For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ మూవీ రివ్యూ

  |
  Bilalpur Police Station Movie Review || Filmibeat Telugu

  Rating:
  2.5/5

  రంగస్థలం, RX 100 చిత్రాల తర్వాత గ్రామీణ నేపథ్యం, తెలుగు, తెలంగాణ నేటీవిటీ ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకొన్నది. తెలంగాణ మాండలికానికి, నేపథ్యానికి పెద్ద పీటవేస్తూ వచ్చిన చిత్రం బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్. గ్రామీణ పరిస్థితులు, ప్రజల జీవన విధానంతో తెరకెక్కిన సామాజిక అంశాలను అంతర్లీనంగా చూపెడుతూ ఓ ప్రేమకథగా రూపొందిన సినిమా ఎలాంటి స్పందనను కూడగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కథ

  బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సూర్య (మాగంటి శ్రీనాథ్) ఎస్‌ఐగా ట్రాన్స్‌ఫర్ అవుతాడు. నీతి, నిజాయితీ అతని నైజం. సంఘ విద్రోహులపై కొరడా ఝలిపిస్తుంటాడు. గ్రామంలో ఎప్పుడూ ఉంటే చిన్న చిన్న గొడవల మధ్య ఓ దొంగతనం కేసు, ఓ అమ్మాయి మిస్పింగ్ కేసు వివాదంగా మారుతుంది. సూర్య ఉద్యోగానికి సవాల్‌గా నిలుస్తుంది.

  కథలో ట్విస్టులు

  అమ్మాయి మిస్పింగ్ కేసుకు ఎలాంటి పరిష్కారం లభించింది? దొంగతనం కేసులో భాగంగా జరిగిన మర్డర్ మిస్టరీని సూర్య ఎలా చేధించాడు? పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే సురేందర్ (గోరేటి వెంకన్న) కుమార్తె శ్రీలత (శాన్వీ మేఘన)తో ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. ఉద్యోగ బాధ్యత సమర్థతను ఎలా నిరూపించుకొన్నాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్.

  సినిమా విశ్లేషణ

  బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రధానంగా గ్రామంలోని చిన్న చిన్న సమస్యల నేపథ్యంగా వినోదంగా సాగుతుంది. తెలంగాణలో ఉండే ఆచార వ్యవహారాలు, పెళ్లిళ్లలో జరిగే కొట్లాటలకు ఈ సినిమా అద్దం పడుతుంది. కథనంలో కొన్ని లోపాలు ప్రేక్షకుడిని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. సామాజిక అంశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. కానిస్టేబుల్ పాత్ర నిజాయితీతనం, భోళా వ్యక్తిత్వంలో కొత్త దనం కనిపిస్తుంది. పలు అంశాలను మేలవించకుండా ఒక బలమైన పాయింట్ ఆధారంగా కథ నడిపించి ఉంటే మరింత ఆకట్టుకొనేలా ఉండేది. సామాజిక అంశాలతోపాటు యువతను ఆకట్టుకునే స్వచ్ఛమైన ప్రేమకథ కూడా అంతర్లీనంగా సాగడం సినిమాకు అదనపు ఆకర్షణగా అనిపిస్తుంది.

  దర్శకుడు ప్రతిభ

  దర్శకుడు నాగసాయి మాకం ఆలోచన దృక్పథం బాగుంది. కాకపోతే తన వంటకానికి సమకూర్చుకొన్న మసాలాలు సరిగా వినియోగపరుచుకోలేదనే అంశం కనిపిస్తుంది. ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న పాత్ర మలిచిన విధానం.. అలాగే మరో పోలీస్ (కిరణ్) రోల్‌‌తో చెప్పించిన డైలాగ్స్ దర్శకుడిలోని ప్రతిభకు అద్దంపట్టాయి. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే నేటివిటీ సినిమాల్లో గొప్పగా మిగిలేది. తన పరిమితులు, వనరుల మేరకు దర్శకుడు బిలాల్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌కు న్యాయమే చేశాడని చెప్పవచ్చు.

