముద్ర దొంగల దాడి లాంటి అంశాలు, ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ సాగుతుంది. ఇక చివర్లలో... విభజన సమయంలో పాకిస్థాన్, భారత్‌లో తప్పి పోయిన కుటుంబాలను కలిపి ఎపోసిడ్ సినిమాకు హైలెట్‌గా అనిచెప్పవచ్చు. సల్మాన్, టుబు నటన భావోద్వేగానికి గురిచేస్తుంది. అంతేకాకుండా కంటతడి పెట్టించేలా ఉంటుంది.

    దర్శకత్వం, టేకింగ్

    దర్శకత్వం, టేకింగ్

    దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రాసుకొన్న కథ, కథనాలే సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు. జాకీష్రాఫ్, సల్మాన్ ఖాన్ మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా మలిచిన తీరు హృదయానికి హత్తుకొన్నాయి. భారత్‌గా సల్మాన్ ఖాన్ జీవితంలో పలు దశలను, పాత్రలను తీర్చి దిద్దిన తీరు బాగుంది. సునీల్ గ్రోవర్ పాత్రను రాసుకొన్న విధానం సినిమాను వినోదాత్మకంగా మలిచింది. ఫ్యామిలీ సెంటిమెంట్, దేశభక్తి లాంటి అంశాలతో కథను అల్లుకొన్న తీరు మరీ బాగుంది. సినిమా రెండో భాగాన్ని తెరకెక్కించిన విధానం భజరంగీ భాయ్‌జాన్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చింది.

    సల్మాన్ ఫెర్ఫార్మెన్స్

    సల్మాన్ ఫెర్ఫార్మెన్స్

    నటుడిగా పరిణితి చెందుతున్నాడని చెప్పడానికి భారత్‌లో సల్మాన్ చేసిన పలు పాత్రలే నిదర్శనం. 1964లో సర్కస్‌లో స్టంట్ మాస్టర్‌గా, 1970లో మైనింగ్‌లో పనిచేసే కూలీగా, 1985లో నేవీలో పనిచేసే ఆఫీసర్‌గా, 1990లో వయసు మీద పడిన వ్యక్తిగా వివిధ గెటప్స్‌లో సల్మాన్ ఖాన్ తెర మీద మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. కత్రినాతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా వృద్ధుడి పాత్రలో సల్మాన్ ఒదిగిపోయాడు. వయసు మీద పడినప్పటికీ.. భార్యతో చేసే రొమాన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉంది. ఈ సినిమాను సల్మాన్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.

    కత్రినా కైఫ్ యాక్టింగ్

    కత్రినా కైఫ్ యాక్టింగ్

    ఇప్పటివరకు కనిపించిన విధంగా కత్రినా కైఫ్ కుముద్ పాత్రలో మెప్పించారు. ఎమోషనల్‌గాను, గ్లామర్ గాను ఆకట్టుకొన్నది. యువతిగా, వృద్దురాలిగా రెండు రకాల షేడ్స్ ఉన్నా పాత్రలో కనిపించింది. వృద్ధురాలిగా ఇంకా మేకప్ విషయంలో శ్రద్ద తీసుకొని ఉండాల్సింది. కత్రినా పోషించిన కుముద్ పాత్ర కృత్రిమంగా కనిపించినా.. నటిగా ఆమె మరో మెట్టు ఎక్కినట్టు కనిపించింది.

     మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో టుబు, జాకీ ష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్ పాత్రలు సినిమాలో కీలకంగా కనిపిస్తాయి. సునీల్ గ్రోవర్ కామెడీని పండిస్తూనే ఎమోషలన్ సీన్లలో బాగా నటించాడు. జాకీ ష్రాఫ్‌ది చిన్నపాత్ర అయినప్పటికీ.. గుర్తుండిపోయే పాత్ర. టుబుది కేవలం పది నిమిషాల పాత్ర అయినప్పటికీ.. సినిమా మొత్తాన్ని ఎమోషనల్ కంటెంట్‌తో ఊపేసే పాత్ర. కాకపోతే ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు విషయంలో ఏదో కొంత అసంతృప్తి కలుగుతుంది. దిశా పటానీ పాత్ర కూడా చిన్నదే.... ఓ పాటలో గ్లామర్‌ను పండించింది.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్ అంతగా గొప్పగా లేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. పాటలు తెర మీద అంత ఆసక్తిని, జోష్‌ను కలిగించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంతలో కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. గల్ఫ్, ఇతర దేశాల్లోని ప్రాంతాలను అద్భుతంగా తెరకెక్కించారు.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    రీల్ లైఫ్ ప్రొడక్షన్, సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్లపై అతుల్ అగ్నిహోత్రి, కిషన్ కుమార్, అల్వీరా ఖాన్ తదితరులు ఈ సినిమాను రూపొందించారు. పాత్రలకు ఎంపిక చేసుకొన్న నటులు తీరు బాగుంది. సినిమాను రిచ్‌గా, మంచి క్వాలిటీతో రూపొందించారు. మ్యూజిక్ విషయంలో కాస్త శ్రద్ద తీసుకొని ఉండాల్సింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    భారత, పాకిస్థాన్ విభజన సమయంలో ఆ దేశానికి చెందిన ప్రజలు అక్కడికి ఈ దేశానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లే సమయంలో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితుల ఆధారంగా భారత్ సినిమా రూపొందింది. సల్మాన్ ఖాన్ నటన, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన సినిమా అని చెప్పవచ్చు. సల్మాన్ కెరీర్‌లో నిలిచి పోయే మరో సినిమా అనిచెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    • సల్మాన్ ఖాన్
    • అలీ అబ్బాస్ జాఫర్ టేకింగ్
    • కత్రినా ఫెర్ఫార్మెన్స్
    • సునీల్ గ్రోవర్ కామెడీ
    • మైనస్ పాయింట్స్

      • పాటలు, మ్యూజిక్
      • స్లో నేరేషన్
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, టుబు, సునీల్ గ్రోవర్, దిశాపటానీ
        దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్
        నిర్మాతలు: అతుల్ అగ్నిహోత్రి, కిషన్ కుమార్, అల్వీరా ఖాన్ తదితరులు
        మ్యూజిక్: విశాల్ శేఖర్
        బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జులియస్ పాకియమ్
        సినిమాటోగ్రఫి: మార్సిన్ లాస్కవీక్
        ఎడిటింగ్: రామేశ్వర్ భగత్
        బ్యానర్: రీల్ లైఫ్ ప్రొడక్షన్, సల్మాన్ ఖాన్
        రిలీజ్: 2019-06-05

    English summary
    Bharath movie review and rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X