  హీరో మాగంటి సూర్య పెర్ఫార్మెన్స్

  యువ హీరో మాగంటి శ్రీనాథ్ సూర్యగా ఆకట్టుకొన్నాడు. ఎమోషనల్ సీన్లలో ఆయన నటన బాగుంది. ఆవేశంతో కూడిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. కథలో ఉన్న పరిమితుల వల్ల పాటలకు, డ్యాన్సులకు స్కోప్ లేకపోయింది. కానీ ఫైట్స్, ప్రీక్లైమాక్స్‌లో వచ్చే సీన్లలో తనదైన నటనతో అలరించాడు. బరువైన పాత్రలు లభిస్తే వాటిని సమర్ధంగా పోషించే ప్రతిభ ఉందనే సంకేతాలను శ్రీనాథ్ తన పాత్ర ద్వారా చెప్పగలిగాడు. నటన, ఇతర అంశాలను మెరుగుపరచుకొంటే మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది.

  హీరోయిన్‌గా శాన్వీ మేఘన

  హీరోయిన్ శాన్వీ మేఘన పాత్రకు పెద్దగా ప్రధాన్యం లేకపోయింది. కానీ ఉన్న కొన్ని సీన్లలో తనకు లభించిన అవకాశానికి న్యాయం చేకూర్చింది. ఒక పాటలో తన ఫెర్ఫార్మెన్స్‌ను చక్కగా ప్రదర్శించింది. గ్లామర్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడం, కథలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

  గోరెటి వెంకన్న , మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రాల్లో హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌గా గోరెటి వెంకన్న పాత్ర సినిమా వెన్నుముకగా ఉంటుంది. తాగుబోతుగా డాక్టర్ మల్లేష్ బలాస్ట్ నేచురాలిటీని ప్రదర్శించాడు. కానిస్టేబుల్‌గా కిరణ్ భావోద్వేగమైన నటనను చూపించాడు. వెంకట్ గోవాడ మరికొందరు కమెడియన్ల పాత్రలు కథకు బలంగా మారాయి.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల వాతావరణాన్ని అందాన్ని బాగా చూపించాడు. పోలీస్ గొప్పదనం చెబుతూ సుద్దాల అశోక్ తేజ రాసిన ‘నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్' అనే పాట సాహిత్య విలువలను చాటింది. గోరటి వెంకన్న, మౌనశ్రీ మల్లిక్ పాటలు సాహిత్య విలువలతో సాగాయి. గ్రామీణ కథకు కావాల్సిన మంచి సంగీతాన్ని సాబూ వర్గీస్ అందించాడు. ఎంఎస్ క్రియేషన్స్ సంస్థ ఉన్నత నిర్మాణ విలువలు ఉన్నాయి. రాజీ పడుకుండా సినిమాను తెరకెక్కించిన నిర్మాత మహంకాళీ శ్రీనివాస్‌‌కు సినిమాపై ఉన్న అభిరుచికి ఈ సినిమా అద్దంపట్టింది.

  ఫైనల్‌గా

  కమర్షియల్ హంగులకు, వల్గారిటీ, హాట్ సన్నివేశాలకు చోటులేకుండా స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రంగా బిలాల్ పూర్‌ పోలీస్ స్టేషన్ రూపొందింది. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. రెగ్యులర్‌ సినిమాలను ఆశించే ప్రేక్షకులను పక్కనపెడితే వైవిధ్యంతో కూడిన ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చేలా ఉంటుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరిస్తే మంచి విజయాన్ని అందుకోవడం గ్యారెంటీ.

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు - మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు

  సాంకేతిక వర్గం -
  సినిమాటోగ్రఫీ - తోట వి రమణ,
  ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్,
  సంగీతం - సాబూ వర్గీస్,
  రీ రికార్డింగ్ - జీబూ,
  డీటీఎస్ - రాజశేఖర్,
  పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా,

  కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్,

  రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.

  నిర్మాణ సంస్థ - ఎంఎస్ క్రియేషన్స్

  రిలీజ్ డేట్: మార్చి 15, 2019

  English summary
  Bilal Pur Police Station set to release in March. Produced by Mahankali Srinivas, Directed by Naga Sai Makam. Maganti Srinath and Shanvi Meghana are lead. In this occasion, Telugu filmibeat brings review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more